SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vijay Deverakonda: నన్ను తొక్కేయడం కోసం 1000 అకౌంట్లు.. విజయ్ దేవరకొండ బయటపెట్టిన భయంకర నిజం..!

Vijay Deverakonda:విజయ్ దేవరకొండ ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. తనపై వచ్చే విమర్శలకు తాను తగ్గబోనని స్పష్టం చేశారు. ‘నా జర్నీ వాళ్లకు నచ్చకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా?’ అంటూ తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు.

Written By Vishnu Priya
Published: Oct 08, 2026, 08:25 PM IST | Updated: Oct 08, 2026, 08:33 PM IST
Join

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'రణబలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

తనపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి విజయ్ దేవరకొండ ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. “మీ మీద ఎందుకు అంత HATE?” అనే ప్రశ్నకు తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చిన విజయ్.. తనపై కావాలనే నెగెటివిటీని క్రియేట్ చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

“ఎవరో ఆర్గనైజ్డ్‌గా ఒక 50 మంది గ్రూప్‌ని పెట్టి ట్రోల్ చేయిస్తున్నారు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బలుపు అంటే నేను తగ్గాలా? నా జర్నీ వాళ్లకి అరగకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా? 1000 అకౌంట్లు క్రియేట్ చేసి మరి నెగటివ్ క్రియేట్ చేస్తున్నారు” అంటూ విజయ్ ప్రశ్నించినట్లు సమాచారం. తనపై ఎలాంటి విమర్శలు వచ్చినా వాటికి భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

 

“నేను మారను.. వాళ్లే మారాలి” అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

ఇక ‘రణబలి’ విషయానికి వస్తే.. 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన, అప్పటి కరువు, అణచివేత నేపథ్యంలో కథ సాగుతుంది. విజయ్ ఇందులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే వీరుడి పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తుండగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా కనిపించనున్నారు.

అక్టోబర్ 16న ‘రణబలి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

Read More:‘బా బా బ్లాక్ షీప్’ మూవీపై మేఘాలయ సీఎం ప్రశంసలు.. సినిమాలో అంతగా ఏముందంటే..?

Read More: ఇదేం అరాచకం సామి.. ప్రేక్షకులపై పగపట్టిన కమల్, శంకర్‌లు ..! ‘భారతీయుడు 3’తో సాధించేదేమిటి..?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES