• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /సింగీతం మృతిపై రేవంత్,బాలయ్య, పవన్, ఎన్టీఆర్ సహా పలువురి ప్రముఖుల సంతాపం..

సింగీతం మృతిపై రేవంత్,బాలయ్య, పవన్, ఎన్టీఆర్ సహా పలువురి ప్రముఖుల సంతాపం..

Political Movie Celebrities Condemns Singeetham Death: భారత దేశం గర్వించే దర్శకుల్లో సింగీతం శ్రీనివాస రావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన మృతితో భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసినట్టైయింది. తుది శ్వాస వరకు సినిమానే శ్వాసగా, ధ్యాసగా బతికిన ఈ లెజండరీ దర్శకుడు మృతిపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో వివిధ మాధ్యమాల ద్వారా తమ సంతాపం తెలియజేస్తున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 04, 2026, 08:56 AM IST|Updated: Oct 04, 2026, 09:09 AM IST
joinshare
సింగీతం మృతిపై రేవంత్,బాలయ్య, పవన్, ఎన్టీఆర్ సహా పలువురి ప్రముఖుల సంతాపం..
Image Credit: CM Revanth to Pawan balayya Ntr condolence (File Pics/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
సింగరేణి కార్మికులకు బిగ్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ. 1.10లక్షలు.. పూర్తి వివరాలివే..!!

సింగరేణి కార్మికులకు బిగ్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ. 1.10లక్షలు.. పూర్తి వివరాలివే..!!

2

ఇప్పుడే బంగారం కొంటున్నారా?.. కాస్త ఆగండి.. ధన్‌తేరస్ నాటికి పసిడి రేట్లలో ఊహించని మార్పు..HSBC రిపోర్ట్..!!

3

Rachita Ram Video: ఆ పనిచేయలేదు కదా.!. ఫ్యాన్ బుగ్గలు గిల్లిన ఘటనపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటి రచిత రామ్.. వీడియో వైరల్..

4

సింగీతం మృతిపై రేవంత్,బాలయ్య, పవన్, ఎన్టీఆర్ సహా పలువురి ప్రముఖుల సంతాపం..

5

Haryana: కూతురి కాళ్లపై పడి వేడుకుంటున్న తండ్రి.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. అసలు విషయం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Revanth to jr ntr pawan balayya Condolence of Legendery director Demise: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలో వయసు రీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈయన  మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భారతీయ సినీ రంగానికి సింగీతం శ్రీనివాసరావు అందించిన విశిష్ట సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సీఎం తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. తనదైన సృజనాత్మకత, వినూత్న ఆలోచనలతో సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సింగీతం శ్రీనివాసరావు మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. సింగీతం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సినీరంగంలో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమకు, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. వైవిధ్యమైన కథాంశాలను, వినూత్నమైన ఆలోచనలను తెరపై ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడని స్మరించుకున్నారు. ప్రయోగాత్మకతకు పెద్దపీట వేస్తూ ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన ముద్రను సినీ చరిత్రలో శాశ్వతంగా వేశారని అన్నారు. దర్శకుడిగానే కాకుండా రచయితగా, ఆలోచనాపరుడిగా, సినిమా పట్ల అపారమైన ప్రేమతో పనిచేసిన కళాకారుడిగా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ కళాభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. #SingeethamSrinivasaRao

— Telangana CMO (@TelanganaCMO) October 4, 2026

మరోవైపు సింగీతం మృతి పై తొలిగా స్పందించిన ఎన్టీఆర్..  సింగీతం శ్రీనివాసరావు గారు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరమన్నారు. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి… ఇలా కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికత అందరికీ స్పూర్తి అన్నారు.  వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సింగీతం శ్రీనివాసరావు గారు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి… కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి 🙏

— Jr NTR (@tarak9999) October 3, 2026

అటు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..

ప్రముఖ దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు కన్ను మూశారని తెలిసి విచారిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు  వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. భారతీయ చలన చిత్రపరిశ్రమలో విభిన్న చిత్రాలు రూపొందించిన ఆయనకు చిత్ర పరిశ్రమ ఎప్పటికీ ఋణపడి ఉంటుందన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన   పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మయూరి, ఆదిత్య 369, మైకేల్ మదన కామరాజు లాంటి చిత్రాల్లో శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన ప్రయోగాలు, చూపిన సృజన ప్రేక్షకులను మెప్పించాయి.

ఆయన రూపొందించిన అమెరికా అమ్మాయి, పంతులమ్మ లాంటి చిత్రాల్లోని గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందిన విసయాన్ని ప్రస్తావించారు. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకి సినిమా పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం అన్నారు. శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు.

 

శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి ప్రముఖ దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు కన్ను మూశారని తెలిసి విచారిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారతీయ చలన చిత్రపరిశ్రమలో విభిన్న చిత్రాలు రూపొందించారు. పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మయూరి, ఆదిత్య 369, మైకేల్ మదన కామరాజు లాంటి చిత్రాల్లో శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన ప్రయోగాలు, చూపిన సృజన ప్రేక్షకులను మెప్పించాయి. ఆయన రూపొందించిన అమెరికా అమ్మాయి, పంతులమ్మ లాంటి చిత్రాల్లోని గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 94 ఏళ్ల వయసులోనూ సింగ్ గీతం అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకి సినిమా పట్ల ఉన్న ఆసక్తిని తెలియచేసింది. శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. - @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada

— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 4, 2026


బాలయ్య సింగీతంతో తన అనుబంధాన్ని సుధీర్ఘమైన పోస్ట్ పెట్టారు..

 

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మా కుటుంబానికి చాలా సన్నిహితులని చెప్పుకొచ్చారు.

మేమిద్దరం కలిసి మూడు విభిన్నమైన క్లాసిక్ చిత్రాలను అందించిన విషయాన్ని ప్రస్తావించారు.  తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకే ఒక కొత్త ముద్ర వేసిన 'ఆదిత్య 369'; తెలుగులో మొట్టమొదటి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆధారిత చిత్రంగా నిలిచిపోయిందన్నారు. ఈ సినిమా  బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఇక  జానపద చిత్రాలలో ఇప్పటికీ తిరుగులేనిదిగా నిలిచిన 'భైరవ ద్వీపం';  పౌరాణిక చిత్రం  'శ్రీ కృష్ణార్జున విజయం'. ఈ మూడు చిత్రాల ద్వారా, ఒకే దర్శకుడి సారథ్యంలో నేను సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక అనే నాలుగు ప్రధాన జానర్‌లలోని పాత్రలను పోషించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయతో చేసిన సినిమా జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరచిపోలేనన్నారు.

మా నాన్నగారు తొలిసారిగా శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన చిరస్మరణీయ చిత్రం 'మాయాబజార్' కోసం గొప్ప దర్శకుడు కె.వి. రెడ్డి వద్ద సింగీతం గారు సహాయకుడిగా తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.  ఆ తర్వాత, ఆయన మా నాన్నగారి అనేక చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. అందువల్ల, మా కుటుంబానికి ఆయనతో సినిమా రంగానికి అతీతమైన ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడిందన్నారు.

సింగీతం  అన్ని విధాలా అసలు సిసలు దిగ్గజ దర్శకుడు. ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి శ్వాస వరకు వివిధ భారతీయ భాషలలో మరపురాని సినిమాలతో  ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు అన్నారు. ిక  భారతీయ చిత్ర పరిశ్రమకు పూడ్చలేని నష్టమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. సింగీతం గారి కుటుంబ సభ్యులకు మా నందమూరి కుటుంబం తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు.

అటు బాలయ్య అల్లుడు, చంద్ర బాబు తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్.. సింగీతం మృతి పట్ట తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.  ప్రయోగాత్మక చిత్రాలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు మా తాతయ్య ఎన్టీఆర్ గారు, బాలా మామయ్యలతో కలిసి పనిచేసిన సింగీతం గారు అనేక అద్భుతమైన చిత్రాలను అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బాలా మామయ్య కెరీర్‌లోనే ఆణిముత్యాల్లాంటి 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. ప్రయోగాత్మక చిత్రాలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా తాతయ్య ఎన్టీఆర్ గారు, బాలా మామయ్యలతో కలిసి పనిచేసిన సింగీతం గారు అనేక అద్భుతమైన చిత్రాలను… pic.twitter.com/j9h2nU1poQ

— Lokesh Nara (@naralokesh) October 4, 2026

 95 ఏళ్ల వయసులోనూ 'సింగ్ గీతం' చిత్రాన్ని తెరకెక్కించి రికార్డు సృష్టించిన బహుముఖ ప్రతిభాశాలి సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 

 

అటు మెగాస్టార్ చిరంజీవి కూడా సింగీతం మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

Deeply saddened by the passing of the legendary filmmaker ‘Singeetam Srinivasa Rao’ garu.

A true visionary, his imagination and courage to explore new ideas gave Indian cinema some of its most unforgettable films. His contribution to cinema will always be remembered with immense…

— Chiranjeevi Konidela (@KChiruTweets) October 4, 2026

 అటు కళ్యాణ్ రామ్, మంచు విష్ణు, నాని సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేవారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Revanth Reddy
Pawan Kalyan
Telugu News