Tamannaah Bhatia: ఇవాళ నా జీవితంలో అద్భుతం జరిగింది.. తిరుమలలో తమన్న భాటీయా భావోద్వేగం.. వీడియో..
Tamannaah Bhatia visits tirumala: నటి తమన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిన్నప్పటి నుంచి శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Actress Tamannaah Bhatia Visits Tirumala Temple video: కలియుగ దైవం, భక్తుల కొంగు బంగారమైన తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు ఇప్పటి నుంచే భక్తుల పొటెత్తారు. టీటీడీ సైతం పటిష్టమైన బందో బస్తు చేపట్టింది. ఈ క్రమంలో సామాన్యుల నుంచి సెలబ్రీటీల వరకు శ్రీవారి దర్శనాలకు తిరుమలకు భక్తులు వస్తుంటారు. ఒక్కసారిగా స్వామిని చూసేందుకు ఎన్నిగంటలైన కూడా క్యూలైన్ లలో వేచి చూస్తారు. ఈ క్రమంలో తిరుమలలో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేశారు.
మిల్కీబ్యూటీ తమన్నా వేకువ జామున వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారి దర్శించు కున్నారు. ఈ స్టార్ హీరోయిన్ సంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారి సన్నిధికి వచ్చారు. బుధవారం ఉదయం స్వామివారికి నిర్వహించిన అత్యంత ముఖ్యమైన సుప్రభాత, తోమాల సేవల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం బైటకు వచ్చిన తమన్నా భక్తితో తన్మయత్వంలో మునిగితెలారు. చాలాకాలం తర్వాత ఏడుకొండల వాడి సన్నిధికి రావడం జరిగిందని చెప్పారు. అంతే కాకుండా తాను చిన్నప్పటి నుంచి తిరుమలకు వస్తానని వెల్లడించారు. హీరోయిన్ కాక ముందు నుంచి ఇక్కడకు వస్తుండేదాన్నని తెలిపారు.
వేకువజామునే స్వామివారి సేవలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా చెప్పుకొచ్చారు. గతంలో చాలా సార్లు తిరుమలకు వచ్చానని, కానీ ఈ రోజు మాత్రం అనిర్వచనీయ అద్భుతమై, అనుభూతిని పొందినట్లు వెల్లడించారు.
శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వేద పండితులు ఆమెకు సంప్రదాయబద్ధంగా రంగనాయక మండపంలో పవిత్ర మంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం అందించారు.ఆ తర్వాత ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి, పట్టు వస్త్రంతో ఆమెను ఘనంగా సత్కరించారు. మరోవైపు దర్శనం అనంతరం మాడవీధులలో తమన్నా అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.