Megaverse Vs Unstoppable: నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న మెగావర్స్ కార్యక్రమంలో చిరంజీవి హోస్ట్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇక ప్రభాస్‌తో ప్రత్యేకంగా ఓ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మెగావర్స్‌లో తొలి ఎపిపోడ్ ముందుగా బ్రహ్మానందం, సునీల్, సత్యలతో ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా నాగార్జునతో చిరు చిట్ చాట్ మొదటి ఎపిసోడ్‌గా స్ట్రీమింగ్‌కు రానున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్న మాట. ఇక రజినీకాంత్, కమల్ హాసన్ ఎపిసోడ్.. వెంకటేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ల ఎపిసోడ్ ఈ షో పై క్రేజ్‌ను అమాంతం పెంచనున్నాయి.
అయితే ప్రభాస్‌తో ఎపిసోడ్ ఈషోకు ప్రత్యేకంగా ఉండబోతున్నట్టు సమాచారం. ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే… ప్రభాస్ తన మనసులోని మాటలన్నీ ఈసారి కూడా బయటపెడతాడా?గతంలో బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ కనిపించినప్పుడు ఎలాంటి సందడి క్రియేట్ అయిందో మనందరికీ తెలిసిందే. సాధారణంగా చాలా తక్కువగా మాట్లాడే ప్రభాస్.. ఆ షోలో మాత్రం ఫుల్ జోష్‌తో కనిపించాడు. తన స్నేహాలు, వ్యక్తిగత విషయాలు, సినిమా అనుభవాల గురించి సరదాగా మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాలయ్య ఎపిసోడ్‌లో ప్రభాస్ జిగ్రీ దోస్త్ హీరో గోపీచంద్ అలరించాడు. ఆ ఎపిసోడ్ ఇప్పటికీ ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకమైనదే.
చిరంజీవితో మెగావర్స్‌లో ప్రభాస్ మనసులో మాట బయటపెడతాడా..?
మరి ఇప్పుడు చిరంజీవి ముందు ప్రభాస్ ఎంతవరకు ఓపెన్ అవుతాడు? అనేదే ఆసక్తికరమైన విషయం.ఇక ఈ చిట్‌చాట్‌లో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా ఉండబోతోందట. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా మధ్యలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ఇక చర్చ మొత్తం ‘స్పిరిట్’ సినిమా చుట్టూ తిరగడం ఖాయం. ప్రభాస్ కెరీర్, సందీప్ రెడ్డి వంగా మేకింగ్ స్టైల్, స్పిరిట్ అప్‌డేట్స్… ఇలా అభిమానులకు కావాల్సిన ఎన్నో విషయాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇక స్పిరిట్‌లో సందీప్ రెడ్డి వంగా చిరుకు ప్రభాస్ తండ్రి పాత్ర ఆఫర్ చేసినా.. మెగాస్టార్ నో చెప్పిన విషయాలు బయట పడతాయా లేదా అనేది చూడాలి మరి.
మరోవైపు ఈ షో విషయంలో చిరంజీవికి కూడా ఓ పెద్ద ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే ప్రభాస్‌తో బాలయ్య చేసిన ఎపిసోడ్ ఇప్పటికే ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు దాన్ని దాటి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాల్సిన బాధ్యత చిరంజీవిపై ఉంది.అయితే మెగాస్టార్‌కు హోస్టింగ్ కొత్తేమీ కాదు. తనదైన హాస్యం, చమత్కారం, టైమింగ్‌తో ఎవరినైనా మాటల్లోకి దించగలరు. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాలీటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఇపుడు ప్రభాస్ నుంచి చిరు ఎలాంటి విషయాలు రాబడతాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ కూడా సరైన వాతావరణం దొరికితే సరదాగా మాట్లాడే వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి.
ఫస్ట్ ఎపిసోడ్ ఎపుడు ప్రారంభం.. ?
ఇక ఈ షో ప్రారంభ ఎపిసోడ్‌పైనా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రామ్ చరణ్, పవన్ కల్యాణ్‌తో చిరంజీవి చేసే ఎపిసోడ్ ముందుగా సిద్ధమైతే దానితోనే షో ప్రారంభం కావచ్చనే ప్రచారం జరగుతుంది. లేదంటే ప్రభాస్ ఎపిసోడ్‌కు తొలి అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.అయితే నాగార్జునతో చేసిన ఎపిసోడ్‌తో స్టార్ట్ చేసి ప్రభాస్ ఎపిసోడ్‌తో ఎండ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఇక అల్లు అరవింద్, అశ్వనీద్, రాఘవేంద్రరావు సహా రాధిక, సుమలత, సుహాసిని, విజయశాంతి సహా 80లలో చిరంజీవితో యాక్ట్ చేసిన హీరోయిన్స్‌తో ఓ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక ఫస్ట్ ఎపిసోడ్ ఎపుడు అధికారంగా మొదలవుతుందనేది చూడాలి మరి.
మొత్తానికి ఇప్పుడు పోటీ చిరంజీవి, బాలకృష్ణ మధ్య కాదు… ప్రేక్షకులను ఎవరు ఎక్కువగా ఎంటర్‌టైన్ చేస్తారన్నదే అసలు విషయం.బాలయ్య షోలో ప్రభాస్ చేసిన సందడిని మెగాస్టార్ మళ్లీ రిపీట్ చేయగలరా? లేక ఈసారి ప్రభాస్ మరో కొత్త కోణాన్ని చూపించబోతున్నాడా? వెయిట్ అండ్ వాచ్.