SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bigg Boss Telugu 10: షాలినికి రోహిత్ దూరం.. ఓటమితో వంశీ ఎమోషనల్.. సింపతీ గేమ్ మొదలైందా?

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఆరో వారం కెప్టెన్సీ టాస్కులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, భావోద్వేగాలు, కొత్త వ్యూహాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్, షాలిని మధ్య పెరిగిన దూరం, టాస్క్‌లో ఓడిపోయిన తర్వాత వంశీ ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Written By Vishnu Priya
Published: Oct 16, 2026, 08:38 AM IST | Updated: Oct 16, 2026, 08:41 AM IST
Join

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లో ఇన్నాళ్లూ కలిసి కనిపించిన రోహిత్, షాలిని మధ్య ఇప్పుడు విభేదాలు మొదలయ్యాయి. నామినేషన్ల సమయంలో వచ్చిన మనస్పర్థలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచినట్లు కనిపిస్తోంది. ఒకరికి ఒకరు మద్దతుగా నిలిచిన ఈ ఇద్దరూ ఇప్పుడు విడివిడిగా ఉంటుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

షాలిని మాట్లాడటానికి ప్రయత్నించినా రోహిత్ తన నిర్ణయాన్ని మార్చుకోనట్లు కనిపించాడు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదనే సంకేతాలను ఇచ్చాడు. దీంతో షాలిని కొంత అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వచ్చిన తర్వాత రోహిత్ తన ఆటలో మార్పులు చేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షాలినికి దూరంగా ఉండటం అతని గేమ్‌కు ఉపయోగపడవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయం రోహిత్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుంది, ప్రేక్షకులు ఎలా తీసుకుంటారనేది చూడాలి.
మరోవైపు, రామ్ ప్రసాద్ తన టీమ్ సభ్యులతో మాట్లాడుతూ రోహిత్ ఆటతీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు కనిపించింది. హౌస్‌లో ఇతరుల ఆటను ప్రభావితం చేసే వ్యక్తిగా రోహిత్‌ను అభివర్ణించాడు. దీంతో రోహిత్ వ్యూహాలపై చర్చ మొదలైంది.

టాస్క్‌లో ఓడిపోయిన వంశీ.. కన్నీళ్లు!

మరోవైపు, కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్‌లో వంశీకి ఎదురైన ఓటమి భావోద్వేగాలకు కారణమైంది. గ్రీన్, గోల్డ్ టీమ్‌ల మధ్య జరిగిన పోటీలో వంశీ, శివ తలపడ్డారు. ఈ టాస్క్‌లో త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు.

గార్డెన్‌లో దాచిన బౌల్, ప్లేట్‌ను తీసుకొచ్చి పెడెస్టల్‌పై ఉంచిన తర్వాత బెల్ కొట్టాలి. అయితే, వంశీ ప్లేట్‌ను పెడెస్టల్‌పై పెట్టకుండానే బెల్ కొట్టడంతో టాస్క్‌లో పొరపాటు జరిగింది. ఈ సమయంలో శివ అప్రమత్తంగా వ్యవహరించి ప్లేట్‌ను పెడెస్టల్‌పై ఉంచాడు. చివరకు ఈ పోటీలో శివ విజయం సాధించాడు.

తన చిన్న పొరపాటు వల్లే ఓడిపోయానని భావించిన వంశీ తీవ్ర నిరాశకు గురయ్యాడు. భావోద్వేగాలను అదుపు చేసుకోలేక తనను తాను కొట్టుకోవడంతో తోటి కంటెస్టెంట్లు ఆందోళన చెందారు. అనంతరం అతను కన్నీళ్లు పెట్టుకోగా, దెబ్జానీ అతనికి ధైర్యం చెప్పింది. త్రిగుణ్ కూడా వంశీని ఓదార్చాడు.


వంశీకి సింపతీ ఓట్లు వస్తాయా?


వంశీ భావోద్వేగానికి గురైన తీరు ఇప్పుడు ప్రేక్షకుల్లో చర్చకు దారితీసింది. అతనికి సానుభూతి పెరిగి ఓట్లు ఎక్కువగా వస్తాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, అతని ప్రవర్తనను సింపతీ గేమ్‌గా చూడటం సరైనది కాకపోవచ్చు. నిజంగా ఓటమిని తట్టుకోలేకపోయాడా లేదా అన్నది అతనికే తెలుసు.
వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఈ ఘటనపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ తన వ్యూహాలతో ముందుకు సాగుతాడా? షాలినితో మళ్లీ కలుస్తాడా? వంశీ ఈ ఓటమి నుంచి కోలుకుని ఆటలో తిరిగి పుంజుకుంటాడా? అన్నది రాబోయే ఎపిసోడ్లలో చూడాలి.

Read More: Puneeth Rajkumar Death: పునీత్ రాజ్‌కుమార్ మరణానికి ముందు చివరి గంటన్నరలో ఏం జరిగింది?

Read More: Jailer 2 Review: ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ అయిందా..!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES