• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /విక్రయ ఒప్పందానికి ముందే ఊహించని ట్విస్ట్.. రూ. 2,122 కోట్ల విలువైన ఆస్తులను తగ్గించుకున్న IDBI బ్యాంక్..!!

విక్రయ ఒప్పందానికి ముందే ఊహించని ట్విస్ట్.. రూ. 2,122 కోట్ల విలువైన ఆస్తులను తగ్గించుకున్న IDBI బ్యాంక్..!!

IDBI Bank Sale: ఐడీబీఐ బ్యాంక్ అమ్మానికి సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ తన రెండు స్థిరాస్తుల విలువను రూ. 2,122కోట్లకు తగ్గించింది. అయితే బ్యాంక్ తన వార్షిక నివేదికలో ఈ ఆస్తుల పేర్లను వెల్లడించకపోవడం గమనార్హం. అంతేకాదు విలువ తగ్గింపునకు గల కారణాన్ని కూడా వివరించలేదు.

Written ByBhoomi
Published: Nov 16, 2026, 11:21 IST|Updated: Nov 16, 2026, 11:23 IST
joinshare
విక్రయ ఒప్పందానికి ముందే ఊహించని ట్విస్ట్.. రూ. 2,122 కోట్ల విలువైన ఆస్తులను తగ్గించుకున్న IDBI బ్యాంక్..!!
Image Credit: IDBI Bank Sale

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IDBI Bank Sale: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ మరోసారి వివాదానికి కేంద్రబిందువుగా మారింది. కెన్యాకు చెందిన ప్రముఖ సంస్థ ఫెయిర్ ఫాక్స్ కు ఈ బ్యాంకు వాటాలను విక్రయించేందుకు ఈమధ్యే కేంద్ర మంత్రి వర్గం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మకపు ప్రక్రియ జరుగుతున్న కీలక తరుణంలో బ్యాంకు తన స్థిరాస్తుల విలువను భారీగా తగ్గించుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బిజినెస్ వరల్డ్ జర్నలిస్ట్ పలక్ షా వెల్లడించిన రిపోర్టు ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్ తన దగ్గరున్న 2 ప్రధాన ఆస్తుల విలువను ఏకంగా రూ. 2,122 కోట్లు తగ్గించుకోవడం గమనార్హం.

అయితే ఈ భారీ తగ్గింపునకు సంబంధించిన అంశాన్ని బ్యాంకు తన వార్షిక రిపోర్టులో ప్రస్తావించలేదు. కేవలం ఒక వాఖ్యానికే పరిమితం చేసింది. అంతేకాదు ఆ రెండు ఆస్తుల పేర్లు ఏంటో కూడా పేర్కొనలేదు. వాటి విలువలో భారీ వ్యత్యాసం రావడానికి గల అసలు కారణాలేంటన్న విషయాలు మాత్రం బ్యాంకు ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు. చట్టపరమైన కొన్ని పరిమితుల కారణంగా ఆ ఆస్తులను ఇంతకుముందులా సులభంగా విక్రయించే ఛాన్స్ లేకపోవడం వల్లే వాటి విలువను తగ్గించాల్సి వచ్చిందని బ్యాంక్ చెబుతున్నా.. ఈ వ్యవహారంపై ఆర్థిక వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చకు దారి తీసింది.

గతంలో అంటే 2025 మార్చిలో స్వతంత్ర మదింపుదారుల నిర్వహించిన అంచనాల్లో బ్యాంకు ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో పెరిగినట్లు రిపోర్టు వెల్లడించింది. ఆ సమయంలో బ్యాంకు భూమి, భవనాల మొత్తం విలువ రూ. 11,383కోట్లు ఉంది. అయితే తాజా సర్దుబాట్ల తర్వాత మార్చి 2026 నాటికి అది రూ. 8,881 కోట్లకు పడిపోయింది. ఈ క్షీణతలో రూ. 2,122 కోట్ల కోత కీలక పాత్ర పోషించినట్లు రిపోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఫెయిర్ ఫాక్స్ డీల్స్ కోసం ఒక్క షేరు ధరను రూ. 81 నిర్ణయించే సమయంలో ప్రభుత్వ నియమిత మదింపు సంస్థ ఈ తగ్గించిన ధరల ఆధారంగానే అంచనాలు రూపొందించిందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. 

అయితే ప్రభుత్వ వర్గాల వాదన ప్రకారం.. హైదరాబాద్ లోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్యాంకు శిక్షణా కేంద్రం క్యాంపస్, ముంబైలోని లీజు ప్రాతిపదికన ఉన్న మెయిన్ బ్రాంచ్ ఈ వివాదంలో కేంద్రంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ లోని శిక్షణా కేంద్రం భూమిని ఏ ఇతర వ్యక్తికి లేదా సంస్థకు బదిలీ చేసేందుకు వీల్లేదని నిబంధనలు ఉన్నాయి. ఇలాంటి చట్టపరమైన అడ్డంకులు ఉన్న ఆస్తులు ప్రైవేట్ సంస్థ చేతికి వెళ్లిన తర్వాత వాటి భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న ఇప్పుడు వ్యక్తం అవుతోంది.

మొత్తంగా ఐడీబీఐ బ్యాంకు విక్రయ ప్రక్రియలో పూర్తి పారదర్శకత కొరవడిందన్న విమర్శలు కూడా గుప్పుమంటున్నాయి. ఆస్తుల మదింపునకు సంబంధించిన పూర్తి నివేదికలను బహిరంగ పర్చాలని.. అసలు ఆ రెండు ఆస్తులు ఏంటో స్పష్టం చేయాలని వాణిజ్య, ఉద్యోగ సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ విక్రయ నిర్ణయం, ఆస్తుల విలువ తగ్గింపునకు సంబంధించి  వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వస్తేనే ఈ వివాదానికి తెరపడే ఛాన్స్ ఉంది.

Also Read: 

 

తరచూ అలసట, తల తిరగడం వేధిస్తున్నాయా? విటమిన్ B12 లోపం కావొచ్చు..!!

 

సామాన్యుడికి బియ్యం మంట.. ప్రభుత్వం రేట్లు ఫిక్స్ చేసినా కిలో సన్నబియ్యం రూ.100..!!

 

OPS కోసం రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సామూహిక సెలవు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Reserve Bank of India
Telugu News