Nana Patekar: బాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత..
Nana patekar passed away: గోవాలోని ఆయన నివాసంలో నానాపాటేకర్ గుండెపోటుతో కుప్పకూలీపోయారు. ఆయనను ఆస్పత్రికి తరలించి సీపీఆర్ చేసిన కూడా స్పందించలేదు.
Bollywood Actor Nana Patekar has Passed Away: బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు నానా పాటేకర్(75) కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలీపోయారు. దీంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ దాదాపు 45 నిముషాలు సీపీఆర్ చేశారు. అయిన కూడా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లి కన్నుమూశారు.
మరోవైపు నానా పాటేకర్ 1978లో 'గమన్' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. 'పరిందా', 'అబ్ తక్ ఛప్పన్', 'యశ్వంత్', 'వజూద్' వంటి మూవీస్ లలో నటించారు. ముఖ్యంగా 2000 తర్వాత 'శక్తి: ది పవర్', 'అపహరణ్', 'టాక్సీ నెం 9211' వంటి సినిమాల్లో నటించి విమర్శకుల మన్ననలు పొందారు.
'వెల్కమ్' (2007), 'వెల్కమ్ బ్యాక్' (2015) చిత్రాలలో ఆయన పోషించిన 'ఉదయ్ శెట్టి' పాత్ర ఇప్పటికి హైలెట్ గా నిలిచింది.'రాజ్‌నీతి' మూవీలో ఆయన నటనకు ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. అదే విధంగా మూడు జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు.
2016లో మరాఠీ చిత్రం 'నటసామ్రాట్'లో నటించారు. నటుడిగానే కాకుండా 'యశ్వంత్', 'వజూద్', 'ఆంచ్' వంటి చిత్రాల్లో నేపథ్య గాయకుడిగా పనిచేశారు.