• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP Local body Elections: ఏపీలో మరోసారి మోగిన ఎన్నికల నగారా.. 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ..

AP Local body Elections: ఏపీలో మరోసారి మోగిన ఎన్నికల నగారా.. 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ..

Sec released 23 local body election notification: శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి తాడేపల్లి, కార్పొరేషన్లతో పాటు 19 మున్సి పాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ ను ఎస్ఈసీ ప్రకటించింది. అంతే కాకుండా.. అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలో ఎన్నికలకు 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ప్రకటించింది.

Written ByInamdar Paresh
Published: Nov 12, 2026, 01:52 PM IST|Updated: Nov 12, 2026, 02:06 PM IST
joinshare
AP Local body Elections: ఏపీలో మరోసారి మోగిన ఎన్నికల నగారా.. 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ..
Image Credit: Ap sec Anil Chandra Punetha (file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
చెన్నై స్టైల్ సాంబార్ ఇడ్లీని ఇంట్లో తయారు చేసుకోవాలని ఉందా..? అయితే ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోండి..!!

చెన్నై స్టైల్ సాంబార్ ఇడ్లీని ఇంట్లో తయారు చేసుకోవాలని ఉందా..? అయితే ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోండి..!!

2

Shigella Outbreak: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్.. కేరళంలో ప్రాణాంతక బ్యాక్టీరియా కలకలం..

3

రేపు బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్తున్నారా? ఈ శుక్రవారం సెలవు ఎందుకో తెలుసా? కస్టమర్లు ఇవి గమనించండి!

4

Video Viral: పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో.. నాభిలో టపాసుపెట్టి వెలిగించుకున్న మహిళ.. వీడియో వైరల్..

5

ఎయిర్‌టెల్ రూ.399 రీఛార్జ్‌పై 1+1 ఫ్రీ ఆఫర్.. ఏకంగా 56 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ డేటా!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sec released local body election notification in andhra pradesh: ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే గత కొన్ని నెలలుగా స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలపై అన్ని ప్రధాన పార్టీల మధ్య నాన్ స్టాప్ రచ్చ కొనసాగుతుంది. ఇది చల్లారక ముందే  తాజాగా.. ఆంధ్ర ప్రదేశ్ లో పెండింగ్ లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈక్రమంలో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేత ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే మొదటి దశలో 100 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించామని ఎస్ఈసీ తెలిపారు. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న  23 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలు జరుగుతాయని ఎస్ఈసీ ప్రకటించింది. 

దీనిలో భాగంగా.. శ్రీకాకుళం,కాకినాడ, రాజమండ్రి,మంగళగిరి తాడేపల్లి,కార్పొరేషన్లతో పాటు 19 మున్సి పాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలో ఎన్నికలకు నవంబరు 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. నవంబర్ 17వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. ఆతర్వాత నవంబర్ 19 వ తేదీన నామినేషన్ల విత్ డ్రా, 26వ తేదీన పోలింగ్, 30 వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎస్ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఏపీలో గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఎస్ఈసీ పేర్కొంది.

పంచాయతీ ఎన్నికలకు రేపు మొదట దశ నోటిఫికేషన్ ఇస్తామని, మొదట దశలో పంచాయతీ ఎన్నికలకు 26వ తేదీన పోలింగ్ అదే రోజున ఫలితాలు వెలువడుతాయి. రెండో దశ పంచాయతీ ఎన్నికలకు 29 వ తేదీన పోలింగ్ అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. మూడో దశ పంచాయతీ ఎన్నికలకు డిసెంబర్ 2వ తేదీన  పోలింగ్  అదే రోజు ఫలితాలు ప్రకటన ఉంటుందని ఎస్ఈసీ తెలిపింది.

సుప్రీం కోర్టు ఆదేశాలతో నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలో ఈ రోజు నుంచే  ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని, అభ్యర్ధులు నామినేషన్లు స్వేచ్ఛగా దాఖలు చేసే బాధ్యత పూర్తిగా జిల్లా యంత్రాంగానిదేనని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేత స్పష్టం చేశారు.. ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ సెంటర్ల వరకు, భద్రత కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశామనివెల్లడించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగే చోట ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగేలా చూస్తామని ఎస్ఈసీ పేర్కొన్నారు. SIR ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని అను కున్నామని,తప్పని సరి పరిస్థితుల్లో ముందే ఎన్నికలు నిర్వహించామన్నారు. MPTC, ZPTC ఎన్నిక కోసం SEC నుంచి 100 శాతం ఏర్పాట్లు చేశామన్నారు. పొలిటికల్ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల వరకు పూర్తి సహకారం ఉందన్నారు. సున్నిత ప్రాంతాల్లో అభ్యర్థుల నామినేషన్లను పోలీసుల భద్రత నడుమ దాఖలు చేయిస్తామన్నారు.

ఎన్నికల్లో చెలరేగిన హింసపై  SEC కీలక వివరణ ఇచ్చింది. పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఎస్పీలతో 14వ తేదీన సమావేశం నిర్వహిస్తామన్న ఎస్ఈసీ తెలిపింది. విశాఖలో ఓట్ల పెరుగుదల వివాదంపై ఎస్  ఈసీ క్లారిటీ ఇచ్చింది. పోలింగ్ స్టేషన వారిగా ఓటింగ్ వివరాలు వెల్లడించడం జరిగిందన్నారు. వ్యాలిడ్ ఓటింగ్ అంత చెక్ చేసి ఫైనల్ ఓటింగ్ ఇచ్చామన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగిందనిఎస్ఈసీ తెలిపింది. మరోవైపు ఎన్నికల నగారా మోరగడంతో మరోసారి ఏపీ రాజకీయాల్లో ఏవిధమైన  పరిణామాలు చోటుచేసుకుంటాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
Elections
Telugu News