SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమాపై బిగ్ ట్విస్ట్.. !!

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ సినిమా ఉంటుందా లేదా అనేది చాలా మందిలో అనుమానం ఉండే. దానికి లోకేష్ .. తాను అల్లు అర్జున్‌తో దిగిన ఫోటోను షేర్ చేసి ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదనే సంకేతం ఇచ్చారు. అయితే లోకేష్ కనగరాజ్ చెప్పిన లైన్‌కు అల్లు అర్జున్ కాస్త మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎపుడు షూటింగ్ మొదలు కానుందో చూద్దాం.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 16, 2026, 02:55 PM IST | Updated: Oct 16, 2026, 03:03 PM IST
Image Credit: Allu Arjun - Lokesh Kangaraj (X/Source)
Join

AA 23 Crazy Update:  అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్‌పై పూటకో వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాను అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రానుంది. ఈ సినిమా కూడా సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా  ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అల్లు అర్జున్‌తో డిస్కస్ చేస్తూ ఫోటో విడుదల చేసారు లోకేష్ కనకరాజ్.

లోకేష్ చెప్పిన కథ అల్లు అర్జున్  పూర్తిగా కనెక్ట్ కాకపోవడంతో ప్రస్తుతం మార్పులు చేర్పులు జరుగుతున్నాయనేది టాక్.  కొత్త వెర్షన్ రెడీ చేయడానికి లోకేష్ కాస్త టైం అడిగినట్టు సమాచారం. ఈ గ్యాప్‌లో రాకాను పూర్తి చేసి ఫ్రీ అవ్వాలనుకుంటున్నాడు  బన్నీ. లోకేష్ కూడా ప్రస్తుతం ఫోకస్ అంతా అల్లు అర్జున్ స్టోరీపైనే పెట్టినట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలని చూస్తున్నారు.

'రాకా' పూర్తైన తర్వాత గానీ బన్నీకి లోకేష్ సినిమాపై ఫోకస్ చేసే ఛాన్స్ ఉండదు. ఒక్కసారి రాకా పూర్తైతే.. నాన్ స్టాప్ షెడ్యూల్స్‌తో త్వరగా AA23 పూర్తి చేయాలనేది లోకేష్ కనగరాజ్ మాస్టర్ ప్లాన్. అనిరుధ్ దీనికి సంగీతం అందించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా చూసకుంటే అల్లు అర్జున్,లోకేష్ కనగరాజ్ సినిమా  సమ్మర్ నుంచి  సెట్స్ పైకి వెళ్లే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES