SBI క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఈ తప్పులు చేస్తే భారీగా బాదుడే..!!
SBI Credit Card Charges: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్న నిరుపయోగదారులకు బిగ్ అలర్ట్. ఎస్బీఐ కార్డ్ (SBI Card) తమ క్రెడిట్ కార్డ్ నిబంధనలు .. ఛార్జీలలో కీలక మార్పులు ప్రకటించింది.
SBI Credit Card Charges: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్న నిరుపయోగదారులకు బిగ్ అలర్ట్. ఎస్బీఐ కార్డ్ (SBI Card) తమ క్రెడిట్ కార్డ్ నిబంధనలు .. ఛార్జీలలో కీలక మార్పులు ప్రకటించింది. ఈ నూతన మార్గదర్శకాలు రాబోయే డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా పెట్రోల్/డీజిల్ రవాణా ఖర్చుల కోసం క్రెడిట్ కార్డును విరివిగా ఉపయోగించే వారిపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపనుంది.
మీరు ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి పెట్రోల్, డీజిల్, రవాణా ఖర్చుల కోసం అదనంగా చెల్లించేవారిపై అదనపు ఛార్జీలు విధించబడతాయి. కొత్త ఫీజు నిబంధనలు డిసెంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి. ఎస్‌బిఐ కార్డ్ వినియోగదారులు దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా అదనపు ఛార్జీ:
ఎస్‌బిఐ కార్డ్ నిబంధనల ప్రకారం.. ఒక బిల్లింగ్ సైకిల్‌లో మొత్తం ఇంధన లావాదేవీలు రూ. 50,000 దాటితే, మొత్తం ఇంధన ఖర్చుపై ఒక శాతం అదనపు ఛార్జీ విధించబడుతుంది. ఉదాహరణకు, మీరు ఒక నెలలో పెట్రోల్, డీజిల్ కోసం రూ. 55,000 ఖర్చు చేస్తే, మీరు అదనంగా రూ. 550 చెల్లించాల్సి ఉంటుంది. రూ. 60,000 దాటితే, రూ. 600 అదనపు ఛార్జీ విధించబడుతుంది. రూ. 75,000 దాటితే, ఈ ఛార్జీ రూ. 750కి పెరుగుతుంది.
రోజువారీ వాహనాలు నడిపే వారు, టాక్సీ డ్రైవర్లు, సుదూర ప్రయాణాలు చేసేవారు ఈ మార్పు గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. అయితే, ఈ ఛార్జీ అన్ని చిన్న ఇంధన లావాదేవీలకు వర్తించదు. నిర్దేశించిన పరిమితి.. సంబంధిత లావాదేవీ వర్గం ఆధారంగా ఈ రుసుమును లెక్కిస్తారు.
రవాణా ఛార్జీలపై కూడా 1శాతం రుసుము:
ప్రతి రవాణా సంబంధిత లావాదేవీ విలువ రూ. 30,000 దాటితే, లావాదేవీ మొత్తంపై 1శాతం అదనపు ఛార్జీ విధించబడుతుంది. ఉదాహరణకు రూ.35,000 విలువైన రవాణా లావాదేవీ జరిగితే రూ.350 అదనపు ఛార్జీ విధించబడుతుంది. ఫ్రైట్, టోల్ ఛార్జీలు, బ్రిడ్జ్ ఫీజులు బస్సు సర్వీసుల వంటి కొన్ని వర్గాలు ఈ కేటగిరీ కిందకు రావచ్చు.
ఎవరిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది?:
సాధారణంగా చిన్న మొత్తాల కోసం క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారిపై ప్రభావం తక్కువగా ఉండవచ్చు. అయితే, వ్యాపార అవసరాలు, తరచుగా ప్రయాణాలు, అధిక ఇంధన ఖర్చుల కోసం వ్యక్తిగత క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కార్డు ద్వారా చెల్లింపు చేసే ముందు, అధికారిక SBI కార్డ్ వెబ్‌సైట్‌లో మీ కార్డుకు వర్తించే తాజా ఛార్జీ వివరాలు.. నిబంధనలు, షరతులను తనిఖీ చేయడం ఉత్తమం. చిన్న పొరపాటు కూడా భారీ నష్టాలకు దారితీయవచ్చు. జాగ్రత్తగా ఉండండి.
Also Read: