SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఆస్కార్ బరిలో అనూహ్యంగా నాగా చిత్రం ‘అంగ్’కు దక్కిన చోటు..

Oscar Awards Nominations: ప్రపంచ సినీ ప్రేమికులు అత్యంత ఇష్టపడే అవార్డుల్లో ఆస్కార్‌కు తొలి స్థానం దక్కుతుంది. హాలీవుడ్ సహా ఇతర దేశాలకు చెందిన సినీ ఇండస్ట్రీ వాళ్లు ఈ అవార్డు కోసం పలు చిత్రాలను తెరకెక్కించిన నామినేషన్‌కు కోసం పంపిస్తుంటారు. అయితే ఆస్కార్ నామినేషన్‌ దక్కడం అంత ఈజీ కాదు. ప్రతి సారి ఆస్కార్ అవార్డు ఉత్తమ విదేశీ చిత్ర క్యాటగిరిలో మన దేశం తరుపున ఒక చిత్రాన్ని నామినేట్ చేస్తుంటారు. ఈ సారి మరాఠీ చిత్రం ‘గోందల్’తో పాటు నాగా చిత్రం ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైంది. ఈ సారి నాగా చిత్రం ‘అంగ్’ చిత్రం నామినేట్ అయింది.

Reported By TA Kiran Kumar Sharma Written By TA Kiran Kumar Sharma
Published: Sep 22, 2026, 08:46 AM IST | Updated: Sep 22, 2026, 08:55 AM IST
Image Credit: 99వ అకాడమీ అవార్డుల బరిలో నాగాలాండ్ చిత్రం
Join

99 Academy Awards Nomination for India: ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూసే ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ కు రంగం సిద్ధమైంది. ప్రతి సారి మన దేశం తరుపున ఓ చిత్రాన్ని నామినేట్ చేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి మన దేశం తరుపున ‘దురంధర్’, పెద్ది, ఇరుముడి వంటి సినిమాలు కాదని మరాఠీ చిత్రం ‘గోంధల్’ సినిమా ఆస్కార్‌కు మన దేశం తరుపున ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్  ఇండియా ఎంపిక చేసింది. ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరిలో ఈ అవార్డును ప్రధానం చేస్తుంటారు.  

అయితే తాజాగా ఈ అవార్డు రేసులో మన దేశం తరుపున నాగా చిత్రం నామినేషన్స్‌కు సెలెక్ట్ అయింది. నాగాలాండ్ దర్శకుడు తెరకెక్కించిన ‘అంగ్’ మూవీ డైరెక్ట్‌గా ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైంది. మన దేశం అధికారికంగా నామినేట్ చేయకపోయినా.. డైరెక్ట్‌గా ఆస్కార్ వేదికపై నిలిచింది.

ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కు సంబంధం లేకండా ఆస్కార్ నామినేషన్స్ కు అంగ్..

అయితే ఆస్కార్ కు పంపే సినిమాల్లో మన దేశం తరుపున ఫిల్మ్ ఫెడరేషన్ ఆప్ ఇండియానే ఎంపిక చేసి పంపిస్తూ ఉంటుంది. ఈ ఇయర్ కూడా ఫెడరేషన్ ఫైనల్‌గా మూడు చిత్రాలను ఎంపిక చేసింది. అందులో ‘గోంధల్’ తో పాటు ‘అంగ్’ సినిమా కూడా ఉంది. మన దేశంలో విడుదల కాలేదు కాబట్టి ఆ చిత్రాన్ని పక్కనపెట్టారు. అయినా.. డైరెక్ట్‌గా ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. నాగాలాండ్ నుంచి ఈ అవార్డు అందుకున్న ఫస్ట్ మూవీగా ‘అంగ్’ నిలవడం విశేషం.

తాజాగా సెప్టెంబర్ 20న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘అంగ్’ ఫ్లాట్‌పామ్ బహుమతి అందుకుంది. ఈ యేడాది ఫ్లాట్‌పామ్ క్యాటగిరిలో ప్రపంచ వ్యాప్తంగా 12 చిత్రాలు పోటీలో నిలిచాయి. అందులో ‘అంగ్’ సినిమా ఉండటం విశేషం. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులు దర్శకుడి విజన్‌తో పాటు చిత్రాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రశంసించారు.

నాగాలోని కోన్యాక్ తెగ భాషలో తెరకెక్కిన ‘అంగ్’..

నాగా భాషలో తెరకెక్కించిన ‘అంగ్’ చిత్రాన్ని నాగాకు చెందిన తేజ్ రియో డైరెక్ట్ చేశారు. ఈ సినిమా నాగాలాండ్ సినీ చరిత్రలో ఓ మైలు రాయి అని చెప్పాలి. 1960లో నాగాలాండ్‌లో మిషనరీ రాకతో అక్కడ ప్రజలు ఒత్తిడి గురైన కోన్యాక్ తెగకు చెందిన కథ. ముఖ్యంగా కోన్యాక్ గ్రామ పెద్ద, అతని కొడుకు చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం కోన్యాక్ భాషలో తెరకెక్కింది. ఈ చిత్రంలో బాఫ్లా అవార్డు విజేత.. నటుడు డగ్లస్ హెన్‌షాల్‌తో పాటు ఆదివాసీ నాగా వర్గానికి చెందిన నటీనటులు యాక్ట్ చేయడం విశేషం. ఈ సినిమాను తెరకెక్కించడం కోసం గ్రామాల్లోని ప్రజలను ఆడిషన్ చేసి 16 ఎంఎం ఫార్మాట్‌లో ఈ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పారు. ఈ మూవీ కోసం పనిచేసిన సినిటోగ్రాఫీర్ ఆడమ్ పీట్‌కివిచ్.. వెరైటీ ఆర్టిసన్ అవార్డు అందుకోవడం విశేషం.

మన దేశంలో ఆర్ఆర్ఆర్ కూడా మన దేశం తరుపున నామినేషన్ దక్కించుకోలేదు. అయినా.. ప్రైవేటుగా ఉత్తమ గేయం, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకుంది. మన దేశం నుంచి మన దేశం వాళ్లు తెరకెక్కించిన సినిమాకు అవార్డు రావడం అదే మొదటిసారి. ఇక అదే యేడాది బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ‘ఎలిఫెంట్ విస్పర్స్’ సినిమా అవార్డు కైవసం చేసుకుంది.

మన దేశం తరుపున మూడు చిత్రాలు మాత్రమే నామినేషన్స్ దక్కించుకున్నాయి..

మన దేశం తరుపున ఆస్కార్‌కు నామినేషన్స్ పంపినా చిత్రాల్లో ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’ చిత్రాలు మాత్రమే నామినేషన్స్‌ దక్కించుకున్నాయి. కానీ ఏ సినిమా అవార్డు దక్కించుకోలేకపోయింది. మరి ‘గోంధల్’తో పాటు ‘అంగ్’ సినిమాలైనా.. నామినేషన్స్ దక్కించుకొని అవార్డు గెలుస్తాయా అనేది చూడాలి మరి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES