• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Aakasamlo Oka Tara Review: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ: దుల్కర్ సల్మాన్ మరోసారి మెప్పించాడా..?

Aakasamlo Oka Tara Review: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ: దుల్కర్ సల్మాన్ మరోసారి మెప్పించాడా..?

Aakasamlo Oka Tara Review and Rating: ఆకాశంలో ఒక తార మూవీతో బాక్సాఫీసు ముందుకు వచ్చేశాడు దుల్కర్ సల్మాన్. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించగా.. శ్రుతి హాసన్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది..? దుల్కర్ నటన, కొత్త హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా..? రివ్యూలో చూద్దాం..

Written ByAshok Krindinti
Published: Nov 20, 2026, 11:19 IST|Updated: Nov 20, 2026, 11:22 IST
joinshare
Aakasamlo Oka Tara Review: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ: దుల్కర్ సల్మాన్ మరోసారి మెప్పించాడా..?
Image Credit: Aakasamlo Oka Tara Review and Rating (Source: AI Generated)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Aakasamlo Oka Tara Review and Rating: మంచి చదువు చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరికీ ఓ కల ఉంటుంది. కానీ ఓ మారుమూల గ్రామంలో పుట్టిన అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటే.. ఆ ప్రయాణం ఎలా ఉంటుంది..? ఆ కలను నిజం చేసేందుకు భర్త కూడా తోడైతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి..? ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన సినిమా ‘ఆకాశంలో ఒక తార’. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. శృతి హాసన్ ప్రధాన పాత్ర పోషించారు. శుక్రవారం (నవంబర్ 20) థియేటర్లలో సందడి మొదలు పెట్టిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..? దుల్కర్ ఖాతాలో మరో హిట్ చేరిందా..? రివ్యూలో చూద్దాం..

కథ ఏంటి..?

పాలలంక అనే మారుమూల గ్రామానికి చెందిన కల్పన (సాత్విక వీరవల్లి)కి చిన్నప్పటి నుంచే వ్యోమగామి కావాలనే కోరిక ఉంటుంది. చదువుకుని అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కంటుంది. కానీ ఆమె తండ్రి శివయ్య (కోట జయరాం) మాత్రం ఆడపిల్లకు చదువు ఎందుకనే కల్పనను తిడుతుంటాడు. కల్పన ఆశయాలకు అడ్డుపడుతూ.. పదో తరగతి పరీక్షలు రాయకుండా చేసే ప్రయత్నం చేస్తాడు. అయితే అతని భార్య భర్తకు అడ్డు చెప్పి.. కూతురితో పదో తరగతి పరీక్షలు రాయిస్తుంది. ఆ తర్వాత కృష్ణ (దుల్కర్ సల్మాన్)తో కల్పనకు పెళ్లి జరుగుతుంది. అయితే పెళ్లి తర్వాత భార్య మనసులోని లక్ష్యాన్ని తెలుసుకున్న కృష్ణ ఆమెకు అండగా నిలబడతాడు. తన భార్య కలను నెరవేర్చడమే తన బాధ్యతగా భావిస్తాడు. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను పక్కనపెట్టి ఆమె చదువుకు సహకరిస్తాడు. హైదరాబాద్‌కు వచ్చి ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సహిస్తాడు. కల్పన కూడా పట్టుదలతో చదివి ఐఐటీలో మంచి ర్యాంకు సాధిస్తుంది.

అక్కడితో ఆమె ప్రయాణం ముగియదు. రాకెట్ సైన్స్‌పై పరిశోధనలు చేస్తూ ఓ ప్రయోగం చేపడుతుంది. అయితే ఆ ప్రయోగం విఫలం కావడంతో ఆమె జీవితంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో ప్రైవేట్ స్పేస్ సెంటర్ అధినేత రోహిణి (శ్రుతి హాసన్), గుజరాతీ యువతి బిజిలీ (రుహానీ శర్మ) పాత్రలు కథలోకి వస్తాయి. చివరకు కల్పన తన లక్ష్యాన్ని చేరుకుందా..? ఆమెకు కృష్ణ ఎలాంటి సహకారం అందించాడు..? అనేదే మిగతా కథ.

విశ్లేషణ..

సినిమా కథలో కొత్తదనం ఉన్నా.. టీజర్, ట్రైలర్ చూసినప్పుడే కథ ఎటువైపు వెళ్తుందో కొంతవరకు అర్థమవుతుంది. అయినా ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెట్టడంలో దర్శకుడు పవన్ సాధినేని సక్సెస్ అయ్యాడు. భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. కథను ఎక్కడా డివేయట్ అవ్వకుండా తెరపై ఆవిష్కరించాడు. కల్పన చిన్ననాటి పరిస్థితులు, తండ్రి నుంచి ఎదురయ్యే వ్యతిరేకత, కృష్ణతో వివాహం, ఆ తర్వాత ఆమె కలను నెరవేర్చేందుకు భర్త పడే కష్టం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. భార్య కోసం కృష్ణ చేసే ప్రయత్నాలు కొన్ని చోట్ల భావోద్వేగానికి గురిచేస్తాయి. గుజరాత్‌లో అతడు ఎదుర్కొనే పరిస్థితులు, బిజిలీతో వచ్చే సన్నివేశాలు కథకు కొంత కొత్తదనాన్ని తీసుకొస్తాయి.

అయితే కొన్ని సందర్భాల్లో కథనం నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా కల్పన గతం, ఆమె ప్రయాణాన్ని వివరించే సన్నివేశాల్లో వేగం తగ్గినట్లు అనిపిస్తుంది. రాకెట్ ప్రయోగం విఫలమయ్యే ఘట్టం ఇంటర్వెల్‌కు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సెకండాఫ్‌లో శ్రుతి హాసన్ పాత్ర ప్రవేశంతో కథలో కొత్త కోణం కనిపిస్తుంది. కల్పన, కృష్ణ, రోహిణి మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా చివరి భాగంలో భావోద్వేగాలకు పెద్దపీట వేశారు. తండ్రి, కూతురు మధ్య వచ్చే సన్నివేశం, క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలిస్తాయి.

ఎవరు ఎలా చేశారు..?

కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ జీవించేశాడు. ఇలాంటి పాత్రలు దుల్కర్ అలవోకగా చేసేస్తాడు. భార్య ఆశయాన్ని తన లక్ష్యంగా భావించి ఆమె కోసం కష్టపడే సామాన్య భర్తగా సహజంగా కనిపించాడు. హీరో ఇమేజ్‌కుప్రాధాన్యం ఇవ్వకుండా కథకు అవసరమైన పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమాతో పరిచయమైన సాత్విక వీరవల్లి కల్పన పాత్రకు న్యాయం చేశారు. అమాయకత్వం, పట్టుదల, లక్ష్యాన్ని చేరుకోవాలనే తపనను తన నటనలో చక్కగా చూపించారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. దుల్కర్‌తో కలిసి నటించిన సన్నివేశాల్లోనూ మంచి ప్రతిభ కనబరిచారు. తెరపై వీరిద్దరి జంట చక్కగా ఉంటుంది.

శ్రుతి హాసన్‌కు కీలక పాత్ర దక్కింది. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. రుహానీ శర్మ బిజిలీ పాత్రలో మెప్పించారు. కోట జయరాం, నాజర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, స్వాసిక తదితరులు తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.

టెక్నికల్ టీమ్ పనితీరు..

సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తిండిపోతుంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణం నుంచి అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన సన్నివేశాల వరకు విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. గుణ్ణం గంగరాజు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కథకు బలాన్ని అందించాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అయితే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్టాఫ్‌లో ఎడిటింగ్ ఇంకాస్త వేగంగా ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా ఉండేది.

Rating: 3.5/5
 

Add Zee News as a Preferred Source
TAGS:
Movie Review
Tollywood