SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Amitabh House Bomb Threat: ముంబైలో మరోసారి బాంబు కలకలం..ఏకంగా అమితాబ్ బచ్చన్ ఇంటికే స్పాట్ పెట్టిన దుండగులు!

Amitabh Bachchan House Bomb Threat: ముంబైలోని ప్రముఖ ప్రాంతాలను పేల్చివేస్తామంటూ ఆగంతుకుల నుంచి బాంబే హైకోర్టుకు బాంబు బెదిరింపు ఈ - మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా', బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), వర్లీ రేస్‌కోర్స్ లక్ష్యంగా ఈ హెచ్చరికలు వచ్చాయి. భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.

Written By Harish Darla
Published: Nov 06, 2026, 04:04 PM IST | Updated: Nov 06, 2026, 04:07 PM IST
Join

Amitabh Bachchan House Bomb Threat: ముంబై మహానగరంలో మరోసారి బాంబు బెదిరింపు ఆందోళన కలిగించింది. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్‌కు చెందిన 'జల్సా' బంగ్లాతో పాటు నగరంలోని అత్యంత కీలకమైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), వర్లీ రేస్‌కోర్స్‌లను బాంబులతో పేల్చివేస్తామని హెచ్చరిస్తూ ఆగంతుకులు ఈ - మెయిల్ పంపారు. ఈ బెదిరింపు ఈ - మెయిల్ నేరుగా బాంబే హైకోర్టుకు అందడంతో భద్రతా ఏజెన్సీలు వెంటనే అప్రమత్తమయ్యాయి.

వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ (IANS) నివేదికల ప్రకారం.. ఈ హెచ్చరికను ముంబై పోలీసులు, భద్రతా విభాగాలు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. హెచ్చరిక అందిన వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు (BDS), స్థానిక పోలీసులు రంగంలోకి దిగి అమితాబ్ నివాసం, బీఎస్‌ఈ, రేస్‌కోర్స్ పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు గానీ లేదా అనుమానాస్పద వస్తువులు గానీ లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ముంబై నగరంలో ఇటీవల కాలంలో ఇలాంటి ఈ - మెయిల్ బెదిరింపుల పరంపర పెరగడం గమనార్హం. గతంలో అక్టోబర్ 23న కూడా అమితాబ్ బచ్చన్ ఆస్తిని టార్గెట్ చేస్తూ ఒక పాఠశాలకు బెదిరింపు ఈ - మెయిల్ వచ్చింది. అంతకుముందు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రధాన కార్యాలయానికి కూడా ముష్కరుల నుంచి ఇలాంటి హెచ్చరికలే అందాయి.

ఈ తాజా ఘటనపై ముంబై సైబర్ సెల్ పోలీసులు ప్రత్యేక కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ - మెయిల్ పంపిన వ్యక్తి లేదా ముఠాకు సంబంధించిన ఐపీ (IP) అడ్రస్, డిజిటల్ ఆధారాలను పోలీసు నిపుణులు ట్రేస్ చేస్తున్నారు. నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ భయానక బెదిరింపుల వెనుక ఒకే ముఠా ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES