Adarsha Kutumbam Review:వెంకటేష్, త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ మూవీకి రీమేకా..?
Adarsha kutumbam first Review: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..
Adarsha kutumbam Censor Talk Review: వెంకటేష్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలుసు కదా. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ అందించిన మాటలు అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ చిత్రాలు కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయాయి. దాదాపు ఈ సినిమాల తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా వెంకటేష్‌ను డైరెక్ట్ చేశారు.
సీనియర్ స్టార్ హీరోతో తొలిసారి..
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి సీనియర్ స్టార్ హీరోలతో ఎవరితో చేయలేదు. తొలిసారి వెంకటేష్‌తో ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ మరోసారి మిడిల్ క్లాస్ మ్యాన్‌గా కనిపించబోతున్నట్టు ట్రైలర్‌లో చూపించారు. అంతేకాదు కుటుంబం కోసం ఎంతకైనా తెగించే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు.
సెన్సార్ టాక్..
‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని 16 వయసు ప్లస్ వాళ్లు చూడొచ్చు. ఈ సినిమా నిడివి 2 గంటల 29 నిమిషాలు ఉండటం విశేషం. ఇక సెన్సార్ వాళ్లు ఈ సినిమా మొత్తం వెంకటేష్ మార్క్ తో పాటు త్రివిక్రమ్ పంచ్‌లు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. ఈ సినిమాకు ‘ఆదర్శ కుటుంబం’ హౌస్ నెం. 47’. షార్ట్‌కట్‌లో AK47. అంటే ఆదర్శ కుటుంబీకుడైన హీరో అవసరం అయితే ఏకే 47 పట్టుకోవడానికి వెనకాడని క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్టు సెన్సార్ వాళ్లు చెప్పిన మాట.
త్రివిక్రమ్, వెంకీ మార్క్ ఫ్యామిలీ క్రైమ్ యాక్షన్ కామెడీ డ్రామా..
మొత్తంగా త్రివిక్రమ్ ఈ సినిమాను ఫ్యామిలీ క్రైమ్ యాక్షన్ కామెడీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కామెడీ పంచ్‌లు క్లాస్ ఆడియన్స్‌ను అలరిస్తే.. యాక్షన్ పాళ్లు కూడా మాస్ ఆకట్టుకునేలా ఉన్నాయనేది టాక్. ఇక ఆదర్శ కుటుంబం సినిమాతో అర్జున్ బ్లాస్ట్ సినిమాకి చాలా కాలంగా పోలికలు నడిచాయి. ఆ సినిమాలతో శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్‌ల క్యారెక్టర్స్ బాగున్నాయి. ఇక శ్రీనిధి పిల్లల తల్లి పాత్రలో ఒదిగిపోయిందనేది టాక్. కేజీఎఫ్ సిరీస్, హిట్ 3 తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసింది. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం పెద్ద విశేషం. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ డబ్బింగ్ చెప్పుకోవడం గగనమైపోయింది.
బ్లాస్ట్ మూవీతో పోలికలు..
'ఆదర్శ కుటుంబం' అనౌన్స్ చేసినప్పటి నుంచే ఇది అర్జున్ 'బ్లాస్ట్' చిత్రానికి పోలికలు గట్టిగానే నడిచాయి. ఈ చిత్రం ‘బ్లాస్ట్’ మూవీకి సంబంధం లేదు. ఆ తరహాలో సాగే ఫ్యామిలీ యాక్షన్ క్రైమ్ డ్రామా. ఇందులో బ్లాస్ట్, దృశ్యం, టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాల తాలూకు చాయలు అక్కడక్కడున్నాయనేది సెన్సార్ వాళ్లు చెబుతున్న మాట. ఈ సినిమా పూర్తిగా సరికొత్త స్టోరీ ఉంది. ఈ సినిమా క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా ఉందనేది సెన్సార్ వాళ్లు చెబుతున్న మాట. మొత్తంగా ఏ చిత్రానికి సంబంధం లేని త్రివిక్రమ్ మార్క్ డిఫరెంట్ ఫ్యామిలీ థ్రిల్లర్.
త్రివిక్రమ్ గత చిత్రాలకు.. ఆదర్శ కుటుంబం సినిమా కాన్సెప్ట్‌కు అస్సలు సంబంధం లేదనేది టాక్. మొత్తంగా వెంకటేష్‌ను గురూజీ ఎలా చూపించబోతున్నారనే దానికి మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.