Sekhar Master: కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు..
Sekhar master car accident: పండ్ల లోడ్ తో వెళ్తున్న లారీ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో కారు బోల్తాపడింది. ఈ ఘటనతో శంషాబాద్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.మరోవైపు ఈ ఘటనపై అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Sekhar master narrowly escaped from car accident at shamshabad: టాలీవుడ్ కు చెందిన ప్రముఖ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదంకు గురైంది. శంషాబాద్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవంబరు 11న రాత్రి శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును పండ్లలోడ్ తో వెళ్తున్న లారీ బలంగా వచ్చి ఢీకొనడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్ స్వల్పంగా గాయపడ్డారు.
కారు ప్రమాదంకు గురికాగానే చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి శేఖర్ మాస్టర్ ను బైటకు తీశారు. దీంతో ఆమార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శేఖర్ మాస్టర్ కు స్వల్పంగా గాయాలు అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ సినిమా పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు బోల్తా పడటంతో అద్దాలు పగిలి ధ్వంసమైంది. కారు ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు ప్రమాద విషయం తెలియగానే కాకా మూవీ టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శేఖర్ మాస్టర్ అభిమానులు ఈ ఘటనతో షాక్ కు గురయ్యారు. అంతే కాకుండా ఈ ప్రమాద ఘటన నుంచి తమ మాస్టర్ తొందరగా కొలుకొవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.