• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /కెరీర్
  • /కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? సుప్రీం కోర్టులో 250 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? సుప్రీం కోర్టులో 250 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

Supreme Court Jobs 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్నవారికి భారీ శుభవార్త. సుప్రీం కోర్టు జేసీఏ నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 250 ఖాళీలను ఈ పోస్టుల ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన అర్హత, జీతభత్యాల వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 01, 2026, 10:55 AM IST|Updated: Oct 01, 2026, 10:57 AM IST
joinshare
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? సుప్రీం కోర్టులో 250 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
Image Credit: Supreme Court Jobs 2026

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

కేంద్ర ప్రభుత్వ కొలువు కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. జూనియర్‌ కోర్టు అసిస్టెంట్‌ పోస్టులు మొత్తం 250 భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదువుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులు గ్రూప్‌ బీ నాన్‌ గెజిటెడ్‌ కేటిగిరీ పే లెవల్‌ 6 ఆధారంగా జీతాలు ఉంటాయి.

సుప్రీం కోర్టు జేసీఏ రిక్రూట్మెంట్‌ 2026 అక్టోబర్‌ 7వ తేదీ నుంచి ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. అధికారిక వెబ్‌సైట్‌ www.sci.gov.in క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ అబ్జెక్టివ్‌ టెస్ట్, టైపింగ్‌ స్పీడ్‌, డిస్క్రీప్టివ్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

సుప్రీం కోర్టు జూనియర్‌ కోర్టు అసిస్టెంట్‌ నోటిఫికేషన్‌ 2026..
సుప్రీం కోర్టు జూనియర్‌ కోర్టు అసిస్టెంట్‌ 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు బేసిక్‌ పే రూ.35,400 నుంచి ప్రారంభ వేతనం లభిస్తుంది. ఇక ఎంపిక ప్రక్రియ అబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌, డిస్క్రిప్టీవ్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ 2026 అక్టోబర్‌ 7 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్‌ అర్హత, పోస్టుల వివరాలు పొందుపరిచారు.

అర్హత వివరాలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి. టైపింగ్‌ స్పీడ్‌ నిమిషానికి 35 పదాలు టైప్‌ చేయాలి. వయస్సు సెప్టెంబర్‌ 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి ఏజ్‌ రిలాక్సేషన్‌  కూడా లభిస్తుంది.

సుప్రీం కోర్టు జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌, అన్‌రిజర్వ్‌డ్‌ రూ.1500, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్‌ క్రిమీలేయర్‌), ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు రూ.750 చెల్లించాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs
Job Notification
Govt Jobs