Drishyam 3 creats New Bench Mark at bollywood Box office: అవును మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘దృశ్యం’ సినిమాను ఆ తర్వాత తెలుగులో వెంకటేష్.. కన్నడలో రవిచంద్రన్.. తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవ్‌గన్ హీరోలుగా ఈ సినిమా రీమేకై మంచి వసూళ్లను రాబట్టింది. అంతేకాదు కొరియన్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
ఆ తర్వాత ‘దృశ్యం 2’ సినిమా మలయాళంలో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘దృశ్యం 2’ ను వెంకటేష్ హీరోగా నటించారు. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది. ఇక హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా చేస్తే అక్కడ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ పూర్తిగా భిన్న కథగా హిందీ ‘దృశ్యం 3’..
తాజాగా ఈ సిరీస్‌లో మోహన్ లాల్ ‘దృశ్యం 3’ సినిమాను తెరకెక్కించారు. ఈ సారి మూడో పార్ట్‌ను తెలుగులో డబ్బింగ్ వెర్షన్‌ను డైరెక్ట్‌గా విడుదల చేశారు. దీంతో వెంకటేష్ కు పార్ట్ 3 సీక్వెల్ చేసే చాన్స్ దక్కలేదు. కానీ హిందీలో డైరెక్టర్ అభిషేక్ పాఠక్.. మూడో పార్ట్‌ను కంక్లూజన్ పేరుతో కాస్త మార్చి తెరకెక్కించాడు. ఈ సినిమా అక్టోబర్ 2 గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విడుదలై తొలి రోజు రికార్డు వసూళ్లను సాధించింది.‘దృశ్యం 3’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 95.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మన దేశంలో రూ. 66.75 కోట్ల నెట్ వసూల్లు (రూ. 80.10 కోట్ల గ్రాస్) కలెక్షన్స్‌ను రాబట్టింది.
అజయ్ దేవ్‌గణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్..
మొత్తంగా అజయ్ దేవ్‌గణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఈ యేడాది ‘ధమాల్ 4’ తర్వాత అజయ్‌కు ఇది రెండో బ్లాక్ బస్టర్. ఇక అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘సింగం ఎగైన్’ మూవీ రెండేళ్ల క్రితం రూ. 43.5 కోట్ల నెట్ వసూళ్లతో ఇప్పటి వరకు టాప్‌లో ఉంది. తాజాగా ‘దృశ్యం 3’ సినిమా అన్ని రికార్డులను మడతపెట్టేసింది. అజయ్ దేవ్‌గణ్ కెరీర్‌లో అత్యధిక తొలి రోజు వసూళ్లను సాధించిన చిత్రాల విషయానికొస్తే..ఆర్ఆర్ఆర్ మినహాయిస్తే.. సింగం రిటర్న్స్ - రూ. 32.1 కోట్లు.. గోల్‌మాల్ ఎగైన్- రూ. 30.15 కోట్లు.. రైడ్ 2 - రూ. 19.25 కోట్లు సాధించి వరుసగా వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచింది.
దృశ్యం సిరీస్‌లో అత్యధిక వసూళ్లు..
2015లో వచ్చిన ‘దృశ్యం’ ఫస్ట్ పార్ట్ ఫస్డ్ డే రూ. 5.85 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ చిత్రం మొత్తంగా ప్పరంచ వ్యాప్తంగా రూ. 110 కోట్ల గ్రాస్ వసూళ్లనే రాబట్టింది. 2022లో వచ్చిన ‘దృశ్యం 2’ సినిమా అప్పట్లో ఫస్ట్ డే రూ. 15.38 కోట్లు రాబట్టింది. ఈ సినిమా అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తాజాగా బాలీవుడ్‌లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా డబ్బింగ్ చిత్రాలను కలిపితే నాల్గో స్థానంలో ఉంది. బాలీవుడ్‌లో ‘దురంధర్ - ది రివెంజ్’ సినిమా తొలి రోజు (రూ.75 కోట్ల నెట్), పుష్ప 2 -రూ. 72 కోట్ల నెట్ వసూళ్లు.. దృశ్యం - 66.75 కోట్ల నెట్ వసూళ్లు, జవాన్ మూవీ - రూ. 65.50 కోట్ల నెట్, టాక్సిక్ మూవీ -రూ. 55.40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టాయి.
మొత్తంగా చూస్తే రెండో రోజు ఈ చిత్రం రూ. 55 కోట్ల వరకు నెట్ వసూళ్లను రాబట్టాయి. ఈ రోజు దాదాపు రూ. 50 కోట్ల నెట్ వసూళ్ల నుంచి రూ. 60 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయి. మొత్తంగా ఫస్ట్ వీకెండ్‌లో రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను దాటే అవకాశాలున్నాయి.