• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Chandini Chowdary: ప్రశ్నిస్తే టార్గెట్ చేసి బ్లేమ్ చేస్తారా..?.. విశాఖ కొండల తవ్వకాలపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

Chandini Chowdary: ప్రశ్నిస్తే టార్గెట్ చేసి బ్లేమ్ చేస్తారా..?.. విశాఖ కొండల తవ్వకాలపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

Chandini Chowdary in save vizag row: వైజాగ్ లో డెవలప్ మెంట్ పేరిట ఇష్టరితీన కొండల్లో జరుపుతున్న తవ్వకాలపై నటి చాందిని చౌదరీ ఇటీవల తన ఇన్ స్టా వేదికగా సీరియస్ అయ్యారు. దీని వల్ల సహజ సిద్దమైన నేచర్ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 15, 2026, 13:54 IST|Updated: Nov 15, 2026, 14:09 IST
joinshare
Chandini Chowdary: ప్రశ్నిస్తే టార్గెట్ చేసి బ్లేమ్ చేస్తారా..?.. విశాఖ కొండల తవ్వకాలపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Image Credit: chandini chowdary (file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Actress Chandini Chowdary fires on social media trolling: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైజాగ్ లో ప్రభుత్వం డెవలప్ మెంట్ పేరిట కొండ ప్రాంతాల్లో చేస్తున్న తవ్వకాలపై రచ్చ రాజుకుంది. దీనిపై వైసీపీ వర్సెస్ కూటమి మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తొంది. దీనిపై టాలీవుడ్ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టిన పోస్ట్ ప్రభుత్వం వర్సెస్ అపోసిషన్ పార్టీల మధ్య మరింత హీట్ ను పెంచేదిగా మారింది. అభివృద్ధి, అర్బనైజేషన్ పేరిట.. విశాఖపట్నం పరిసరాల్లోని కొండల్ని ధ్వంసం చేస్తున్నారని.. ఈ దృశ్యాలు చూస్తుంటే గుండె బరువెక్కుతోందని.. ప్రకృతి అందాలు నాశనమవుతుంటే తన మనసు కలత చెందుతోందంటూ చాందిని చౌదరీ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. ఇక నటి ట్విట్ ను వైసీపీ నేతల విపరీతంగా వైరల్ చేశాయి. 

 

ప్రశ్నిస్తే బ్లేమ్ చేస్తారా..? అభిప్రాయం చెప్పే హక్కు లేదా? విశాఖలో కొండల అక్రమ తవ్వకాలపై ఆవేదన వ్యక్తం చేసిన హీరోయిన్‌ చాందినీ చౌదరి తన అభిప్రాయాన్ని వెల్లడించినందుకు సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ తనపై జరుగుతున్న విమర్శల దాడిపై వీడియో విడుదల చేసిన చాందినీ మనకు బాధ కలిగినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయాలు చెప్పే హక్కు మనకు ఉంది వాళ్లకు అనుకూలంగా లేదని బ్లేమ్ చేయడం.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదంటూ ఆవేదన

— PulseNewsBreaking (@pulsenewsbreak) November 15, 2026

 

 దీనిపై సోషల్ మీడియాలో కూటమి అనుకూల వర్గాలు సైతం రంగంలోకి దిగి ఏకంగా నటిని, ఆమె పర్సనల్ లైఫ్ పై కూడా విపరీతంగా ట్రోల్స్ చేస్తు టార్గెట్ చేశాయి. దీనిపై మరోసారి నటి చాందిని చౌదరీ ఒక వీడియో రిలీజ్ చేశారు. నటి చాందినీ చౌదరీ మాట్లాడుతూ..విశాఖలో కొండల అక్రమ తవ్వకాలపై మాట్లాడితే తనను బ్లేమ్ చేయడం ఏంటని అసహానం వ్యక్తం చేశారు.  ప్రశ్నిస్తే బ్లేమ్ చేస్తారా..? అభిప్రాయం చెప్పే హక్కు కూడా  లేదా?.. అంటూ ఎమోషనల్ అయ్యారు. 

తన అభిప్రాయాన్ని వెల్లడించినందుకు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మనకు బాధ కలిగినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయాలు చెప్పే హక్కు మనకు ఉందని చెప్పుకొచ్చారు. తన పోస్ట్ వాళ్లకు అనుకూలంగా లేదని బ్లేమ్ చేయడం.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదంటూ నటి చాందినీ చౌదరీ చురకలు పెట్టారు.  ప్రస్తుతం నటి చేసిన కామెంట్స్ మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

అంతకు ముందు నటి తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ #SaveVizag హ్యాష్‌ట్యాగ్ కు పర్యావరణ ప్రేమికుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కౌంటర్ గా కొంత మంది గతంలో రుషికొండ తవ్వకాల సమయంలో ఎందుకు మాట్లాడలేదని సెటైర్లు వేస్తున్నారు. ఇక వైజాగ్ కు చెందిన నటి చాందిని చౌదరీ షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరిర్ ప్రారంభించారు. కలర్ ఫోటో, గ్యామి వంటి మూవీస్ చేసి మంచి ఫాలోవింగ్ సంపాదించుకున్నారు.తన సొంతూరిపై ఉన్న మమకారంతో ఈ విధంగా స్పందించానని తనకు ఏ పార్టీతో కూడా  సంబంధంలేదని నటి చాందీని చౌదరీ క్లారిటీ ఇచ్చారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Andhra Pradesh
Telugu News
Chandrababu Naidu