• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /ENE Repeat Review: ఈ నగరానికి ఏమైంది ? రిపీట్ రివ్యూ.. తరుణ్ భాస్కర్ కామెడీ డ్రామా ఎలా ఉందంటే..!!

ENE Repeat Review: ఈ నగరానికి ఏమైంది ? రిపీట్ రివ్యూ.. తరుణ్ భాస్కర్ కామెడీ డ్రామా ఎలా ఉందంటే..!!

ENE Repeat Review: 2018లో తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. దాదాపు ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మూవీకి సీక్వెల్‌గా ‘ఈ నగరానికి ఏమైంది ? రిపీట్’ గా షార్ట్ కట్‌లో ఈఎన్ఈ రిపీట్‌గా(ENE Repeat) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ గురువారం విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్స్ ఒక రోజు ముందుగానే ప్రదర్శించారు. మరి ఈ సినిమా మొదటి భాగాన్ని మించి హిట్ అయిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 19, 2026, 11:07 IST|Updated: Nov 19, 2026, 11:11 IST
joinshare
ENE Repeat Review: ఈ నగరానికి ఏమైంది ? రిపీట్ రివ్యూ.. తరుణ్ భాస్కర్ కామెడీ డ్రామా ఎలా ఉందంటే..!!
Image Credit: ENE Repeat (Source/X)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ENE Repeat Movie Public Talk: తరుణ్ భాస్కర్ దర్శకత్వం.. విశ్వక్ సేన్, అభినయ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, మాగంటి శ్రీనాథ్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన ఈఎన్ఈ’ రిపీట్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుందో చూద్దాం..

కథ విషయానికొస్తే.. 
నలుగురు స్నేహితులు వివేక్ (విశ్వక్ సేన్), కౌశిక్ (అభినవ్), కార్తీక్ (శ్రీనాథ్), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను) చిన్పప్పటి నుంచి దోస్తులు. ఈ నేపథ్యంలో వివేక్ నిర్మాతగా ఓ సినిమా చేసి తీవ్రంగా నష్టపోతాడు. దీంతో ఎవరికి వారు తమ జీవితాలను లీడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో అప్పులు తీర్చడానికి వివేక్ తను ఓ వెడ్డింగ్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. మరోవైపు కౌశిక్ యాక్టర్‌గా స్థిరపడిపోతాడు. ఉపేంద్ర ఎడిటర్‌గా.. కార్తీక్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తుంటారు. మరోవైపు కార్తీక్  ఉపేంద్ర కజిన్ సిస్టర్ కీర్తన (శివాత్మిక రాజశేఖర్ )ప్రేమలో పడతాడు. మరోవైపు డాక్టర్ గా ప్రాక్టీస్ చస్తోన్న కీర్తనకు వాళ్ల తండ్రి మరో డాక్టర్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఎంగేజ్మెంట్ కూడా జరగుతుంది. ఈ క్రమంలో కార్తీక్.. నిశ్చితార్ధం అయిన కీర్తనను తన లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. కార్తీక్, కీర్తన మ్యారేజ్ కోసం వివేక్, కౌశిక్, ఉపేంద్రలు ఏం చేశారనేదే ఈ సినిమా స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని స్నేహం అనే బంధం చుట్టు తిప్పాడు. మంచి ఫ్రెండ్.. తన స్నేహితుల కోసం ఏం చేయడానికైనా వెనకాడరనే విషయాన్ని చూపెట్టే ప్రయత్నం చేశాడు. మాములు సాదాసీదా స్టోరీని స్నేహితుల మధ్య సరదాగా సాగే  సంభాషణలు, జోక్స్‌ ప్రస్తుత యువత ఎలా బిహేవ్ ఎలా ఉందనే విషయాన్ని ప్రస్తావించాడు. ఈ నగరానికి ఏమైంది రిపీట్‌లో సినిమా నిర్మాతల కష్టాలను కూడా ప్రస్తావించాడు. ముఖ్యంగా ఓ సినిమా రిలీజ్ తర్వాత వచ్చే రివ్యూల గురించి నిర్మాతలు, హీరోలు ఎలా టెన్షన్ పడతారన్న విషయాన్ని చూపెట్టాడు. గతంలో ‘నేనింతే’ చిత్రంలో పూరీ జగన్నాథ్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాడు. కానీ ఇందులో కాస్త సెటైరికల్‌గా చూపెట్టే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఓ సినిమా సరిగా నడవకపోతే దాన్ని నిర్మించిన నిర్మాతలు ఎలా అథ: పాతాళానికి పడిపోతారనే విషయాన్ని చూపెట్టే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. అదే సమయంలో మంచి రివ్యూల కారణంగా చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు కోకొల్లలు.

మొత్తంగా ఇంటర్వెల్ వరకు సరద సరదగా ప్రస్తుతం హైదరాబాద్ యూత్ మాట్లాడుకునే భాషలో డైలాగులు అలరిస్తాయి. వారి ప్రవర్తన ఇప్పటి యూత్ ఐడెంటిఫై అవుతారు. ముగ్గరు ఫ్రెండ్స్  కార్తీక్, కీర్తన పెళ్లి కోసం ఓ నాలుగైదు రోజుల్లో విదేశాల్లో సినిమా షూట్ చేస్తానని చెప్పి హీరోయిన్ తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు వివేక్. ఈ క్రమంలో తన ఫ్రెండ్ కౌశిక్ ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయడం.. థాయిలాండ్‌లో సినిమా తీస్తే అక్కడి ప్రభుత్వం టూరిజం ప్రోత్సహించే క్రమంలో సబ్సిడి ఇస్తుందునే ఉద్దేశ్యంలో వివేక్ ఈ ప్లాన్  చేస్తాడు. ఈ క్రమంలో పండే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా ఎలుగు బంటి సీన్‌లో కౌశిక్ పాత్రలో అభినవ్ గోమఠం నటన బాగుంది. ఈ సినిమాలో బాగా పేలింది.

మరోవైపు హీరోయిన్ తండ్రి .. తన కూతురు పెళ్లి కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాడు. కానీ అది క్యాన్సిల్ అవుతుంది. అయినా.. కుటుంబ సభ్యులందరు కలిసి ఎందుకు థాయిలాండ్ వెళ్లారనేది దర్శకుడికే తెలియాలి. పెళ్లే లేనపుడు హీరో థాయిలాండ్ వెళ్లి సినిమా తీస్తాననడం వాటికి హీరోయిన్ ఓకే చెప్పడం వంటి సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. లాజిక్ లేని సీన్స్ కొన్ని పంటికింద రాయిలా అడ్డుపడతాయి. మొత్తంగా లాజిక్ కు అందని సీన్స్ ఎన్నో ఉన్నా.. ఇందులో నటీనటుల కామెడీతో కొట్టుకుపోతాయి.  సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
ఓవరాల్‌గా కామెడీతో నడిచే ఫన్ రైడ్‌గా సరదాగా సాగిపోతుంది.

నటీనటుల విషయానికొస్తే..

విశ్వక్ సేన్ మరోసారి తన యాటిట్యూడ్‌ నటనతో మెప్పించాడు. మరోసారి తన మార్క్ నటన చూపించాడు. అభినవ్ గోమఠం తన కామెడీ టైమింగ్ తో మరోసారి మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా విజయంలో కీ రోల్ పోషించాడు.  శ్రీనాథ్ పర్వాలేదు. వెంకటేష్ కాకుమాను తన దైన యాక్టింగ్‌తో మెప్పించాడు. ప్రియదర్శిని రామ్, శివాత్మిక తమ నటనతో మెప్పించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

పంచలైన్.. ఈఎన్ఈ రిపీట్... సరదగా సాగే కామెడీ ఫన్ రైడ్

రేటింగ్: 3/5

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Movie Review
Telugu News