‘నా మాట విన్నారు.. బంగారం ధరలు తగ్గాయి’.. పసిడి రేట్లపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
PM Modi on Gold Prices: బంగారం ధరలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగారం కొనుగోళ్లు తగ్గించాలని తాను చేసిన విజ్నప్తి మేరకు దేశ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
PM Modi on Gold Prices: బంగారం ధరలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగారం కొనుగోళ్లు తగ్గించాలని తాను చేసిన విజ్నప్తి మేరకు దేశ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు తన మాట విని కొనుగోళ్లు తగ్గించడంతో బంగారం ధరలు దిగివచ్చాయన్నారు. దీంతో వారి డబ్బు ఆదా అయ్యిందన్నారు. లఖ్ నవూలోని గోమతీ నగర్ లో శనివారం జరిగిన 5వ జాతీయ నైపుణ్య స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏడాది పాటు అత్యవసరం అయితే తప్పా బంగారం కొనవద్దని నేను దేశ ప్రజలను కోరాను. గతంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడినప్పుడు.. ఒక పూట భోజనం మానేయ్యాలని మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చారు. అప్పుడు ప్రజలు ఆయన మాటను తూచా తప్పకుండా పాటించారు. నా దేశ ప్రజల స్వభావం ఇప్పటికీ అలాగే ఉంది. నాలాంటి సామాన్య వ్యక్తి చేసిన విజ్నప్తిని మన్నించి ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించారు. మోదీ గారూ మీ మాట విని మా డబ్బు ఆదా చేసుకున్నామంటూ ఇప్పుడు ప్రజలు నాతో చెబుతున్నారూ అంటూ వివరించారు.
ఈ ఏడాది మే నెలలో, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగి, దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ హైదరాబాద్‌లో జరిగిన ఒక ర్యాలీలో తన తొలి విజ్ఞప్తి చేశారు. "దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏడాది పాటు బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలని" ఆయన ప్రజలను కోరారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఇంటి నుంచే పనిని తిరిగి ప్రారంభించడం వంటి పలు ఇతర విజ్ఞప్తులు కూడా ఆయన చేశారు.
ప్రధాని విజ్ఞప్తి అనంతరం, బంగారం డిమాండ్, ధరలు గణనీయంగా పడిపోయాయి. గణాంకాల ప్రకారం, మే 9న ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 15,250 ఉండగా, ఇప్పుడు అది రూ. 12,523కు పడిపోయింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఏప్రిల్, అక్టోబర్ మధ్య బంగారం దిగుమతులు దాదాపు 40 శాతం తగ్గి, $24.78 బిలియన్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంలో దిగుమతుల విలువ $41.24 బిలియన్లుగా ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 29 శాతం తగ్గి 162 టన్నులకు పడిపోయిందని అది పేర్కొంది. ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు, ప్రభుత్వం మే నెలలో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.
Also Read: