SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చిరంజీవి నయా ఇన్నింగ్స్.. డిజిటల్ ఎంట్రీకి అంతా రెడీ..

Chiranjeevi Digital Entry: మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా తన నటనతో, స్టైల్‌తో, మాస్ ఇమేజ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి. ఇప్పటికే స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా మెగాస్టార్.. త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలుబడనుంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 01, 2026, 05:59 AM IST | Updated: Oct 01, 2026, 06:00 AM IST
Image Credit: Chiranjeevi New Innings (ZEE News Telugu/Source)
Join

Megastar New Innings: చిరంజీవి  హీరోగా ఎన్నో రికార్డులను తిరగరాసారు చిరంజీవి.  గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ఓ సిరీస్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. తాజాగా ఇపుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  ఇప్పటికే  బాలయ్య.. అన్‌స్టాపబుల్ షోతో ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్లింది. ఇక బిగ్‌బాస్‌తో నాగార్జున.. ‘రానా నాయుడు’ సిరీస్‌తో వెంకటేష్ ఇలా డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. తాజాగా చిరంజీవి ఇపుడు బిగ్ స్క్రీన్‌ నుంచి స్మాల్ స్క్రీన్‌కు.. ఇపుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ ప్రత్యేక సెలబ్రిటీ టాక్ షోకు మెగాస్టార్ హోస్ట్‌గా కనిపించబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

చిరంజీవి ఒక టాక్ షోను హోస్ట్‌గా..

మెగాస్టార్ హోస్ట్‌గా అతిథులతో ఆయన సంభాషణ ఎలా సాగుతుంది. సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలు, కెరీర్ అనుభవాలు, ఆసక్తికరమైన జ్ఞాపకాలు బయటకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి ప్రశ్నలు ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇప్పటి వరకు వెండితెరపై హీరోగా ప్రేక్షకులను అలరించిన చిరంజీవి… ఈసారి హోస్ట్‌గా తనలోని మరో కోణాన్ని చూపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలతో చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం, ఆయన మాట్లాడే తీరు, సరదాగా విషయాలను పంచుకునే విధానం ఈ షోకు స్పెషట్ అట్రాక్షన్‌గా నిలిచే అవకాశాలున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిరంజీవికి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ వచ్చినట్లు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. అదే విధంగా షో ఫార్మాట్ ఏంటి? ఎలాంటి సెలబ్రిటీలు ఇందులో పాల్గొంటారు? ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి? ఫస్ట్ సీజన్ లో చిరంజీవి సక్సెస్ అయితే.. మరికొన్ని సీజన్స్ ఉండనున్నాయి. ఇక బాలయ్య.. అన్‌స్టాపబుల్‌తో నాలుగు సీజన్స్ చేసి అదరగొట్టేసారు. మన దేశంలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీ షోగా రికార్డులకు ఎక్కింది. ఈ షోలో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ మినహా అందరు టాప్ హీరోలు ఈ టాక్‌ షోలో పాల్గొన్నారు.

చిరంజీవి పై బాలయ్య ఇంపాక్ట్..

ఇప్పటికే బాలయ్య.. హోస్ట్‌గా ఓ ముద్రవేశారు. దాన్ని చిరంజీవి అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఈ వార్తలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో… చిరంజీవి లాంటి స్టార్ ఒక డిజిటల్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఆయన కెరీర్‌లో ఒక కొత్త ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.

ఇక సినిమాల విషయానికి వస్తే… మెగాస్టార్ చేతిలో ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ స్థాయి ట్రీట్‌మెంట్ ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్.. కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు దర్శకుడు వశిష్ఠతో చిరంజీవి చేసిన ‘విశ్వంభర’ కూడా కీలకమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చిరంజీవి తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.ఈ సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

భారీ విజువల్స్, ఫాంటసీ అంశాలు, విభిన్నమైన కథా ప్రపంచంతో రూపొందుతున్న ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కూడా పూర్తయినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇక విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది.

ఓటీటీ.. 

అంటే… ఒకవైపు వెండితెరపై వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి, మరోవైపు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.సినిమా హీరోగా ఎన్నో తరాలకు కనెక్ట్ అయిన మెగాస్టార్… ఇప్పుడు హోస్ట్‌గా ప్రేక్షకులతో ఎంత దగ్గరగా మాట్లాడబోతున్నారనేది చూడాలి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES