SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

విడుదలకు ముందే ‘అల్లు అర్జున్’, అట్లీల ‘రాకా’ ఖాతాలో రేర్ రికార్డు..

Raaka New Record: అల్లు అర్జున్ ‘పుష్ప’ సిరీస్‌తో ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు మూడు రోజులుగా 37 నెంబర్ గురించి చర్చ జరుగుతుంది. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ ఓ అప్‌డేట్ వచ్చింది.

Reported By TA Kiran Kumar Sharma Written By TA Kiran Kumar Sharma
Published: Sep 22, 2026, 12:25 PM IST | Updated: Sep 22, 2026, 12:28 PM IST
Image Credit: Raka Guinnis World Record
Join

Raaka Guinnis Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాకా’. ఇప్పటికే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన లుక్‌కు మరి అదిరిపోయే రెస్పాన్స్ మాత్రం రాలేదు. అతని లుక్ పాత ఒనిడా టీవీ యాడ్‌లో డ్రాకులా మాదిరి ఉందనే కామెంట్స్ వినిపించాయి. మరోవైపు అల్లు అర్జున్ మరోసారి సాదాసీదా స్టోరీతో కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాడని మెచ్చుకునే వాళ్లున్నారు.

4 రోజుల ముందే 37 అంటూ ఈ రికార్డుపై హింట్ ఇచ్చిన రాకా టీం

తాజాగా ‘రాకా’ సినిమాకు సంబంధించిన 37 అనే నెంబర్ గురించి మూడు రోజులుగా పెద్ద రచ్చ జరుగుతుంది. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఓ అప్‌డేట్ ఇచ్చింది.. ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు తిరగరాస్తుంది.ఒకేసారి 37 మంది ఆర్టిస్టులతో ‘రియల్-టైమ్ మోషన్ క్యాప్చర్’ (Most People Motion-Captured in Real-Time) చేసి, ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న ‘రాకా’ మూవీ.

ఈ అరుదైన విజయానికి గుర్తుగా హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్‌ అందుకోవడం విశేషం.  సన్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ‘రాకా’ సినిమా .. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తాత, తండ్రి, ఇద్దరు మనవళ్లుగా నాలుగు పాత్రల్లో అలరించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణే, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘రాకా’ ఒకేసారి రెండు భాగాలుగా మూడు నెలల గ్యాప్‌తో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. అది నిజంగా రెండు పార్టులుగా వస్తుందా.. ఒకే పార్ట్‌గా విడుదలవుతుందా అనేది చూడాలి మరి. 


ఇక ‘రాకా’ మూవీ తర్వాత అల్లు అర్జున్.. లోకేష్ కనగరాజ్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో ఓ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఓ సినిమా చేయన్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES