Mamitha Baiju Tollywood Entry:‘ప్రేమలు’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌తో పాటు ఇమేజ్ సంపాదించుకుంది మమిత బైజు. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇప్పుడు సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీల్లో ఒకరిగా మారిపోయారు. వరుస విజయాలతో తన మార్కెట్‌ని పెంచుకుంటూ పోతుంది ఈ మలయాళ భామ. తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వాలని చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న‘జై హనుమాన్’లో మమిత నటించబోతున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
జై హనుమాన్ మూవీతో ఎంట్రీ..
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోన్న ‘జై హనుమాన్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనుండగా.. తేజ సజ్జా, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో మమిత కూడా భాగమైతే.. ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది. కథలో ఈమె ఏ పాత్రలో నటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ చేస్తే మండోదరి పాత్రనా.. లేకపోతే సీత పాత్ర చేస్తుందా అనేది ఆసక్తి పెరుగుతుంది.
వరుసగా క్రేజీ చిత్రాలతో ఫుల్ బిజీ..
2026లో తమిళంలో జన నాయకుడు, విశ్వనాథ్ అండ్ సన్స్, మలయాళంలో ‘బెతలహోం కుడుంబ యూనిట్’ వంటి సినిమాలతో మమిత పేరు మార్మోగిపోతుంది. ఇందులో ‘జన నాయకుడు’ సినిమా ఫ్లాఫైనా విజయ్ రాజకీయాల్లో వెళ్లే ముందు చేసిన ఆఖరి చిత్రం కావడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో సౌత్‌లో గుర్తింపు పెంచుకున్న ఈ బ్యూటీకి టాలీవుడ్ ఎంట్రీ కూడా కీలకంగా మారింది. నిజంగానే ‘జై హనుమాన్’తో మమిత గానీ ఎంట్రీ ఇస్తే.. ఈమె టాలీవుడ్ ఎంట్రీకి అంతకు మించిన సినిమా మరోకటి ఉండదనే చెప్పాలి.