• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు.. భవిష్యత్తులో పెరుగుతాయా..? తగ్గుతాయా..?

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు.. భవిష్యత్తులో పెరుగుతాయా..? తగ్గుతాయా..?

Gold Silver Rates Fluctuations: మార్కెట్లో బంగారం, వెండి ధరలు వినియోగదారుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. హెచ్చుతగ్గులు గుబులు పుట్టిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఒడిదుడుకులు మార్కెట్ ను కుదిపేస్తున్నాయి. రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు క్రమేణ తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం కొంటే... భవిష్యత్తులో తిరుగులేదనుకున్న వినియోగదారులు... ధరల తగ్గుదలతో దిగులు పడుతున్నారు. బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు ఎందుకొస్తున్నాయి..? భవిష్యత్తులో పెరిగే అవకాశాలున్నాయా..? ఇంకా తగ్గిపోతాయా..? జీ తెలుగు న్ూస్ స్పెషల్

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 02, 2026, 04:16 PM IST|Updated: Nov 02, 2026, 04:20 PM IST
joinshare
బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు.. భవిష్యత్తులో పెరుగుతాయా..? తగ్గుతాయా..?
Image Credit: Gold Silver Rates (Source/AI)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Manchu Lakshmi: గొప్పమనసు చాటుకున్న మంచు లక్ష్మి.. తెలంగాణలోని 48 ప్రభుత్వ పాఠశాలల దత్తత.!.

Manchu Lakshmi: గొప్పమనసు చాటుకున్న మంచు లక్ష్మి.. తెలంగాణలోని 48 ప్రభుత్వ పాఠశాలల దత్తత.!.

2

Zee Entertainment: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏఐ, ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా తుషార్‌ వొహ్రా నియామకం

3

Rohit Bigg Boss Elimination: బిగ్‌బాస్‌ 10 హౌస్ నుంచి రోహిత్ ఎలిమినేషన్..కారణం ఇదే? ఎంత సంపాదించాడంటే?

4

IPL 2027 Retention List: రూ.14.2 కోట్ల ఆటగాడికి CSK షాక్..! యంగ్ ఆల్‌రౌండర్‌కు గుడ్‌ బై..?

5

Amit Shah Speech: హైదరాబాద్‌లో అమిత్‌ షా సంచలన ప్రసంగం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gold Silver Rates: బంగారం ధరలు ప్రతిరోజూ ప్రపంచ దేశాల్లో హెచ్చుతగ్గులతో అమ్మకాలు జరుగుతున్నాయి. బంగారాన్ని లోహపు వస్తువుగా కొన్ని దేశాల్లో కొనుగోలు చేస్తుంటే... మరికొన్ని దేశాల్లో ఆభరణాలకోసం కొనుగోలు చేస్తున్నారు. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ నగల షాపుల్లో కొనుగోలు దారులతో కళకళలాడుతున్నాయి. భారత దేశంలో ఎక్కువమంది వినియోగదారులు పండుగ రోజులు, వివాహాది శుభకార్యాలకు బంగారం, వెండిని విరివిగా కొనుగోలు చేస్తున్నారు.

భారత దేశంలో దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీపూజ నిర్వహిస్తారు. ధన త్రయోదశి సందర్భంగా బంగారంతో అమ్మవారిని ఆరాధించేందుకు ప్రాధాన్యత ఇస్తారు. శుభకార్యాలకు సంబంధించి బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో బంగారం ధరలు హెచ్చతగ్గులతో దోబూచులాడుతున్నాయి.

బంగారం ధరలు ఒడిదుడుకులు..

ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికాలో ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు పసిడిపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు చైనాలో పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి నగదుగా మార్చుకుంటున్నారన్న అంచనాలు కూడా మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి.

అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న బంగారం..

సాధారణంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ఈసారి మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలపడటంతో ఇతర కరెన్సీల వారికి బంగారం ఖరీదైపోవడం వల్ల డిమాండ్ కొంత తగ్గింది. గత జనవరిలో రికార్డు స్థాయికి చేరిన ధరల తర్వాత, లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు   బంగారాన్ని విక్రయించి నగదుగా మార్చుకుంటున్నారు.

అంతర్జాతీయ పరిస్థితులు.. 
అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, సౌదీ-హౌతీల మధ్య ఘర్షణ.. ఇలా అంతర్జాతీయ పరిస్థితులు మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతుంటాయి. ఈ క్రమంలోనే బంగారం ధరలు భారీగా తగ్గాయి... తులంపై దాదాపు 1800 రూపాయల వరకు ధర తగ్గింది. జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయితో పోలిస్తే బంగారం ధర దాదాపు 30 శాతం తగ్గడం గమనార్హం. అక్టోబర్ 30న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ముందుగా  ఔన్సుకు 3,980.40 డాలర్లకు పడిపోయింది. జూలై 17 తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి ఇది. డిసెంబర్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 3,991.10 డాలర్లకు దిగివచ్చాయి. అయితే అదే రోజు తర్వాతి ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది.

వెండి కొనుగోలు పై దృష్టి..

కిలో వెండి ధర నాలుగు లక్షల ఇరవై వేలతో 2026 సంవత్సర ఆరంభంలో రికార్డుస్థాయిలో పెరిగింది. వెండిని కొనుగోలు చేస్తే ఆర్థికంగా ప్రయోజనం ఉంటుందని బంగారం తర్వాత వెండి కొనుగోలుపై దృష్టి సారించారు. ఇటీవల వెండి ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.  జనవరిలో కేజీ వెండి ధర నాలుగు లక్షల ఇరవై వేలతో రికార్డు స్థాయిని తాకింది. ఇపుడు  వెండి ధరలు మార్కెట్లో అమాంతంగా పడిపోయాయి.  ప్రస్తుతం దాని విలువ 50 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది. ప్రస్తుత మార్కెట్‌లో కేజీ వెండి ధర రెండు లక్షల రూపాయలకు అమ్ముడవుతోంది. రెండు వారాల క్రితం కిలో వెండి రెండు లక్షల నలభై వేలరూపాయలున్న దీంతో వెండిని కొనుగోలు చేసిన వినియోగదారులు.. మానసికంగా సతమతమవుతున్నారు.

చైనాలో విదేశీ పెట్టుబడులపై నిషేధం.. బంగారం ధరల తగ్గుదలకు కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా ఆంక్షలతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తుండటంతో బంగారం ధరలు దిగివచ్చాయని స్విస్ వెల్త్ మేనేజ్ మెంట్ సంస్ధ జూలియస్ బేర్ అభిప్రాయ పడింది. నిధుల సమీకరణకోసం ఇన్వెస్టర్లు అమ్ముతున్న బంగారంవల్ల ధరల తగ్గుదలకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అమెరికా ద్రవ్యోల్భణ ఆందోళనలు..

ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికాలో ద్రవ్యోల్బణ ఆందోళనలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు పసిడిపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు చైనాలో పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి నగదుగా మార్చుకుంటున్నారన్న అంచనాలు కూడా మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. సాధారణంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ఈసారి మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలపడటంతో ఇతర కరెన్సీల వారికి బంగారం ఖరీదైపోవడం వల్ల డిమాండ్ కొంత తగ్గింది. గత జనవరిలో రికార్డు స్థాయికి చేరిన ధరల తర్వాత, లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు   బంగారాన్ని విక్రయించి నగదుగా మార్చుకుంటున్నారు.

టెక్నాలజీ షేర్ల పెరుగుదల.. 

అక్టోబర్ 30న అమెరికా టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు కూడా బంగారంపై ప్రభావం చూపాయి. కృత్రిమ మేధ రంగంలో కంపెనీలు చేస్తున్న భారీ పెట్టుబడుల నుంచి ఆశించిన రాబడులు వస్తాయా? అన్న సందేహాలతో టెక్ షేర్లు పడిపోయాయి.  అమెరికా ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి వృద్ధి చెందడం, సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం వేగవంతం కావడం ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి.  
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gold Rate
Silver Rate
Business News
Business Ideas