• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP New Vande Bharat Trains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రానికి మరో రెండు వందే భారత్ రైళ్లు!

AP New Vande Bharat Trains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రానికి మరో రెండు వందే భారత్ రైళ్లు!

AP New Vande Bharat Trains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయాణికులకు రైల్వేశాఖ నుంచి త్వరలోనే శుభవార్త అందనుంది. నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న బెంగళూరు ముంబై వందే భారత్ స్లీపర్ రైలు ఏపీ మీదుగా రాకపోకలు సాగించనుండగా, గుంతకల్, అనంతపురం స్టేషన్లలో దీనికి హాల్ట్‌లు కేటాయించారు. దీనికితోడు విశాఖపట్నం - బెంగళూరు మధ్య తిరుపతి మీదుగా మరో సరికొత్త వందే భారత్ స్లీపర్ రైలును నడపాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

Written ByHarish Darla
Published: Oct 25, 2026, 06:32 PM IST|Updated: Oct 25, 2026, 06:34 PM IST
joinshare
AP New Vande Bharat Trains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రానికి మరో రెండు వందే భారత్ రైళ్లు!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Chandrababu: అర్నాబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు

Chandrababu: అర్నాబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు

2

ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలా? మాస్డ్క్‌ ఆధార్‌ను ఫోన్‌లోనే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!

3

KTR Speech: 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ 1 చేస్తాం: కేటీఆర్‌

4

AP New Vande Bharat Trains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రానికి మరో రెండు వందే భారత్ రైళ్లు!

5

RCB: వేలంలో బెంగళూరు జట్టు భారీ వ్యూహం.. వదులుకునే 7 మంది ఆటగాళ్లు వీరే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP New Vande Bharat Trains: భారతదేశంలో ఉన్న విశాలమైన రైల్వే నెట్‌వర్క్ ద్వారా సామాన్యులు తక్కువ ఖర్చుతో దేశంలోని వివిధ ప్రాంతాలకు సులభంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ వందే భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తుండగా, దూరప్రాంత ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

బెంగళూరు - ముంబై వందే భారత్ స్లీపర్..
నవంబర్ 1వ తేదీ నుంచి బెంగళూరు - ముంబై మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించనుంది. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం గుంతకల్, అనంతపురం రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.

విశాఖపట్నం - బెంగళూరు (తిరుపతి మీదుగా) నూతన వందే భారత్..
ఇది కాకుండా, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మరో వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్లే భక్తుల రద్దీని సీఎం ప్రస్తావించారు. శ్రీవారి దర్శనానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున, వారి సౌకర్యార్థం విశాఖపట్నం - బెంగళూరు మధ్య తిరుపతి మీదుగా వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని ప్రతిపాదించారు.

దీనితో పాటు పగటిపూట రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం విశాఖపట్నం - తిరుపతి మధ్య మరో అదనపు రైలును అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ రెండు ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించి తన సమ్మతిని తెలిపారు.

రైల్వే ప్రాజెక్టులు
ఈ సమావేశంలో కొత్తగా నిర్మించిన కనిగిరి - విజయవాడ రైల్వే లైన్‌లో రైలు సేవలను త్వరితగతిన ప్రారంభించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని పోర్టుల నుంచి సరుకు రవాణాను మరింత సులభతరం చేయడం, తూర్పు - పశ్చిమ ప్రాంతాల మధ్య రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేయడం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Andhra Pradesh
AP News
Telugu News