om clash with Aakasamlo Oka Tara Box Office War: దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. అశ్వనీదత్, అల్లు అరవింద్, గుణ్ణం గంగరాజు నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ఒక అమ్మాయి అస్ట్రోనాట్ కావాలనుకునే కల, ఆ డ్రీమ్‌ను నిజం చేసుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాలు ఈ కథలో మెయిన్ అట్రాక్షన్స్. దుల్కర్ సల్మాన్ మలయాళ నటుడైన ఇప్పటికే కన్నడ తప్పించి తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించి ప్యాన్ ఇండియా నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.
దుల్కర్ తెలుగు సినిమాలు..
తెలుగులో దుల్కర్ డైరెక్ట్ హీరోగా కాకుండా కెమియోలతో కలిపి ‘ఆకాశంలో ఒక తార’ ఆరో చిత్రం. గతంలో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాల్లో హీరోగా నటించారు. కల్కి 2898 AD, ఛాంపియన్ సినిమాల్లో కెమియో రోల్లో నటించారు. హీరోగా తెలుగులో నాలుగో చిత్రం.
సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిజం, యాక్షన్, ప్రేమకథలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఒక అమ్మాయి కలను, ఆమె లక్ష్యాన్ని, ఆ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను తెరపై చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆకాశంలో ఒక తార’గా ఓ వెలుగు వెలగానే అమ్మాయి కలను నెరవేర్చే మగాడి పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించబోతున్నాడు. ఇలాంటి కథలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయా? ముఖ్యంగా యూత్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.మొత్తంగా మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
ధనుశ్ విషయానికొస్తే..
ధనుష్ అంటేనే తన నటనతో పాత్రలో పూర్తిగా ఒదిగిపోయే నటుడు అనే గుర్తింపు ఉంది. రఘువరన్ బీటెక్ నుంచి అసురన్ వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాదు రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నాడు. ఇంతకంటే ధనుశ్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు.
తాజాగా ‘OM’ సినిమాతో మరోసారి తన నటనలోని వైవిధ్యాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నారు ధనుశ్ మరియు మమ్ముట్టి. ఓం అంటే (Operation Mole). అయితే ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఒకటి కలలు, లక్ష్యాలు, ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ అయితే.. మరొకటి ధనుష్ నటనతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర కేవలం ఇద్దరు హీరోల మధ్య పోటీ మాత్రమే కాదు.. రెండు విభిన్నమైన కథల మధ్య కూడా పోటీ జరగబోతోంది. ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఓ రకంగా కొడుకు దుల్కర్ సినిమాతో మమ్ముట్టి పోటీ పడబోతున్నాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న చిత్రాలు..
మొత్తంగా ఈ రెండు సినిమాల్లో వేటికవే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ బజ్ తెచ్చుకున్న సినిమా ఏది? ఓపెనింగ్స్ విషయంలో ఎవరు ముందుంటారు? ప్రేక్షకులు ఏ సినిమాకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేవలం హీరోల క్రేజ్‌తోనే సినిమాలు విజయం సాధించే రోజులు కావు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా కూడా పెద్ద విజయాన్ని అందుకుంటోంది. అందుకే ఈ రెండు సినిమాల విషయంలోనూ ప్రేక్షకుల తీర్పు చాలా కీలకం అని చెప్పాలి.అందులో మలయాళీ హీరో నటించిన డైరెక్ట్ తెలుగు సినిమా. మరొకటి తమిళ, మలయాల నటులు నటించిన తమిళ డబ్బింగ్ తెలుగు మూవీ కావడం విశేషం.