• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /చిరు లీక్స్‌పై తగ్గిన క్రేజ్..! మెగా ఫ్యాన్స్‌ నారాజ్..?

చిరు లీక్స్‌పై తగ్గిన క్రేజ్..! మెగా ఫ్యాన్స్‌ నారాజ్..?

Chiru leaks: మెగాస్టార్ చిరంజీవి ఇది పేరు కాదు ఇట్నే బ్రాండ్ అన్నట్టుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన కంటూ కొన్ని పేజీలు రాసుకున్నాడు. మొత్తంగా చిరు పేరు వినిపిస్తే చాలు.. అభిమానుల్లో ఉరకలేసే ఉత్సాహాం. ఆయన స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడినా, తనదైన కామెడీ టైమింగ్‌తో పంచులు వేసినా.. ఆ సందడే వేరు. తాజాగా ఈయన తన సినిమాల గురించే ఇచ్చే చిరు లీక్స్ పై ప్రస్తుతం కామన్ ఆడియన్స్‌తో పాటు అభిమానుల్లో క్రేజ్ తగ్గినట్టు తాజాగా కొన్ని పరిణామాలు గమనిస్తే తెలుస్తుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 19, 2026, 12:13 IST|Updated: Nov 19, 2026, 12:17 IST
joinshare
చిరు లీక్స్‌పై తగ్గిన క్రేజ్..!  మెగా ఫ్యాన్స్‌ నారాజ్..?
Image Credit: Chiranjeevi Leaks (Source/ZEE News)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mega Leaks: అవును.. గత కొంతకాలంగా చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను  సినిమా ఈవెంట్లలో స్వయంగా బయటపెడుతున్నారు. అభిమానులు కూడా వీటిని చిరు లీక్స్ పేరుతో పిలుచుకుంటున్నారు.మొదట్లో ఈ లీక్స్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి.  సినిమా టైటిల్ కావచ్చు, కథకు సంబంధించిన చిన్న క్లూ కావచ్చు.. చిరంజీవి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది.

గతంలో 'ఆచార్య' సినిమా టైటిల్‌ను చిరంజీవి బయటపెట్టిన సందర్భం కూడా అభిమానుల్లో క్యూరియోసిటీని  పెంచింది.కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారుతోందా? అనే చర్చ నడుస్తోంది.తాజాగా 'ఇట్లు అర్జున' సక్సెస్ మీట్‌లో కూడా చిరంజీవి మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. తన రాబోయే సినిమా 'కాకా'లో అనస్వర రాజన్ మూగమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పారు. 
అంతేకాదు.. ఈ సినిమా విడుదలకు సంబంధించి మరో కీలకమైన అప్‌డేట్ కూడా ఇచ్చారు. సినిమా మరో 45 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పడంతో సంక్రాంతి విడుదలపై అపుడే జోరుగా చర్చ మొదలైంది.

అయితే ఇక్కడే అసలు పాయింట్ మొదలైంది!

ఈ విషయాలు ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతవరకు ప్రచారంలో ఉండటంతో, చిరంజీవి స్వయంగా చెప్పినప్పుడు అభిమానులకు కొత్తగా అనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొదట్లో చిరు లీక్స్ అంటే ఒక సర్‌ప్రైజ్ ఉండేది. కానీ ఇప్పుడు అవే లీక్స్ రొటీన్‌గా మారిపోతున్నాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

నిజానికి చిరంజీవి లాంటి స్టార్ హీరో ఏదైనా విషయం చెబితే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాంటిది ఆయన చేసే ప్రతి లీక్‌లోనూ ఏదో ఒక కొత్తదనం ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక మరో ఆసక్తికరమైన విషయం 'విశ్వంభర'...

చాలాకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సినిమా గురించి చిరంజీవి నుంచి ఏదైనా అప్‌డేట్ వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ  తాజా ఈవెంట్‌లో ఆ సినిమా ప్రస్తావనే  రాలేదు.దీంతో విశ్వంభర అప్‌డేట్ ఎప్పుడు వస్తుంది? సినిమా విడుదలపై ఎప్పుడు స్పష్టత వస్తుంది? అనే ప్రశ్నలు మళ్లీ మొదలయ్యాయి.

అయితే చిరంజీవి తాజా లీక్స్‌ను పూర్తిగా విమర్శించలేం. ఎందుకంటే అభిమానులతో ఆయనకు ఉన్న అనుబంధంలో ఈ సరదా సంభాషణలు కూడా ఒక భాగమే.కానీ ప్రతిసారీ సర్‌ప్రైజ్ ఇవ్వాలంటే కొత్తదనం ఉండాలి కదా. అది ప్రతి సారి ఉండటం లేదు. మరి ఇకపై చిరు లీక్స్‌లో కొత్త ట్విస్టులు ఉంటాయా? లేక అభిమానులకు ముందే తెలిసిన విషయాలే మళ్లీ వినిపిస్తాయా?

ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ నుంచి ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే.. చిరు లీక్స్ కంటే విశ్వంభర రిలీజ్ డేట్ చెప్పండి సార్ అంటూ సోషల్ మీడియా వేదిక గా అభిమానులు హంగామా చేస్తున్నారు. ఇక విశ్వంభర సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీతో చేసుకున్న డీల్ ప్రకారం ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో జనవరి 13 లోపు రిలీజ్ చేయాలనేది అగ్రిమెంట్ సారాంశం. ఈ నేపథ్యంలో విశ్వంభర సినిమాను జనవరి 13 లోపు ఎపుడు విడుదల చేస్తారు. కాకా సినిమాతో పోటీగా సంక్రాంతి బరిలో దిగుతుందా.. ? లేకపోతే డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ.. జనవరి ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేస్తారా.. ? ఈ సినిమా విడుదల సందర్భంగా ‘కాకా’ సినిమా పోస్ట్ పోన్ చేస్తారా ? మొత్తంగా మరికొన్ని ఈ రోజుల్లో విశ్వంభర సినిమాపై ఉన్న సస్సెన్స్ తొలిగిపోయే రోజు ఎపుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie