SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ENE Repeatలో ఆ నలుగురులో ఒక్కడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీనాథ్.. విశ్వక్‌సేన్, అభినయ్‌కు ధీటుగా..

ENE Repeat:'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat)లో ఆ నలుగురులో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనాథ్ మాగంటి. ఈ చిత్రంలో కార్తీక్ పాత్రలో మంచి ఈజ్ చూపించాడు. అంతేకాదు అతని లవ్ మ్యారేజ్ చుట్టే ఈ సినిమా ఉండటం విశేషం.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 22, 2026, 15:37 IST | Updated: Nov 22, 2026, 22:43 IST
Image Credit: Srinath (Source/File)
Join

ENE Repeat Srinath Maganti:'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'ఈఎన్ఈ రిపీట్'లో నలుగురు కురరాళ్ల గ్యాంగ్‌లో కొత్త కుర్రాడిగా శ్రీనాథ్ మాగంటి తన మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎవరీ కుర్రాడు అందరు మాట్లాడుకునేలా చేస్తున్నాడు. ముందుగా ఈ పేరును ప్రకటించినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సుశాంత్ రెడ్డి ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆయన స్థానంలో శ్రీనాథ్ వచ్చాడు. అయితే ఇప్పుడు అదే విమర్శలను, ట్రోల్స్‌ను తన  యాక్టింగ్‌తో మెప్పించడమే కాదు.. తిట్టిన నోళ్లతోనే  ప్రశంసలుగా అందుకుంటున్నాడు శ్రీనాథ్.

విశ్వక్ సేన్, అభినవ్ గోమఠంలతో కలిసి లీడ్ రోల్లో  నటించిన శ్రీనాథ్  తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. ఈ సినిమా సక్సెస్‌‌తో అతనికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇతర నటులను అనుకరించడానికి ప్రయత్నించకుండా తరుణ్ భాస్కర్ ఊహించుకున్న పాత్రకు తగ్గట్టుగా, తన పాత్రలో ఒదిగిపోయిన తీరు బాగుంది.  

శివాత్మిక రాజశేఖర్‌‌తో శ్రీనాథ్ మాగంటి స్క్రీన్ పై  కెమిస్ట్రీ, ఇద్దరి జంట తెరపై అందరినీ అట్రాక్ట్ చేసింది. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని కోణాల్లో శ్రీనాథ్ ఆడియెన్స్‌ని మెప్పించారు. మొత్తానికి తనకు లభించిన ఈ ఛాన్స్‌ను  సవాలును స్వీకరించి, ఒక నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పాత్రలతో ఇతను అలరించడం పక్కా చెప్పొచ్చు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES