• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘టాక్సిక్’ గాయానికి ‘రామాయణ’ మందు అవుతుందా.. యశ్ ముందున్న బిగ్ టార్గెట్ ఇదే..!!

‘టాక్సిక్’ గాయానికి ‘రామాయణ’ మందు అవుతుందా.. యశ్ ముందున్న బిగ్ టార్గెట్ ఇదే..!!

Yash-Toxic-Ramayana: కేజీఎఫ్ సిరీస్‌తో యశ్ యశస్సు ఎక్కడికో పోయింది. ఆ తర్వాత నాలుగేళ్ల లాంగ్ గ్యాంప్ తర్వాత ‘టాక్సిక్’ మూవీతో పలకరించారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు యశ్ మరో నిర్మాతగా వ్యవహరించారు .కానీ ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ‘యశ్’ రామాయణతో పలకరించబోతున్నారు. ఈ సినిమాలో రావణాసురుడిగా నిర్మాతగా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మరి ‘టాక్సిక్’ చేసిన గాయం.. రామాయణ సినిమా పూడుస్తుందా లేదా అనేది యశ్ అభిమానుల్లో ఉంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 29, 2026, 06:18 AM IST|Updated: Oct 29, 2026, 06:19 AM IST
joinshare
‘టాక్సిక్’ గాయానికి ‘రామాయణ’ మందు అవుతుందా.. యశ్ ముందున్న బిగ్ టార్గెట్ ఇదే..!!
Image Credit: Yash Ramayana (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కాంట్రవర్సీలో ప్రభాస్ ‘ఫౌజీ’.. అసలు మ్యాటర్ ఏమిటంటే..!!

కాంట్రవర్సీలో ప్రభాస్ ‘ఫౌజీ’.. అసలు మ్యాటర్ ఏమిటంటే..!!

2

November 1 Paid Holiday: ఏపీలో మున్సిపల్ పోలింగ్.. నవంబరు 1న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు..

3

Madhya Pradesh Liquor Deaths: ఏఐ సాయంలో కల్తీ మద్యం తయారీ, మార్కెట్లో అమ్మకం..13 మంది దుర్మరణం..యువకుడు అరెస్ట్!

4

‘టాక్సిక్’ గాయానికి ‘రామాయణ’ మందు అవుతుందా.. యశ్ ముందున్న బిగ్ టార్గెట్ ఇదే..!!

5

Adarsha Kutumbam Review:వెంకటేష్, త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్‌బస్టర్ మూవీకి రీమేకా..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Yash - Ramayana Big Target: యశ్ .. ’టాక్సిక్’ మూవీతో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమా నుంచి ఎదురైన చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్న యశ్.. 'రామాయణ'తో తన పాత గాయానికి మందేస్తున్నట్టు కనిపిస్తుంది.  కేవలం యాక్టింగ్, నిర్మాణానికే పరిమితం కాకుండా రామాయణ కోసం మరో అవతారంలోనూ యశ్ ఈ ప్రాజెక్టును తన భుజాలపై మోస్తున్నడు. .?

‘రామాయణ’ సినిమాను భుజాలపై మోస్తోన్న యశ్.. 
టాక్సిక్ తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో యశ్‌కు ఫుల్ క్లారిటీతో  ఉన్నాడు. ‘టాక్సిక్’  దెబ్బతో కోల్పోయిన మార్కెట్ ఇమేజ్‌ను బౌన్స్ బ్యాక్ చేసుకునేందుకు ‘రామాయణ’ చిత్రం పైనే రాఖీ భాయ్ తన ఆశలన్నీ పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమాకి సంబంధించి ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతున్నాడు.  స్క్రీన్ మీద నటుడిగానే కాకుండా తెర వెనుక ప్రొడ్యూసర్‌గా కూడా మారిపోయి మూవీని ముందుండి నడిపిస్తున్నాడు.

రామాయణ కర్ణాటక రైట్స్..

రామాయణ కర్ణాటక రైట్స్‌ను సొంతం చేసుకున్న యశ్.. తన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా ఆయనకు ఇది రెండో ప్రాజెక్ట్. బిజినెస్ యాంగిల్‌లోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.  దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా కలిసి యశ్ ఈ విజువల్ వండర్‌ను తీసుకొస్తున్నారు.

రణబీర్ కపూర్  శ్రీ రామచంద్రుడిగా..  సాయి పల్లవి సీతమహాదేవిగాజ.. బాలీవుడ్ యాక్షన్ స్టార్  సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ ద్వయం సంగీతం అందించారు.భారీ స్టార్ కాస్ట్, టాప్ టెక్నీషియన్స్‌తో వస్తున్న రామాయణని యశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఏదేమైనా టాక్సిక్ తాలూకు చేదు అనుభవాలను మర్చిపోయేలా.. యశ్‌ ఇమేజ్‌ను రామాయణ ఎలా మారుస్తుందనేది చూడాలి.

రెండు భాగాలుగా 40 భాషల్లో ‘రామాయణ’ మూవీ..

రామాయణ విషయానికొస్తే.. ఈ సినిమా రెండు భాగాలుగా  వరల్డ్ వైడ్‌గా 40 భాషల్లో, మన దేశంలో 5 భాషల్లో రిలీజ్ కానున్న రామాయణ స్కేల్ చూస్తుంటే.. ఫుల్ రన్‌లో రూ. 1500 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ సినిమాలో యశ్ కు సంబంధించిన ‘రావణాసురుడి’ పాత్రకు ఎక్కువ స్కోప్ దక్కింది. మొత్తంగా యశ్ చేసిన గాయాన్ని ‘రామాయణ’ విజువల్ ఎపిక్ కవర్ చేస్తుందా..? పోయిన మైలేజ్ తిరిగి తీసుకొస్తుందా అనేది చూడాలి.  

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News