2026 చివరి రెండు నెలల్లో బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్న యంగ్ హీరోస్..
2026 Last Two Months: 2026 చివరి రెండు నెలల్లో బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో యంగ్ హీరోలు బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నారు.. ఈ రెండు నెలల్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పడుచు కథానాయకులు అంతా క్యూ కడుతున్నారు. మరికొన్ని రోజుల్లో థియేటర్ల దగ్గర జరగబోయే ఈ భారీ క్లాష్‌లో చివరగా ఎవరు హిట్ కొట్టి ఫామ్‌లోకి వస్తారనేది చూడాలి. అసలు బరిలో దిగే హీరోలెవరో చూద్దాం.
Year End box Office Fight: అక్టోబర్‌లో కీలకమైన దసరా సీజన్‌లో పలు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో డబ్బింగ్ చిత్రం ‘జైలర్ 2’ మంచి విజయాన్నే సాధించింది. అటు విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక నెక్ట్స్ వీక్‌లో ఏదో చిన్నా చితక సినిమాలు విడుల కాబోతున్నాయి. అటు అక్టోబర్ లాస్ట్ వీక్‌లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. నవంబర్ 5న దీపావళి కానుకగా భారీ డబ్బింగ్ చిత్రం ‘రామాయణ’ సినిమా విడుదల కాబోతుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక బడ్జెట్‌తో యశ్, రణ్‌బీర్ కపూర్, సన్ని డియోలో వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
నవంబర్ 12న శర్వానంద్ భోగి.. 19న ‘ఈ నగరానికి ఏమైంది 2’..
ఆ తర్వాత వీక్ నుంచి అసలు సిసలు పోరాటం మొదలు కాబోతుంది. ముందుగా నవంబర్ 12న శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘భోగి’ సినిమా టాకీస్‌లలోకి రాబోతుంది. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పవర్ ఫుల్ పీరియడ్ యాక్షన్ డ్రామా. ఆ తర్వాత నవంబర్ 19న యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ రాబోతుంది.. ఈ సీక్వెల్‌తో విశ్వక్ సేన్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలే ఉన్నాయి.
నవంబర్ 20న ‘ఆకాశంలో ఒక తార’.. డిసెంబర్ 4న వృషకర్మ..
దుల్కర్ సల్మాన్ కూడా నవంబర్ 20న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో పలకరించబోతున్నాడు. ఇక డిసెంబర్ మొదటి వారంలో టాలీవుడ్ కుర్రాళ్ల మధ్య బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. డిసెంబర్ 4న ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి. ట్రేడ్ వర్గాల్లో సైతం ఈ క్లాష్‌పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందులో అందరి చూపు నాగ చైతన్య హీరోగా నటించిన ‘వృషకర్మ’ సినిమాపైనే ఉంది.
డిసెంబర్ 4న అలియాస్ రుక్మిణి.. లెగసీ చిత్రాలు..
నాని ప్రొడక్షన్‌లో నితిన్ హీరోగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ చిత్రం డిసెంబర్ 4న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. సరిగ్గా అదే రోజున నాగచైతన్య వృషకర్మ సినిమాతో పాటు విశ్వక్ సేన్ నటిస్తున్న ‘లెగసీ’ సినిమాలు కూడా రాబోతున్నాయి. ఈ మూడు సినిమాల్లో చివరి వరకు రేసులో నిలబడేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇయర్ ఎండ్‌లో డిసెంబర్ 24న సీనియర్ హీరోలైన బాలకృష్ణ ‘దాదా’ సినిమాతో పలకరించబోతున్నారు. అటు నాగార్జున కూడా అదే రోజు ‘కింగ్ 100’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. మొత్తంగా బడా సినిమాలు, సీనియర్స్‌ను పక్కన పెడితే ఏడాది చివరి రెండు నెలల్లో బాక్సాఫీస్‌ను గెలిచే ఆ ధీరులెవరనేది తేలిపోనుంది.