SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bigg Boss Telugu Wild Card Entry: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్..హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..లిస్ట్ వచ్చేసింది!

Bigg Boss Telugu Wild Card Entry 2026: బిగ్‌బాస్ రియాలిటీ షోలో ప్రతీసారి ఐదో వారం పూర్తయ్యే సమయానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో 14 మంది సభ్యులు కొనసాగుతుండగా, ఈ వారాంతంలో డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో హౌస్‌లోకి కొత్త ఊపు తెచ్చేందుకు గత సీజన్ల ఆటగాళ్లకు సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.

Written By Harish Darla
Published: Oct 07, 2026, 08:02 PM IST | Updated: Oct 07, 2026, 08:10 PM IST
Join

Bigg Boss Telugu Wild Card Entry 2026: బిగ్‌బాస్ రియాలిటీ షోలో ప్రతీ సీజన్‌లోనూ ఐదో వారం రాగానే వైల్డ్ కార్డ్ సభ్యులను హౌస్‌లోకి పంపించడం క్రమం తప్పకుండా జరుగుతోంది. ఈసారి కూడా అదే తరహాలో కొత్త కంటెస్టెంట్లను లోపలికి పంపించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం హౌస్‌లో 14 మంది సభ్యులు పోటీపడుతుండగా, ఈ వారం అమన్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, చరణ్, షాలిని, నరేశ్, రాంప్రసాద్, త్రిగుణ్, ముకేష్‌లతో పదిమంది నామినేషన్స్‌లో నిలిచారు. ఈ వీకెండ్‌లో ఊహించని విధంగా ఇద్దరు సభ్యులు ఒకేసారి ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఎలిమినేషన్ పూర్తయిన వెంటనే హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోయే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల పేర్లు బయటకు రానున్నాయి.

1) శివకుమార్..
అందులో మొదటి పేరు శివకుమార్.. బిగ్‌బాస్ ఏడో సీజన్ ఫినాలే వరకు వెళ్లిన సీరియల్ నటి ప్రియాంక ప్రియుడు శివకుమార్ ఈసారి వైల్డ్ కార్డ్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'నిన్ను కోరి' సీరియల్ నుంచి వైదొలగడంతో ఈ ఎంట్రీ ఖాయమైనట్లేనని భావిస్తున్నారు.

2) నీతు (నటరాజ్ మాస్టర్ భార్య)
బిగ్‌బాస్ 5, ఓటీటీ సీజన్లలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ భార్య నీతు పేరు కూడా 10వ సీజన్ వైల్డ్ కార్డ్ జాబితాలో ఖరారైంది.

3) నవరసాలు రామకృష్ణ.. 
అగ్నిపరీక్ష షోలో పాల్గొన్న శ్రీకాకుళం కుర్రాడు రామకృష్ణ గతంలో మిథిలేశ్, అపూర్వలతో కలిసి హౌస్‌లోకి వచ్చినప్పటికీ, టాస్క్‌లో మిథిలేశ్ చేతిలో ఓడిపోయి బయటకు వెళ్లాడు. ఇప్పుడు ఆయన మళ్లీ వైల్డ్ కార్డ్ ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇతర ప్రముఖులు: వీరితో పాటు 8వ సీజన్ విజేత నిఖిల్ మాజీ ప్రియురాలు కావ్యశ్రీ, జబర్దస్త్ ఫేమ్ నూకరాజు, రాకింగ్ రాకేశ్ పేర్లు కూడా వైల్డ్ కార్డ్ రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వైల్డ్ కార్డ్ సభ్యుల రాకతో హౌస్‌లో ఆట సమీకరణాలు ఏ విధంగా మారతాయో వేచి చూడాలి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES