• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /కండబలం కంటే బుద్ధిబలం ఎంతో గొప్పది...అని చెబుతున్న మంత్రి - చెప్పుల మూట నీతి కథ..!!

కండబలం కంటే బుద్ధిబలం ఎంతో గొప్పది...అని చెబుతున్న మంత్రి - చెప్పుల మూట నీతి కథ..!!

Moral Story: కండబలం కంటే బుద్ధిబలం ఎంతో గొప్పది. ఎలాంటి క్లిష్ట సమస్యనైనా ఆవేశపడకుండా, సమయస్ఫూర్తితో, తెలివిగా ఆలోచించి పరిష్కరించుకోవచ్చు. అలాగే దొంగతనం, మోసం ఎప్పటికైనా బయటపడక తప్పవు.

Written ByBhoomi
Published: Nov 16, 2026, 13:03 IST|Updated: Nov 16, 2026, 13:05 IST
joinshare
కండబలం కంటే బుద్ధిబలం ఎంతో గొప్పది...అని చెబుతున్న మంత్రి - చెప్పుల మూట నీతి కథ..!!
Image Credit: Moral Story:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Moral Story: అనగనగ విజయపురి అనే రాజ్యంలో మహారాజు ప్రజా ప్రతినిధులతో కలిసి రాజ్య వ్యవహారాలను చర్చిస్తూ, సామాన్య ప్రజల సమస్యలను ఆలకిస్తున్న సమయమది. ఇంతలో కొందరు వర్తకులు ఆందోళనగా, దిగులు నిండిన ముఖాలతో సభలోకి అడుగుపెట్టారు. వారంతా రాజుగారికి నమస్కరించి, "ప్రభూ! మీరే మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి, మాకు న్యాయం చేయాలి" అంటూ వేడుకున్నారు. వారి ఆవేదనను గమనించిన రాజుగారు, వారిని శాంతింపజేసి, "భయపడకండి, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి" అని అభయమిచ్చారు.

అప్పుడు ఆ వర్తకుల బృందంలోని ఒక పెద్దాయన ముందుకు వచ్చి, "మహారాజా! మేమంతా చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన సామాన్య పాదరక్షల వ్యాపారులం. ప్రతి వారం మేము ఎంతో కష్టపడి తయారు చేసిన నాణ్యమైన చెప్పులను పెద్ద పెద్ద మూటలుగా కట్టి, ఎడ్లబండ్లపై వేసుకుని రాజధాని సంతకు అమ్ముకోవడానికి తీసుకొస్తుంటాము. అయితే, ఈరోజు తెల్లవారుజామున మేము వస్తుండగా అడవి మార్గంలోని నిర్మానుష్య ప్రదేశంలో కొందరు ముసుగు దొంగలు మాపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మమ్మల్ని బెదిరించి, మా బండ్లపై ఉన్న చెప్పుల మూటలన్నింటినీ దోచుకుని అడవిలోకి పారిపోయారు. మా పెట్టుబడి అంతా పోయి మేము రోడ్డున పడ్డాము ప్రభూ" అని తమ బాధను వెళ్లగక్కాడు.

వారి మాటలు ఎంతో శ్రద్ధగా విన్న రాజుగారి ప్రధాని, "మహారాజా ఇలాంటి దొంగల ముఠాలు తాము దోచుకున్న సరుకును వెంటనే బయటపెట్టరు. కొద్ది రోజులు రహస్య ప్రాంతాల్లో దాచిపెట్టి, ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా వేరే సంతల్లో చౌక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటారు" అని తన అనుభవంతో కూడిన అభిప్రాయాన్ని చెప్పారు.

"మరి ఈ దొంగల ఆట కట్టించి, మన వర్తకులకు న్యాయం చేయడానికి మనమేం చేద్దాం" అని రాజుగారు మంత్రిని ప్రశ్నించారు.

"దీనికి నా దగ్గర ఒక చక్కని ఉపాయం ఉంది ప్రభూ... ఆ దొంగలే స్వయంగా మన భటులకు చిక్కేలా చేస్తాను" అని చెప్పిన మంత్రి, ఆ వ్యాపారులను సభ బయటకు పిలిచి, వారి చెవిలో ఏదో రహస్య ప్రణాళికను వివరించి, తిరిగి వారి గ్రామాలకు పంపించేశారు.

సరిగ్గా వారం రోజులు గడిచాయి. మళ్లీ సంత రోజు రానే వచ్చింది. ఆ వ్యాపారులు ఎప్పటిలాగే తమ ఎడ్లబండ్లపై పెద్ద పెద్ద చెప్పుల మూటలు వేసుకుని రాజధాని వైపు బయలుదేరారు. ఊహించినట్లుగానే, అడవి మార్గంలో మాటువేసిన ఆ దొంగల ముఠా మరోసారి వ్యాపారులపై దాడి చేసి, బండ్లపై ఉన్న మూటలన్నింటినీ ఎత్తుకెళ్లింది.

దాంతో వ్యాపారుల్లో ఒకరు తీవ్ర నిరాశతో, కోపంతో, "చూశావా రాజుగారు, మంత్రిగారు మనకు అండగా ఉంటారని ఎంతో ఆశపడ్డావు. కానీ ఏం లాభం? ఈ వారం కూడా మన కష్టార్జితం ఆ దొంగల పాలైంది. ఇక మనం కోలుకోవడం కష్టమే" అన్నాడు.

అందుకు వర్తకుల్లో ఒకరైన రామయ్య ఎంతో ధైర్యంగా, ప్రశాంతంగా, "నిరాశపడకు మిత్రమా! మంత్రిగారి తెలివితేటల మీద, ఆయన వేసిన పథకం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మనం ఆయన చెప్పినట్లే చేశాము కదా, కాబట్టి మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. కొద్ది రోజులు ఓపిక పట్టు" అని తోటి వ్యాపారులకు సర్దిచెప్పాడు.

రెండు మూడు రోజులు గడిచాక, రాజధాని నగరంలోని ఒక మారుమూల సంతలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు అక్కడ గుట్టలుగా పాదరక్షలు పోసి అతి తక్కువ ధరకే అమ్ముతున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి అక్కడికి చేరిన జనం, ఆ చెప్పులను చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ కుప్పలో ఉన్నవన్నీ కేవలం ఎడమ కాలి చెప్పులు మాత్రమే! ఒక్క కుడి కాలి చెప్పు కూడా అందులో లేదు. జత లేకుండా కేవలం ఒకే కాలి చెప్పులను అమ్మడం చూసి కొనుగోలుదారులు ఆశ్చర్యపోయి, "ఇదేం మోసం?" అంటూ ఆ వ్యాపారులతో పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు.

ఆ సంతలో మారువేషంలో గస్తీ కాస్తున్న రాజభటులకు ఈ గొడవ గురించి తెలిసి, వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ఆ చెప్పుల మూటలతో సహా రాజాస్థానానికి తీసుకొచ్చారు.

మంత్రి వారిని చూసి చిరునవ్వుతో, "మహారాజా! మన వ్యాపారుల సరుకును దోచుకున్న దొంగలు వీళ్లే! వీరి రహస్య స్థావరంపై దాడి చేస్తే గత వారం దోచుకున్న మిగతా సరుకు కూడా దొరుకుతుంది" అని ప్రకటించారు.

ఆశ్చర్యపోయిన రాజుగారు, "అది సరేగానీ మంత్రివర్యా, ఇంత పెద్ద నగరంలో వీళ్లు ఇంత సులభంగా మన వలలో ఎలా చిక్కారు?" అని ఆసక్తిగా అడిగారు.

అప్పుడు మంత్రి తన యుక్తిని వివరిస్తూ, "ప్రభూ! మొన్న వ్యాపారులు మన దగ్గరకు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు, ఈసారి సంతకు వెళ్లేటప్పుడు మూటల్లో కేవలం ఎడమ కాలి చెప్పులను మాత్రమే నింపి తీసుకెళ్లమని, కుడి కాలి చెప్పులను ఇంటి దగ్గరే భద్రంగా ఉంచమని చెప్పాను. దొంగలు ఆ మూటలను దోచుకెళ్లినా, ఒంటి కాలి చెప్పులను ఎవరూ కొనరు కదా! వాటిని అమ్మడానికి ప్రయత్నించినప్పుడు కచ్చితంగా జనం మధ్య గొడవ జరుగుతుందని, ఆ రచ్చ ద్వారా మన భటులకు వీళ్లు సులభంగా దొరికిపోతారని ఊహించాను. అనుకున్నట్లుగానే నా పథకం నూటికి నూరు శాతం ఫలించింది" అని వివరించారు.

మంత్రి సమయస్ఫూర్తిని, ముందుచూపును మహారాజు మనస్ఫూర్తిగా అభినందించి విలువైన బహుమతితో సత్కరించారు. వెంటనే భటులను పంపి దొంగల స్థావరంలో దాచిన మిగతా చెప్పుల మూటలను స్వాధీనం చేసుకుని, ఆ వ్యాపారులకు అప్పగించారు. దొంగలకు కఠిన కారాగార శిక్ష విధించారు.

అందుకే కండబలం కంటే బుద్ధిబలం ఎంతో గొప్పది. ఎలాంటి క్లిష్ట సమస్యనైనా ఆవేశపడకుండా, సమయస్ఫూర్తితో, తెలివిగా ఆలోచించి పరిష్కరించుకోవచ్చు. అలాగే దొంగతనం, మోసం ఎప్పటికైనా బయటపడక తప్పవు. 

Also Read: 

 

తరచూ అలసట, తల తిరగడం వేధిస్తున్నాయా? విటమిన్ B12 లోపం కావొచ్చు..!!

 

సామాన్యుడికి బియ్యం మంట.. ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేసినా కిలో సన్నబియ్యం రూ.100..!!

 

OPS కోసం రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సామూహిక సెలవు..!!

 


 

Add Zee News as a Preferred Source
TAGS:
Moral Stories
Motivational Stories
Telugu News