• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /KTR Speech: 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ 1 చేస్తాం: కేటీఆర్‌

KTR Speech: 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ 1 చేస్తాం: కేటీఆర్‌

KT Rama Rao Alleges Telangana Becomes ATM To Rahul Gandhi: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2028లో సీఎం అవుతారని.. తెలంగాణను నంబర్‌ వన్‌ను చేస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారిందని విమర్శించారు. ఖైరతాబాద్ నాయకుడు చేరిక కార్యక్రమంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 25, 2026, 07:10 PM IST|Updated: Oct 25, 2026, 07:14 PM IST
joinshare
KTR Speech: 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ 1 చేస్తాం: కేటీఆర్‌
Image Credit: KTR Speech

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Nominations: ఏపీలో 'పరిషత్‌' ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య హోరాహోరీ

Nominations: ఏపీలో 'పరిషత్‌' ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య హోరాహోరీ

2

అక్టోబర్ 30న రైతు ఖాతాల్లో రూ.2000 జమ.. డబ్బులు పడాలంటే ఈ పనులు వెంటనే చేయండి!

3

Anand Mahindra On Vizag Beach: "వైజాగ్‌లో ఇంతటి అందమైన బీచ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు?" ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!

4

Chandrababu: అర్నాబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు

5

ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలా? మాస్డ్క్‌ ఆధార్‌ను ఫోన్‌లోనే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana ATM To Rahul Gandhi: అసెంబ్లీ ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చిన రాహుల్‌ గాంధీ తెలంగాణ ప్రజలకు ముఖం చాటేస్తున్నాడని.. వెయ్యి రోజులైనా హామీల అమలు ఏది? అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. దేశమంతా తిరిగి రాహుల్ గాంధీకి తెలంగాణ జాడ దొరకడం లేదని.. అడ్రస్ లేకుండా పోయిండని విమర్శించారు. తమకు ముట్టే సొమ్ముల కోసమే రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎదుర్కునే దమ్ము బీజేపీకి లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ సీనియర్ నాయకుడు జిబ్రాన్ షరీఫ్ ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అతడికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో జాప్యం, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో వరుస స్కామ్‌లు.. ప్రశ్నిస్తే తిట్లు, అక్రమ కేసులతో బెదిరింపులు ఉన్నాయని తెలిపారు.

'ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విభజనలు సృష్టిస్తుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. రేవంత్‌ రెడ్డి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై స్పందించకుండా మౌనం వహిస్తున్నారు. రాహుల్ గాంధీకి తెలంగాణ ఏటీఎంగా మారింది. రేవంత్ రెడ్డి ఆయనకు ఏటీఎం కార్డులా వ్యవహరిస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని.. 13 డిక్లరేషన్లను నెరవేరుస్తామని, మొత్తం 420 హామీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రజలకు మాట ఇచ్చారని గుర్తుచేశారు. వెయ్యి రోజులు గడుస్తున్నా ఆ హామీల అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు.

దేశవ్యాప్తంగా తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే ధైర్యం ఎందుకు లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని స్పష్టం చేశారు. అశోక్‌నగర్‌లో నిరుద్యోగ యువత సమస్యలను పట్టించుకోవడం లేదని.. రెండు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీని ఎంతవరకు నెరవేర్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం ఆసరా పెన్షన్‌ను రూ.4,000కు పెంచుతామని చెప్పిన రేవంత్‌ రెడ్డి ఎందుకు పెంచలేదని.. రైతుబంధు రూ.15,000 ఎందుకు పెంచలేదని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే సమాధానం చెప్పాల్సిన రేవంత్ రెడ్డి తిట్లతో బదులిస్తున్నాడని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల హక్కు కూడా అని స్పష్టం చేశారు.

కుంభకోణాల కుంభమేళా
తెలంగాణలో ఒక్కొక్కటిగా వివాదాలు, అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. భూముల వ్యవహారాలు, వ్యాపార ఒప్పందాలపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సుమారు రూ.200 కోట్ల విలువ కలిగిన 5 ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకే తమ్ముడికి బహుమతిగా ఇచ్చాడు. అమెరికాలో నివసించే రేవంత్‌ రెడ్డి తమ్ముడికి రూ.వెయ్యి కోట్ల ఒప్పందంపై సమగ్ర వివరాలు వెల్లడించాలి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ పాలనకు ముందు హైదరాబాద్‌లో కరెంటు కోతలు, నీటి కొరత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో విద్యుత్, తాగునీరు సహా మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించింది. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పదేళ్లపాటు శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగించాం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులను ప్రయోగించడం, అరెస్టులతో భయపెట్టడం వంటి రాజకీయ ధోరణులు ప్రజాస్వామ్యానికి మంచివి కాదని హితవు పలికారు.

'కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. పేదలు, రైతులు, నిరుద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలపై ఝులుం చేసే వారిని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్న వారిని బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టబోదు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని.. తెలంగాణను తిరిగి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Politics
Telugu News