• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Revanth Reddy: ప్రధానమంత్రి పదవి నుంచి మోదీ దిగిపోవాలి: రేవంత్‌ రెడ్డి డిమాండ్‌

Revanth Reddy: ప్రధానమంత్రి పదవి నుంచి మోదీ దిగిపోవాలి: రేవంత్‌ రెడ్డి డిమాండ్‌

Revanth Reddy Demands To Narendra Modi Get Down From PM Post: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌తో ప్రధాని మోదీ రాజీనామా చేయించాలని లేదంటే.. ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే మోదీని గద్దె నుంచి దింపేస్తారని హెచ్చరించారు. న్యూఢిల్లీలో రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 08, 2026, 09:15 PM IST|Updated: Oct 08, 2026, 09:22 PM IST
joinshare
Revanth Reddy: ప్రధానమంత్రి పదవి నుంచి మోదీ దిగిపోవాలి: రేవంత్‌ రెడ్డి డిమాండ్‌
Image Credit: Source: Twitter

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Trigrahi Yog 2026:  అక్టోబర్ 17 నుంచి ఈ 3 రాశులకు అదృష్టం.. డబ్బు, ఉద్యోగం విషయంలో శుభవార్తలు!

Trigrahi Yog 2026: అక్టోబర్ 17 నుంచి ఈ 3 రాశులకు అదృష్టం.. డబ్బు, ఉద్యోగం విషయంలో శుభవార్తలు!

2

Varanasi New Language: మహేష్ బాబు వారణాసిలో గంటసేపు ఆ భాషేనా.. ప్రేక్షకులకు అర్థమవుతుందా?

3

Revanth Reddy: ప్రధానమంత్రి పదవి నుంచి మోదీ దిగిపోవాలి: రేవంత్‌ రెడ్డి డిమాండ్‌

4

చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డ్ ఏమవుతుంది? UIDAI ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!

5

Vijay Deverakonda: నన్ను తొక్కేయడం కోసం 1000 అకౌంట్లు.. విజయ్ దేవరకొండ బయటపెట్టిన భయంకర నిజం..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vote Bachavo Desh Bachavo: ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీనామా కోరుతూ మూడు రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుండగా ఈ నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొని ఆందోళనలో భాగమయ్యారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ పర్యటనలో మీడియాతో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి పదవి నుంచి నరేంద్ర మోదీని దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. గ‌ద్దె దిగు.. లేకుంటే ప్ర‌జ‌లే దింపుతారని హెచ్చరించారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని తెలిపారు.

ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ 'ఓటు బ‌చావో... దేశ్ బ‌చావో' ఉద్య‌మంలో భాగంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ప్రియాంక గాంధీ, ఇండియా కూట‌మి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మ‌హాత్మా గాంధీ స‌మాధి రాజ్‌ఘాట్ వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించిన అనంతరం గాంధీజీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వెంట‌నే భ‌ర్త‌ర‌ప్ చేయాల‌ని తెలంగాణ సీఎం డిమాండ్ చేశారు. అలా చేయ‌కపోతే ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తన గ‌ద్దెను ఖాళీ చేయాలని.. లేక‌పోతే ప్ర‌జ‌లే ఆయ‌న‌ను గద్దె దించుతారని తెలిపారు. ఓటు బ‌చావో.. దేశ్ బ‌చావో ఉద్య‌మం కాంగ్రెస్ పార్టీ పోరాటం కోస‌మో, ఇండియా కూట‌మి కోస‌మో కాద‌ని స్పష్టం చేశారు. దేశంలోని సామాన్యుల హక్కుల పరిరక్షణ కోసం ఈ ఉద్యమం అని వివరించారు.

'2014 ఎన్నికల నాటికి దేశంలో 81 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. 2019 నాటికి ఆ సంఖ్య 91 కోట్లకు చేరింది. 2024 నాటికి 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దేశ జనాభా 140 కోట్లకు చేరుకోగా.. ఓట‌ర్ల సంఖ్య మ‌రింత‌గా పెర‌గాల్సింది పోయి ఏకంగా 13 కోట్ల ఓట్ల గ‌ల్లంతు అయ్యాయి. అవి ఎలా త‌గ్గిపోయాయో ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తెలపాలి' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీ, నెహ్రూ, ప‌టేల్‌, భ‌గ‌త్ సింగ్ వంటి వారు ప్రాణాల‌కు తెగించి పోరాడి స్వాతంత్య్రం తెచ్చారని తెలిపారు. సంప‌న్నులు, పేద‌లు తేడా లేకుండా డాక్ట‌ర్ బీఆర్‌ అంబేడ్క‌ర్ ప్ర‌తి ఒక్క‌రికి ఓటు హ‌క్కు క‌ల్పించారని గుర్తుచేశారు.

'ఇప్ప‌టివర‌కు స‌ర్ ఎన్నిసార్లు జ‌రిగినా పేద‌ల ఓట్ల‌కు ముప్పు క‌ల‌గ‌లేదు. ఇప్పుడు మాత్రం  రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అణగారిన వర్గాల నుంచి గుంజుకునేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్ర‌య‌త్నిస్తున్నారు' అ‌ని తెలంగాణ సీఎం ఆరోపించారు. ఎన్నిక‌ల సంఘం తప్పులను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై పోలీసులతో దాడులు చేయించడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నాయకులను ఎన్నికల సంఘం కలవకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మండిపడ్డారు.

కులం, మతం, ప్రాంతం, భాషల‌ పేరుతో దేశ ప్రజలను విభజించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ ప్ర‌జ‌ల‌ను ఓటు ఉన్నవాళ్లు, ఓటు లేనివాళ్లుగా, రెండు వర్గాలుగా విభజిస్తున్నారని సీఎం ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీ ఓట్ల‌ను లక్ష్యంగా చేసుకొని వాటిని తొల‌గిస్తున్నార‌ని సీఎం ఆరోపించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Revanth Reddy
Telugu News
National News
Trending News