SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

‘ఇరుముడి’ సక్సెస్‌తో పూర్తిగా మారిపోయిన రవితేజ స్ట్రాటజీ.. మరి ఓవర్ కాదా..!

Ravi Teja Remunaration Increase: ‘ఇరుముడి’ సినిమా ముందు వరకు రవితేజ కెరీర్ అత్యంత దారుణంగా ఉంది. వరుసగా అర డజను ఫ్లాపులు. హీరోగా రవితేజ కెరీర్ ఖతం అనుకుంటున్న టైమ్‌లో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మొత్తంగా మీడియం రేంజ్ మూవీస్‌లో ఆల్ టైమ్ హైయ్యెస్ట్ రికార్డు వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ తన ప్లానింగ్ పూర్తిగా మార్చేశాడు. అంతేకాదు కొత్తగా చేస్తోన్న సినిమాలకు అమాంతం రెమ్యునరేషన్ పెంచినట్టు సమాచారం.

Reported By TA Kiran Kumar Sharma Written By TA Kiran Kumar Sharma
Published: Sep 22, 2026, 02:13 PM IST | Updated: Sep 22, 2026, 02:16 PM IST
Image Credit: Ravi Teja New Strategy
Join

Ravi Teja Remunaration Strategy: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా ‘ఇరుముడి’ సక్సెస్‌తో  రవితేజ కెరీర్‌ను మళ్లీ పునర్వైభవాన్ని తీసుకొచ్చింది.ఈ సినిమా సక్సెస్‌తో   కథలతో పాటు రెమ్యునరేషన్ గేమ్‌పై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. ఇరుముడి ఇచ్చిన బ్లాక్ బస్టర్‌తో మాస్ రాజా ఆలోచనలు పూర్తి మారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.  ఏకంగా దిల్ రాజు సినిమానే కాదనే పరస్థితికి వచ్చింది. ఇకపై  రెమ్యునరేషన్‌తో పాటు నైజాం రైట్స్ ఇస్తేనే డేట్స్ ఇస్తానంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో  పుకార్లు షికార్డు చేస్తున్నాయి. ఇంతకీ రవితేజ సినిమా ఒప్పుకోవాలంటే కొత్త కండిషన్స్ పెడుతున్నాట.

రవితేజ బంపర్ ఫిట్టింగ్..

ఇరుముడి సినిమాకు ముందు కాస్త లో ఫేజ్‌లో ఉన్న రవితేజ దీనికోసం రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ వరకు తీసుకున్నారని తెలుస్తుంది.. అందులో రూ. 8 కోట్లు అడ్వాన్స్ తీసుకుని మిగిలిన బ్యాలెన్స్ కింద నైజాం రైట్స్ తీసుకున్నట్టు సమాచారం. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఎవరూ ఊహించని స్థాయిలో నైజాంలోనే ఏకంగా రూ. 60 కోట్లు షేర్ వసూలు చేసింది. దాంతో మాస్ రాజాకు అతిపెద్ద జాక్ పాట్‌ తగిలిందనే చెప్పాలి. తంతే బూరలబుట్టలో పడ్డాడు. నైజాంలో రూ. 5.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘ఇరుముడి’ సినిమా ఏకంగా రూ. 60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర తిరగరాసింది. ఎన్నో బడా సినిమాల రికార్డులను కేవలం నార్మల్ టికెట్ రేట్స్‌తో దాటడం అంటే మాములు విషయం కాదు.

ప్రతి సినిమా ‘ఇరుముడి’ కాలేదు..

ప్రతీ సినిమా ఇరుముడి స్థాయిలో ఆడుతుందనే గ్యారెంటీ లేదు. . కానీ రవితేజ మాత్రం తన రేటును భారీగా పెంచేశారనే ప్రచారం అయితే మొదలైంది. ఆపుగు ఏకంగా ఒక్కో సినిమా కోసం ఏకంగా రూ. 20 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటుగా నైజాం హక్కులు కూడా ఇస్తేనే సినిమా చేస్తానని ఆయన కొత్త రూల్ పాస్ చేసినట్లు తెలుస్తుంది. ఈ కారణంతోనే దిల్ రాజు సినిమా ఆగిపోయిందంటున్నారు.. హసిత్ గోలీ దీనికి దర్శకుడు.

కథ, రెమ్యునరేషన్ కుదిరితేనే సినిమా..

సరిగ్గా ఇదే టైమ్‌లో రవితేజ అడిగినట్లుగానే రూ. 20 కోట్లతో పాటు నైజాం ఏరియా రైట్స్ ఇవ్వడానికి నిర్మాత లక్ష్మణ్ ముందుకొచ్చారని సమాచారం. గతంలో చిరంజీవి కూడా తన రెమ్యునరేషన్ కింద నైజాం రైట్స్ తీసుకునేవారు. ఇపుడు రవితేజ కూడా అదే రూట్లో వెళుతున్నాడు.  ఇక దిల్ రాజు బ్రదర్  లక్ష్మణ్ రవితేజ చెప్పిన కండిషన్‌కు ఓకే చెప్పడంతో ఈ సినిమా పట్టాలెక్కబోతుంది.  వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఏదేమైనా ఇరుముడి తర్వాత కాస్త టైమ్ తీసుకున్నా సరే.. అటు మంచి కథతో పాటు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ కూడా ఉండాల్సిందే అని రవితేజ గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES