SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మరోసారి పాటగాడిగా బాలయ్య.. థమన్‌తో మాస్ ట్రీట్ రెడీ..

Balakrishna Again Singer Mode: హీరోలు తెరపై నటించడమే కాదు.. స్టార్ట్, కెమెరా యాక్షన్ అంటూ తెర ముందు నటించడమే కాదు.. అపుడుపుడు తెర వెనక డైరెక్ట్ చేస్తున్నారు. మరికొంత మంది హీరోలు అపుడపుడు సినిమాల్లో సింగర్‌గా అలరిస్తున్నారు. ఇప్పటికే తెలుగు చాలా మంది హీరోలు పాటగాళ్లుగా ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి తన గొంతుతో అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నారు. అవును.. ఈసారి బాలయ్య కేవలం నటుడిగానే కాదు.. సింగర్‌గా కూడా సందడి చేయడానికి రెడీ అయ్యా

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 11, 2026, 03:50 PM IST | Updated: Nov 11, 2026, 03:52 PM IST
Image Credit: Balakrishna As Singer (Source/ZEE News Telugu)
Join

Singer Balayya: ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'దాదా'. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’  ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా ఈ సినిమా 90ల నాటి  స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతోంది.  బాలయ్యను దర్శకుడు గోపీచంద్ మలినేని ఏ రేంజ్‌లో చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రచార అప్‌డేట్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. గతంలో ప్రాణానికి ప్రాణం, అశోక చక్రబర్తి, యువరత్న రాణా, సుల్తాన్ వంటి చిత్రాల్లో గ్యాంగ్ స్టర్ పాత్రల్లో అలరించి మెప్పించారు బాలయ్య.

తాజాగా  ఈ సినిమా నుంచి రాబోతున్న ఫస్ట్ సింగిల్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. నవంబర్ 13న ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ పాటకు సంబంధించి తాజాగా వచ్చిన సర్‌ప్రైజ్ అప్‌డేట్ మాత్రం అభిమానుల్లో మరింత జోష్ నింపుతోంది.

అదేంటంటే.. ఈ పాటను స్వయంగా బాలకృష్ణనే ఆలపించారట.  దీంతో పాట విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా బాలయ్య పాటల్లో కనిపించే ఎనర్జీ, ఆయన వాయిస్‌లో ఉండే ప్రత్యేకమైన మాస్ టచ్ ఈసారి మ్యూజిక్ రూపంలో ఎలా వినిపించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

గతంలో బాలకృష్ణ 'పైసా వసూల్' సినిమాలో టైటిల్ సాంగ్‌ను స్వయంగా పాడి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఆ పాటలో ఆయన చూపించిన ఎనర్జీ, పాడిన విధానం ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి మైక్ పట్టుకోవడంతో అభిమానులు ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతకు ముందు హుద్ హుద్ తుపాను బాధితుల కోసం నిర్వహించిన ఛారిటీ షోలో లెజెండ్ పాటను హమ్ చేశారు.

ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ పాటను ఎలా కంపోజ్ చేశారనేది ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం. బాలయ్య వాయిస్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ బీట్స్, మాస్ లిరిక్స్, అదిరిపోయే మ్యూజిక్‌తో ఈ పాటను సిద్ధం చేశారా? లేక అభిమానులకు ఒక కొత్త మ్యూజికల్ ట్రీట్ ఇవ్వబోతున్నారా? అన్నది తెలియాలంటే నవంబర్ 13 వరకు వేచి చూడాల్సిందే.

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, గోపీచంద్ మలినేని టేకింగ్, థమన్ సంగీతం.. ఈ మూడు అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మొత్తానికి బాలయ్య మరోసారి తన గాత్రంతో అభిమానులను పలకరించబోతుండటం ఈ సినిమాకు సంబంధించిన తాజా హైలైట్‌గా మారింది. మరి నవంబర్ 13న విడుదలయ్యే ఈ ఫస్ట్ సింగిల్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది? బాలయ్య గొంతులో వచ్చే ఈ మాస్ సాంగ్ అభిమానులకు ఏ స్థాయిలో కిక్ ఇస్తుందనేది వెయిట్ అండ్ సీ. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES