SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bigg Boss 10: ముకేశ్ చేయి పట్టుకుంటే ఆ ఫీలింగ్ వస్తుందట.. వర్షిణి షాకింగ్ కామెంట్స్!

Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో వర్షిణి ఆటపై ప్రస్తుతం పెద్దగా ఆసక్తి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హౌస్‌లో ఉన్న ఇతర సెలబ్రిటీలతో పోలిస్తే ఆమె గేమ్ అంతగా ఆకట్టుకోవడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ముకేశ్‌తో ఆమె చాలా సన్నిహితంగా ఉండటంపై కూడా చర్చ జరుగుతోంది. తాజాగా తనకు ముకేశ్‌తో అంత క్లోజ్‌నెస్ ఎందుకు ఏర్పడిందో వర్షిణి వివరించింది.

Written By Vishnu Priya
Published: Oct 08, 2026, 08:43 AM IST | Updated: Oct 08, 2026, 08:46 AM IST
Join

Bigg Boss 10: త్రిగుణ్‌తో మాట్లాడుతున్న సమయంలో వర్షిణి తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైంది. చిన్నప్పటి నుంచి తాను తన తల్లితోనే పెరిగానని చెప్పింది. తన జీవితంలో తండ్రి ప్రేమను పొందలేకపోయానని ఆమె బాధపడింది. తండ్రి చేయి పట్టుకుని నడిచిన జ్ఞాపకాలు కూడా తనకు లేవని చెప్పింది.

ఈ బాధ తనలో చాలా కాలంగా ఉందని వర్షిణి తెలిపింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆ భావన మరింత ఎక్కువగా గుర్తుకు వస్తోందని చెప్పింది. ఈ కారణంగానే ముకేశ్‌తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిందని వివరించింది.

ముకేశ్ చేయి పట్టుకున్నప్పుడు తనలో ఉన్న భయం తగ్గినట్లు అనిపిస్తుందని వర్షిణి చెప్పింది. తాను మాట్లాడే విషయాలను ముకేశ్ ప్రశాంతంగా వింటాడని, అందుకే అతనితో తనకు మరింత సౌకర్యంగా అనిపిస్తుందని తెలిపింది. బయట నుంచి చూసేవారికి వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం లవ్ ట్రాక్‌లా కనిపించవచ్చని కూడా ఆమె చెప్పింది. కానీ తనకు మాత్రం ఆ బంధం వెనుక వేరే భావన ఉందని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే, హౌస్‌లో అపూర్వ గురించి దేబ్జానీ, వంశీ మధ్య చర్చ జరిగింది. అపూర్వ మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్‌ను దేబ్జానీ అనుకరిస్తూ సరదాగా సెటైర్లు వేసింది. హౌస్‌లో అందరికీ చిరాకు తెప్పించేలా ఒకరు ఉండటం సాధారణమేనని వంశీ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు డేంజర్ జోన్‌లో  ఉన్న కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేక టాస్క్ నిర్వహించారు. ఇందులో జంటలుగా విడిపోయిన కంటెస్టెంట్లు పోటీ పడ్డారు. చరణ్, అపూర్వ ఈ టాస్క్‌ను ముందుగా పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచారు. అయితే రోహిత్, షాలిని చివరి స్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రోహిత్ గేమ్‌లో ఇది డౌన్‌ఫాల్‌కు సంకేతమా అనే చర్చ కూడా మొదలైంది.

Read More: Bigg Boss Telugu Wild Card Entry: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్..హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..లిస్ట్ వచ్చేసింది!

 

Read More: బిగ్‌బాస్‌కు బిగ్ షాక్ .. నాగార్జునకు పోటీగా తేజ సజ్జ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES