• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /మహిళలకు బతుకమ్మ కానుకగా రూ.2500?.. వైరల్ వార్తలపై అసలు నిజం ఇదేనంటూ తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ!

మహిళలకు బతుకమ్మ కానుకగా రూ.2500?.. వైరల్ వార్తలపై అసలు నిజం ఇదేనంటూ తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ!

Maha Lakshmi Scheme: బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్రంలో మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయంతో పాటు కల్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 08, 2026, 09:30 AM IST|Updated: Oct 08, 2026, 09:32 AM IST
joinshare
మహిళలకు బతుకమ్మ కానుకగా రూ.2500?.. వైరల్ వార్తలపై అసలు నిజం ఇదేనంటూ  తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ!
Image Credit: Maha Lakshmi Scheme

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలుగు సినిమాలతో నానా పాటేకర్ అనుబంధం..

తెలుగు సినిమాలతో నానా పాటేకర్ అనుబంధం..

2

నవరాత్రుల వేళ ఈ 4 రాశుల జాతకంలో గజకేశరి యోగం.. డబ్బు, ఉద్యోగం, అదృష్టంలో భారీ మార్పులు!

3

అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటే చేటు తప్పదు.. ముగ్గురు స్నేహితులు - తేనె - తేలు నీతి కథ.!!

4

Nana Patekar Wife: ఐఐటీ ర్యాంకర్ నుంచి నటిగా.. నానా పటేకర్ భార్యతో హీరోయిన్ రష్మికకు ప్రత్యేక అనుబంధం..

5

ఇంజినీరింగ్ పూర్తి చేశారా? HAL నుండి బిగ్ నోటిఫికేషన్! రూ.1.2 లక్షల వరకు జీతం, అప్లై ప్రాసెస్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Maha Lakshmi Scheme: బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్రంలో మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయంతో పాటు కల్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే.. ఈ వీడియోపై తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్ (TG Fact Check) స్పందించి..దీనిని ఖండించింది. అది పూర్తిగా ఏఐ  ద్వారా క్రియేట్ చేసిన తప్పుడు  డీప్‌ఫేక్ వీడియో  అంటూ  స్పష్టం చేసింది.

బతుకమ్మ పండగ నుంచి మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయంతోపాటు కల్యాణలక్ష్మీ స్కీమ్ కింద 2 తులాల బంగారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో మార్ఫింగ్ చేసిందని తేల్చి చెప్పింది. ఈ వీడియోను నమ్మకూడదని.. సంక్షేమ పథకాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రభుత్వం విడుదల చేసే వేదికల నుంచే తెలుసుకోవాలంటూ సూచించింది.

అయితే ఫ్యాక్ట్ చెక్ వివరాల ప్రకారం.. వైరల్ వీడియోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ద్రుశ్యాలు నిజమే అయినప్పటికీ.. అందులోని ఆడియోను పూర్తిగా మార్చేశారు. 2025 ఏప్రిల్ లో రవీంద్రభారతిలో నిర్వహించిన 892వ బసవ జయంతి వేడుకలకు సంబంధించిన వీడియో ద్రుశ్యాలను తీసుకుని వాటిని ఏఐ ద్వారా రూపొందిచి డీప్ ఫేక్ ఆడియోను జత చేసినట్లు ఫ్యాక్ట్ చెక్ టీమ్ గుర్తించింది. దీంతో ముఖ్యమంత్రి రెండు కొత్త హామీలను ప్రకటించినట్లుగా వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారంచేసినట్లు ఫ్యాక్ట్ చెక్ బ్రుందం వెల్లడించింది. వైరల్ ఆడియోను ఏఐ డిటెక్షన్ పరికరాలతో పరిశీలిస్తే అది డీప్ ఫేక్ ఆడియోగా తేలిందని పేర్కొంది.

అయితే.. వైరల్ అవుతున్న ప్రచారంలోని రెండు విషయాలలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో భాగం. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న ఆరు హామీలలో మహాలక్ష్మి పథకం కింద పెద్ద కుటుంబాలు గల మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, రూ. 500 విలువైన ఎల్‌పిజి సిలిండర్, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, రూ. 500 విలువైన గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం గురించి ప్రస్తావించింది.

ఇది హామీలో భాగం కాదు.. కానీ ఈ పథకం కింద ఒక తులం బంగారం ఇస్తామని ప్రకటించారు. ఆరు హామీల అధికారిక జాబితాలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ మన్ను, యువ వికాసం, చేయూత ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఈ ఆరు హామీలకు అధికారికంగా అవే పేర్లను పెట్టింది. కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ అనేది తెలంగాణలో ఇప్పటికే అమల్లో ఉన్న పథకం. ప్రభుత్వ పత్రాల ప్రకారం, ఇది వివాహ సమయంలో అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకంపై హైకోర్టు ఇటీవల స్టే విధించింది.

అందువల్ల, వైరల్ వీడియోలో ప్రకటించిన రూ. 2500ను పూర్తిగా కొత్త హామీగా పరిగణించడం సరికాదు. ఎందుకంటే ఇది మహాలక్ష్మి  ఆరు హామీలలో ఒకటి. అయితే, ఇది బతుకమ్మతో ప్రారంభమవుతుందని, కళ్యాణ లక్ష్మి కింద రెండు తులాల బంగారం ఇస్తారని సీఎం ప్రకటించిన వీడియో ఒక డీప్‌ఫేక్. సంక్షేమ పథకాల అమలు, కొత్త ప్రకటనలు, అర్హతలు, తేదీలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా వీడియోలు, పోస్టుల ఆధారంగా కాకుండా, తెలంగాణ ప్రభుత్వ అధికారిక ప్రకటనల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని ఫ్యాక్ట్ చెక్ టీమ్  ప్రజలకు సూచించింది.

 

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ నుంచి మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం అందిస్తామని ప్రకటించినట్లు ప్రచారం అవుతున్న వీడియో మార్ఫింగ్ చేసిన వీడియో. వాస్తవాలు: ➤ ఈ వీడియోలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు 2025 ఏప్రిల్‌లో రవీంద్రభారతిలో జరిగిన 892వ బసవ జయంతి వేడుకలకు సంబంధించినవి. ➤ అసలు వీడియోకు ఉన్న ఆడియోను మార్చి, దాని స్థానంలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన డీప్‌ఫేక్ ఆడియోను జత చేశారు. దీని ద్వారా, ముఖ్యమంత్రి రెండు పథకాల అమలును ప్రకటించినట్లు కనిపించేలా చేశారు. ➤ ప్రచారంలో ఉన్న ఆడియోను ఏఐ డిటెక్షన్ పరికరాలు ద్వారా పరిశీలించగా, అది డీప్ ఫేక్ ఆడియో అని తేలింది. ➤ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన విషయాల కోసం, కేవలం అధికారిక ప్రభుత్వ మాధ్యమాల ద్వారా విడుదలైన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. ➤ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో ఉన్న ఏఐ వీడియోలు, ఆడియోలు, సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని పౌరులకు విజ్ఞప్తి. — తెలంగాణ ప్రభుత్వం

— FactCheck_Telangana (@FactCheck_TG) October 7, 2026

 

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes
Telangana News
Telugu News