Airtel Rs 399 Recharge Plan: మీరు ఎయిర్‌టెల్ యూజర్స్ అయితే, మీకు ఇంటర్నెట్ డేటాతో సమస్య అయితే వెంటనే ఈ రూ.399 ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకోండి. ఇందులో 1+1 రీఛార్జీ ఆఫర్‌తోపాటు ఎడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం కూడా ఉచితంగా పొందుతారు. ఒక వేళ మీకు 4జీ, 5జీ అందుబాటులో ఉన్న అపరిమిత డేటా, కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు. దీంతో పాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం. ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులపాటు వర్తిస్తుంది. ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే ఎస్టీడీ కాలింగ్, అపరిమిత లోకల్ వాయిస్ కాలింగ్ కూడా ఏ నెట్‌వర్క్ అయినా అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ వంద ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. 5జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న యూజర్స్ 5జీ డేటా పొందుతారు.
1+1 రీఛార్జీ ఉచిత ఆఫర్..
ఎయిర్‌టెల్ 1+1 రీఛార్జీ ఉచిత ఆఫర్ కూడా దీనికి వర్తిస్తుంది. అంటే రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే అదనంగా మరోనెల ఉచితంగా పొందుతారు. ఇది యూజర్స్‌కు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే లభిస్తుంది. అదనంగా మరో 28 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్యాక్ ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో అందుబాటులో ఉంది.
ఎడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం..
ఈ ప్లాన్‌లో మీరు 12 నెలలపాటు ఎడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం యాక్సెస్ కూడా పొందుతారు. దీని విలువ రూ.4000 ఉంటుంది. దీంతో మీకు కావాల్సిన సోషల్ మీడియా పోస్టులు క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ థంబనైల్, బ్యానర్స్, పోస్టర్స్ ఇతర క్రియటివ్ డిజైన్స్ ఈ ఎడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ప్యాక్ ద్వారా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ ఉచిత హలో ట్యూన్స్..
ఎయిర్‌టెల్ ప్లాన్‌లో మీరు ఎయిర్‌టెల్ సేఫ్ ఫీచర్ కూడా పొందుతారు. ఇది డిజిటల్ సెక్యూరిటీ ప్లాన్ అని కూడా చెప్పొచ్చు. ఎయిర్‌టెల్ యూజర్స్ ఇందులో రియల్ టైమ్ స్పామ్ కాల్ అలెర్ట్స్, ప్రాడ్ బ్లాక, ఓటీపీ బ్యాంకింగ్ ఫ్రాడ్ అలెర్ట్ కూడా పొందుతారు. ఇందులో ఉచిత హలో ట్యూన్ కూడా పొందుతారు. నెలరోజులపాటు ఇది ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.