SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bigg Boss 10 Elimination: బిగ్‌బాస్ 10లో ఊహించని పరిణామం..ఏడో వారం డబుల్ ఎలిమినేషన్..ఎవరెవరు?

Bigg Boss 10 This Week Elimination: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ ఏడో వారం ముగింపునకు చేరుకుంది. గత వారం షాలినిని సీక్రెట్ రూమ్‌కి పంపించడంతో ఎలిమినేషన్ ప్రక్రియ వాయిదా పడింది. దీనితో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పక ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది.

Written By Harish Darla
Published: Oct 24, 2026, 03:48 PM IST | Updated: Oct 24, 2026, 03:54 PM IST
Join

Bigg Boss 10 This Week Elimination: సెప్టెంబర్ 07న ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ ఇప్పటికే ఆరు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం ఏడో వారం చివరి దశకు చేరుకుంది. ఎప్పటికప్పుడు అనూహ్య మలుపులతో అలరిస్తున్న ఈ హౌస్‌లో గత వారం ఆసక్తికర పరిణామాలు జరిగాయి. అసలైతే హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిన కంటెస్టెంట్ షాలినిని ఎలిమినేట్ చేయకుండా బిగ్‌బాస్ నేరుగా సీక్రెట్ రూమ్‌కి తరలించారు.

అనంతరం నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఆమెను తిరిగి హౌస్‌లోకి తీసుకురావడంతో, ఈ వారానికి షాలిని నామినేషన్ల గండం నుంచి సురక్షితంగా బయటపడింది. గత వారం ఎవరూ ఎలిమినేట్ కాకపోవడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటం ఖాయమని ప్రచారం మొదలైంది.

నామినేషన్లు, 'గోట్' టాస్క్ ఊరట..
ఈ వారం నామినేషన్ల ప్రక్రియలో పలువురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో రోహిత్‌, రామకృష్ణ, త్రిగుణ్‌, అమన్‌, వర్షిణి, వంశీ, శ్వేతా నాయుడు, సుధీర్, ఝాన్సీ, దక్షి, శివ, నీతూ మాస్టర్ ఉన్నారు. అయితే తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'గోట్' (GOAT) టాస్క్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన అమన్‌, త్రిగుణ్, దేబ్జానీ, ముకేశ్, నీతూ మాస్టర్‌లు విజయం సాధించారు. వీరు ఈ వారంతో పాటు వచ్చే వారం కూడా నామినేషన్ల నుంచి పూర్తి మినహాయింపు పొంది సురక్షితంగా నిలిచారు.

ఈ వారం డేంజర్ జోన్ వివరాలు..
బిగ్‌బాస్‌లో ఈ వారం ప్రేక్షకుల తాజా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే రోహిత్ మొదటి స్థానంలో తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో త్రిగుణ్, అమన్, రామకృష్ణ, ఝాన్సీ, సుధీర్‌, వర్షిణి, వంశీ క్రమంగా కొనసాగుతున్నారు. అయితే వీరిలో ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే.. నీతూ మాస్టర్, శ్వేత నాయుడు, శివ, దక్షి చివరి స్థానాల్లో నిలిచినట్లు తెలుస్తోంది. వీరితో పాటు నీతూ మాస్టర్ ఇప్పటికే 'గోట్' టాస్క్ ద్వారా సేవ్ అవ్వడంతో ఆమెకు ఎలిమినేషన్ గండం తప్పే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి శివ, దక్షి, శ్వేత నాయుడు డేంజర్ జోన్‌లో మిగిలారు.

డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?
సోషల్ మీడియా సమాచారం ప్రకారం మొదటి వికెట్‌గా దక్షి హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసినట్లు వార్తలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. అయితే గత వారం ఎలిమినేషన్ లేకపోవడంతో వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ కేవలం దక్షిణే బయటకు పంపిస్తారా లేక డేంజర్ జోన్‌లో ఉన్న శివ, శ్వేత నాయుడులలో మరొకరిని కూడా ఎలిమినేట్ చేసి డబుల్ ఎలిమినేషన్ షాక్ ఇస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES