Maharastra CM On tiger Shroff Attack: బాలీవుడ్ సినీ ఇండస్ట్రలో ఇపుడు కాల్పుల కలకం సంచలనం రేపుతుంది. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనను సీఎం ఫడ్నవీస్‌తో పాటు డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. ముంబైలో భయాందోళనలు సృష్టించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దోషులకు తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
టైగర్‌కు ఫస్ట్ వార్నింగ్..
సినీ నటుడు టైగర్ ష్రాఫ్పై ముంబైలో కాల్పులు జరిగిన ఘటన బాలీవుడ్ను షాక్కు గురిచేసింది. టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై క్లోజ్ రేంజ్ నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్పాట్లో ఫోరెన్సిక్ టీం చేసిన అనాలసిస్లో నిర్ధారణ అయింది. ఫోరెన్సిక్ నిపుణులు స్వాధీనం చేసుకున్న ఖాళీ తూటాల గుండ్లు గమనిస్తే.. టైగర్ ష్రాఫ్ BMW కారుపైకి నేరుగా మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్పష్టమైంది. బైక్పై వెనుక కూర్చున్న వ్యక్తి అతి సమీపం నుంచి బుల్లెట్లను కాల్చారు. ఇది భయపెట్టడానికో లేదా తీవ్రంగా గాయపరచడానికో పథకం ప్రకారం చేసిన ప్రయత్నమని ఫోరెన్సిక్ బృందం తేల్చింది.
బచ్ గయా టైగర్ ష్రాఫ్..
ఈ అటాక్లో టైగర్ ష్రాఫ్ అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నాడు. అతని కారు డ్రైవర్ మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. నానావతి ఆసుపత్రిలో డ్రైవర్ ఫిర్దౌస్ కోలుకుంటున్నాడు. బుల్లెట్ చేతికి తగలడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో గాయపడిన ఆటో డ్రైవర్ చౌహాన్ కూడా చికిత్స పొందుతున్నాడు. టైగర్ ష్రాఫ్ ఫుట్‌బాల్ ఆడటానికి ఆదివారం సాయంత్రం జుహుకు వెళ్లాడు. ప్రముఖ టీవీ నటుడు కరణ్‌వీర్ మెహ్రా కూడా అతనితో పాటే ఉన్నాడు.
సల్మాన్‌కు సన్నిహితంగా ఉండటమే టైగర్ ష్రాఫ్ పై కాల్పులకు కారణం..
ఫుట్ బాల్ ముగించుకుని కారులో వెళ్లి కూర్చున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. సల్మాన్ ఖాన్తో సన్నిహితంగా ఉన్నందుకే టైగర్ ష్రాఫ్ పై అటాక్ చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ దాడి తామే చేశామని చెప్పుకొచ్చింది. టైగర్ ష్రాఫ్‌ను ముందే హెచ్చరించాం..కానీ అతడికి అర్థం కాలేదు. అందుకే అర్థమయ్యే రీతిలో వివరించామని తెలిపారు. సల్మాన్ ఖాన్‌తో పని చేయడం ఆపే వరకు దాడులు కొనసాగుతాయని తెలిపారు. ముంబై సినీ ఇండస్ట్రీలో తమ మాట వినని వారు, సల్మాన్‌తో పని చేసే వారిని చంపేస్తామని..ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని హెచ్చరించారు. 2024 అక్టోబర్ 12న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో మహారాష్ట్ర మాజీ మంత్రి, NCP నేత బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. రెండేళ్ల తర్వాత టైగర్ ష్రాఫ్‌పై ఈ దాడి జరగడం గమనార్హం.
ముంబైలో జరిగిన కాల్పుల్లో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ త్రుటిలో తప్పించుకున్నారు. దుండగుల్లో ఒకరు ఆయన కార్ డోర్ తెరవాలని చూడటం, అతి దగ్గరి నుంచి కాల్చేందుకు యత్నించడం వీడియోల్లో కనిపించింది. అయితే నిందితుడి గన్ జామ్ అయినట్లు తెలుస్తోంది. 2-3 సార్లు ఫైరింగ్‌కు యత్నించి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో టైగర్ ష్రాఫ్ ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తం 5 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
జాకీ ఫ్రాఫ్ తనయుడు..
టైగర్ ష్రాఫ్ అసలు పేరు జై హేమంత్ ష్రాఫ్. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కుమారుడు. ఈయన 2014లో 'హీరోపంతి' అనే యాక్షన్ రొమాంటిక్ డ్రామా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇది తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పరుగు’ సినిమాకు రీమేక్. తన యాక్షన్ స్టంట్స్, డ్యాన్స్ మూమెంట్స్‌తో టైగర్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక హిందీల ో 'బాఘీ', 'బాఘీ 2', 'వార్', మరియు 'సింగం అగైన్' వంటి చిత్రాల్లో నటించారు. చివరగా 2025లో విడుదలైన 'బాఘీ 4' (Baaghi 4) చిత్రంలో కనిపించారు, ఇది బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆయన తదుపరి చిత్రం 'లగ్ జా గలే' (Lag Jaa Gale)లో జాన్వీ కపూర్, లక్ష్య కూడా నటిస్తున్నారు. ఈ సినిమా 2027 మే 14న విడుదల కానుంది. జాకీఫ్రాఫ్ రీసెంట్‌గా రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్ 2’ సినిమాలో నటించారు.