‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు వాట్ నెక్ట్స్ .. లైన్‌లో క్రేజీ డైరెక్టర్స్..
Mahesh Babu What Next: సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి అంతా సిద్ధమవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. అయితే ‘వారణాసి’ తర్వాత మహేశ్ బాబు చేయబోయే సినిమా ఏది? అనే ప్రశ్న మాత్రం ఇప్పటి నుంచే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Varanasi Movie Mahesh Babu Next Movie: మహేశ్ బాబు తర్వాతి ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ‘వారణాసి’ సినిమాకు సంబంధించి మహేశ్ బాబుకు సంబంధించిన షూట్ కంప్లీటైంది. దాదాపు షూటింగ్ కంప్లీటైంది. కొన్ని ప్యాచ్ వర్క్స్ మిగిలిన ఉన్నాయి. దసరా రోజు ఈ సినిమాకు అఫీషియల్‌గా గుమ్మడికాయ కొట్టనున్నారు. ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు ఏ దర్శకుడితో ఎలాంటి సినిమా చేస్తాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
లైన్‌లో ప్యాన్ ఇండియా దర్శకులు..
రాజమౌళి వంటి ప్యాన్ ఇండియా దర్శకుడి తర్వాత.. మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగా, అట్లీ, లోకేష్ కనగరాజ్ పేర్లు చర్చలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా మహేశ్‌తో తదుపరి చిత్రం కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మహేశ్ బాబు తన నెక్ట్స్ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయలేదు.
మహేష్ బాబు - లోకేష్ కనగరాజ్..
ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేశ్–లోకేష్ కాంబినేషన్ పేరు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది. ఇద్దరూ కలిసి ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారానికి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం లేదు. అంటే.. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చగానే చూడాలి.
ఈ కాంబినేషన్‌పై చర్చ పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ఇటీవల లోకేష్ కనగరాజ్ నటించిన ‘DC’ సినిమాను చూసిన మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు. సినిమాను “original and outstanding” అంటూ ప్రశంసించడంతో పాటు, ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించినట్టు తన ట్వీట్‌లో తెలిపారు. మహేశ్ చేసిన ఈ ప్రశంసలకు దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ స్పందించి ధన్యవాదాలు తెలిపారు.
ఇక్కడే మహేశ్–లోకేష్ కాంబినేషన్‌పై కొత్త చర్చ మొదలైంది. సాధారణంగా ఇద్దరు స్టార్ ఫిల్మ్‌మేకర్స్ లేదా హీరోలు ఒకరినొకరు ప్రశంసించడమే సినిమా కాంబినేషన్‌కు ఆధారం కాదు. కానీ మహేశ్ ప్రస్తుతం తన తదుపరి సినిమాను ప్రకటించకపోవడం, మరోవైపు లోకేష్ పేరు కూడా ఆయన నెక్ట్స్ లిస్ట్‌లో వినిపిస్తుండటంతో ఈ రూమర్‌కు మరింత ఆసక్తి ఏర్పడింది.
లోకేష్ కనగరాజ్‌కు వరస కమిట్‌మెంట్స్..
అయితే లోకేష్ కనగరాజ్‌కు ప్రస్తుతం తనదైన కమిట్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో ప్రాజెక్ట్‌ను 2026లోనే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి లోకేష్ దర్శకత్వం వహించనున్నారు, అనిరుధ్ సంగీతం అందించనున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుత ప్రాజెక్ట్ పూర్తయ్యాక పనులు ముందుకు వెళ్లేలా షెడ్యూల్ ఉన్నట్లు సమాచారం.
అంతేకాదు, ‘AA23’ తర్వాత ‘ఖైదీ 2’ వైపు వెళ్లాలని లోకేష్ గతంలో వెల్లడించినట్లు కూడా రిపోర్టులు ఉన్నాయి. కాబట్టి మహేశ్‌తో సినిమా చేయాలంటే కథ, స్క్రిప్ట్, డేట్స్, ప్రీ-ప్రొడక్షన్ వంటి చాలా అంశాలు ఒకేసారి సెట్ కావాల్సి ఉంటుంది. అందుకే కేవలం సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం ఆధారంగా మహేశ్–లోకేష్ సినిమా ఫిక్స్ అయిందని చెప్పడం తొందరపాటు అవుతుంది.
మరోవైపు మహేశ్ బాబు కూడా ప్రస్తుతం పూర్తిగా వారణాసిపైనే ఫోకస్ పెట్టారు. త్వరలో మహేష్ బాబు తెలుగు, తమిళం, హిందీల తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మాత్రం ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. మహేశ్ నెక్ట్స్ కోసం పలు ప్రొడక్షన్ హౌస్‌లు, దర్శకుల పేర్లు చర్చలో ఉన్నప్పటికీ ప్రాజెక్ట్ ఖరారైనట్లు అధికారికంగా ప్రకటించలేదు.
మహేష్ - లోకేష్ కాంబినేషన్‌లో కొత్త ప్రపంచంలో సాగే కథ...
ఇక మహేశ్–లోకేష్ కాంబినేషన్ నిజంగా సెట్ అయితే మాత్రం అది సాధారణ కాంబినేషన్ కాదనే చెప్పాలి. ఒకవైపు మహేశ్ బాబు స్టార్ ఇమేజ్, మరోవైపు లోకేష్ కనగరాజ్ యాక్షన్ టేకింగ్.. ఈ రెండూ కలిస్తే ఎలాంటి కథను ఎంచుకుంటారు? మహేశ్‌ను లోకేష్ ఏ తరహా పాత్రలో చూపిస్తారు? ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధం ఉన్న కథ అవుతుందా? లేక పూర్తిగా కొత్త ప్రపంచంలో సాగే స్టాండ్‌లోన్ సినిమా అవుతుందా? అనే ప్రశ్నలు ఆసక్తిని పెంచుతున్నాయి.
అయితే ప్రస్తుతానికి వీటన్నింటికీ సమాధానం లేదు. మహేశ్ బాబు నెక్ట్స్ మూవీ అధికారికంగా ఫిక్స్ కాలేదు. లోకేష్ పేరు మాత్రం బలంగా వినిపిస్తున్న దర్శకుల జాబితాలో ఉంది. మహేశ్ ‘వారణాసి’ తర్వాత ఎవరితో చేతులు కలుపుతారనేది అధికారిక ప్రకటన వచ్చినప్పుడే స్పష్టమవుతుంది.