SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దర్శకులకు బాలయ్య బంపర్ ఆఫర్.. ఇది కదా కావాల్సింది.. !!

Balayya Bumper offer to Directors: నందమూరి బాలకృష్ణ.. ఇక్కడ బడా, చోటా అనే దర్శకులనే తేడా లేకుండా అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. వచ్చిన ప్రతీ దర్శకుడు చెప్పే కథను వింటున్నారు ఈ సీనియర్ స్టార్ హీరో. నచ్చిన కథను ఒడిసి పట్టుకుంటున్నారు బాలయ్య. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం పర్ఫెక్ట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు NBK.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 02, 2026, 06:29 AM IST | Updated: Nov 02, 2026, 06:30 AM IST
Image Credit: Balayya Crazy Line up (File/Source)
Join

Balakrishna New Offers: బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ‘దాదా’ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్  పూర్తైన ఈ చిత్రం.. డిసెంబర్ 24న విడుదల చేయాలని కిందా మీదా అవుతున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాఫియా కథ ఇది. దీని తర్వాత కొరటాల శివతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే అవ్వగా.. ఫైనల్ నెరేషన్ కోసం వేచి చూస్తున్నారు బాలయ్య.

యంగ్ డైరెక్టర్స్‌కు ఓపెన్ ఆఫర్.. 
సీనియర్స్‌తో పాటే యంగ్ టాలెంట్‌ డైరెక్టర్స్‌కు వరస అవకాశాలు ఇస్తున్నారు బాలకృష్ణ. ఈ క్రమంలోనే 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడలతోనూ బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారనే టాక్ చాలా కాలంగా వినిపిస్తుంది. త్వరలోనే విజయ్ సినిమాపై క్లారిటీ రానుంది. మరోవైపు బాలకృష్ణకు సింహా, లెజెండ్, అఖండ లాంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను కూడా 'అఖండ 3' ప్రాజెక్ట్‌ను కన్ఫర్మ్ చేసేశారు. అఖండ 2 అనుకున్నంత రేంజ్‌లో బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేయలేదు. అయినా బోయపాటి చెప్పిన లైన్‌కు ఫిదా అయి ‘అఖండ 3’కి ఓకే చెప్పినట్టు సమాచారం. మరోవైపు బోయపాటికి పిలిచి ఎవరు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఓ రకంగా బోయపాటి శ్రీనుకు ఈ సినిమా అనేది కీలకం.

బాలయ్య క్రేజీ లైనప్.. 
ఈ క్రేజీ లైనప్‌లో 'ఇరుముడి' ఫేమ్ శివ నిర్వాణ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తుంది. ఈయన కూడా సీనియర్ స్టార్ హీరోకు కథ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ఈ మధ్యే మైసూరులో బాలకృష్ణను  కలిసారు శివ నిర్వాణ. మొత్తానికి ఏ దర్శకుడు వచ్చినా డోర్స్ ఓపెన్ అంటున్నారు బాలయ్య. అటు మాస్, ఇటు క్లాస్ డైరెక్టర్స్‌తో ఖతర్నాక్ కాంబినేషన్స్ సెట్ చేస్తూ అన్ స్టాపబుల్‌గా చెలరేగిపోతున్నారు.  

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES