SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పండక్కి ‘కాకా’వెనక్కి తగ్గేదే లే.. మెగాధీమా అదేనా..!!

Kaakaa Release Date: 2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్ సినిమా ఉంటుందా? లేదా? విడుదల తేదీ విషయంలో వెనక్కి తగ్గుతుందా అనే వార్తలు వచ్చాయి. ఇపుడా ప్రచారానికి ఇప్పుడు గట్టిగా చెక్ పడింది. రూమర్లు ఎన్ని వచ్చినా.. రిలీజ్ డేట్ మాత్రం మారదని 'కాకా' టీమ్ నుంచి క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు.. ఈ సినిమాపై వస్తున్న ఫేక్ న్యూస్‌కు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ తనదైన స్టైల్‌లో గట్టి కౌంటర్ ఇచ్చారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 07, 2026, 02:48 PM IST | Updated: Nov 07, 2026, 02:52 PM IST
Image Credit: Kaakaa Release Date (Source/ZEE News Telugu)
Join

Kaakaa: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'కాకా'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ అనగానే మెగా అభిమానుల్లో సహజంగానే ఆసక్తి పెరుగుతోంది. గతంలో చిరంజీవిని ‘వాల్లేరు వీరయ్య’లో మాస్ యాంగిల్‌లో చూపిస్తూనే నవ్వించే ప్రయత్నం చేసి సక్సెస్‌ను అందుకున్నాడు బాబీ. ఇపుడు మరోసారి మెగాస్టార్‌ను ఏ రేంజ్‌లో చూపించబోతున్నారనే చర్చ కూడా అభిమానుల్లో నడుస్తోంది. అయితే చిరంజీవి రీ ఎంట్రీలో చిరంజీవి రిపీట్ చేసిన ఏకైక దర్శకుడు బాబీనే కావడం గమనార్హం. ఖైదీ నంబర్ 150 నుంచి మన శంకర వర ప్రసాద్, విశ్వంభర వరకు ఏ డైరెక్టర్‌తో రెండో సారి పనిచేయలేదు చిరు.  వినాయక్ గతంలో ఠాగూర్ చేసినా.. రీ ఎంట్రీలో మాత్రం ఏ దర్శకుడిని రిపీట్ చేసిన దాఖలాలు లేవు. రీ ఎంట్రీలో చిరంజీవి కేవలం ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య, మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాలు మాత్రమే సంక్రాంతి బరిలో నిలిచి హిట్ అందుకున్నాయి. మిగతా సినిమాలు చిరును నిరాశ పరిచాయి. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా బాగానే ఉన్నా.. అందరిన సంతృప్తి పరచలేకపోయింది.

తాజాగా ‘కాకా’  సినిమా చుట్టూ గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి విడుదల విషయంలో సినిమా వెనక్కి తగ్గబోతోందంటూ ప్రచారం జరిగింది. మొదటగా జనవరి 13న రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్నప్పటికీ.. చిరంజీవి విశ్వంభర కోసం 'కాకా' వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

దీంతో ఒకే సమయంలో మెగాస్టార్ సినిమాల మధ్య పోటీ ఉంటుందా? ఒక సినిమా కోసం మరో సినిమా విడుదల తేదీని మార్చుకుంటుందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మెగా అభిమానులు కూడా అసలు ఏ సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంపై క్లారిటీ కోసం ఎదురుచూశారు.
ఇలాంటి సమయంలోనే కోన వెంకట్ ఎంట్రీ ఇచ్చారు. సినిమా రిలీజ్ డేట్‌పై వస్తున్న వార్తలకు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. రూమర్లకు, ఫేక్ న్యూస్‌కు రెస్ట్ ఇన్ పీస్ అంటూ గట్టిగానే సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. తమ సినిమా చెప్పిన తేదీకే ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు.

కాకా లాండ్.. 

మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు సారీ.. సంక్రాంతికి 'కాకా' జనవరి 13నే ల్యాండ్ అవుతున్నాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఇన్నాళ్లూ సినిమా వాయిదా పడుతుందంటూ జరిగిన ప్రచారానికి కోన వెంకట్ ట్వీట్‌తో చెక్ పడినట్టయింది.

ఇక కోన వెంకట్ ట్వీట్‌లోని మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సంక్రాంతికి కాకా వస్తున్నాడు.. అసలైన పండగ తెస్తున్నాడు అనే ధీమా కనిపిస్తోంది. అంటే సినిమా విడుదల విషయంలో చిత్రబృందం ఎంత నమ్మకంగా ఉందో ఆయన మాటల్లోనే అర్థమవుతోంది.

మరోవైపు సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద బాక్సాఫీస్ సీజన్. పండగ సెలవులు, ఫ్యామిలీ ఆడియన్స్, అభిమానుల సందడి.. ఇలా థియేటర్ల దగ్గర వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అలాంటి సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

స్క్రీన్ ప్రెజెన్స్.. 

ఇక బాబీ దర్శకత్వం, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే అభిమానులకు కావాల్సిన మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 13 రిలీజ్ డేట్‌పై కోన వెంకట్ ఇచ్చిన క్లారిటీ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

అయితే ఇప్పుడు అందరి దృష్టి సినిమా ప్రమోషన్లపై, టీజర్, ట్రైలర్ అప్‌డేట్స్‌పై పడింది. విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చిన నేపథ్యంలో చిత్రబృందం నుంచి వచ్చే తదుపరి ప్రకటనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి 'కాకా' సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుందంటూ వచ్చిన వార్తలకు కోన వెంకట్ తన ట్వీట్‌తో ఫుల్‌స్టాప్ పెట్టారు. రూమర్లు ఎన్ని వచ్చినా తగ్గేదేలే అన్నట్టుగా జనవరి 13నే థియేటర్లలోకి వస్తామని స్పష్టం చేశారు. మరి ఈ సంక్రాంతికి మెగాస్టార్ తన మాస్ పవర్‌తో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి!

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES