• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. విశ్వక్‌సేన్ ‌కు పోటా పోటీగా శ్రీనాథ్ మాగంటి..

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. విశ్వక్‌సేన్ ‌కు పోటా పోటీగా శ్రీనాథ్ మాగంటి..

ENE Repeat Trailer: ప్రస్తుతం తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఈ కోవలో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఈ నగరానికి ఏమైంది 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్‌తో పాటు శ్రీనాథ్ మాగంటి ట్రైలర్‌లో ఇంప్రెస్ చేశారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 03, 2026, 11:51 AM IST|Updated: Nov 04, 2026, 11:54 AM IST
joinshare
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. విశ్వక్‌సేన్ ‌కు పోటా పోటీగా శ్రీనాథ్ మాగంటి..
Image Credit: ENE 2 (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tirumala: తిరుమల భక్తులకు బంపర్ శుభవార్త.. గణనీయంగా తగ్గిన భక్తుల రద్దీ.. జెట్ స్పీడ్‌లో శ్రీవారి దర్శనం..

Tirumala: తిరుమల భక్తులకు బంపర్ శుభవార్త.. గణనీయంగా తగ్గిన భక్తుల రద్దీ.. జెట్ స్పీడ్‌లో శ్రీవారి దర్శనం..

2

Delhi Company Diwali Gift iPhone 16: దీపావళి వేళ అదిరిపోయే సర్‌ప్రైజ్..ఉద్యోగులకు ఐఫోన్ 16 మొబైల్ గిఫ్ట్! వీడియో వైరల్!

3

Suryakumar Yadav: లక్నో టీమ్‌లోకి సూర్యకుమార్ యాదవ్.. ముంబై ఇండియన్స్ నుంచి క్లారిటీ..!

4

Bengaluru: బెంగళూరులో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తుండగా భారీ పేలుడు.. వీడియో వైరల్..

5

సైనికులు కావాలనే మీ పిల్లల కలను సాకారం చేసుకోండిలా.. సైనిక్ స్కూల్స్ ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vishwak Sen - Srinath Maganti: ‘ఈ నగరానికి ఏమైంది’  సినిమాకి ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.  ఇక ఇందులో నలుగురి కుర్రాళ్ల క్యారెక్టర్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. మళ్లీ ‘ఈ నగరానికి ఏమైంది 2’ చిత్రంలో నలుగురు కుర్రాళ్లు సందడి చేయడానికి రాబోతోన్నారు. ఈ సారి నలుగురి కుర్రాళ్లలో శ్రీనాథ్ మాగంటి కొత్తగా కనిపించబోతోన్నారు. కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి ట్రైలర్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు.  ENE2 చిత్రాన్ని నవంబర్ 19న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే మళ్లీ ఆ నాలుగు పాత్రలు చుట్టే కొత్తగా ఓ కథను చెప్పబోతున్నాడు దర్శకుడు.

విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ ఎప్పటిలానే తమ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇక ఆ గ్యాంగులో కొత్తగా చేరిన శ్రీనాథ్ సైతం అదరగొట్టేశాడు. ఆల్రెడీ ఆడియెన్స్‌లో రిజిష్టర్ అయిన పాత్రలో మెప్పించడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు.  అయితే ఈ ట్రైలర్‌ను చూస్తే శ్రీనాథ్ ఈ కార్తిక్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆ గ్యాంగ్‌లో ఒకడిగా కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది.

ట్రైలర్‌లో కార్తీక్‌గా శ్రీనాథ్ కామెడీ టైమింగ్, లుక్, ప్రజెన్స్ అన్నీ ప్రత్యేకంగా నిలిచాయి. విశ్వక్‌సేన్, అభినవ్ గోమఠం మరోసారి తమ కామెడీ యాటిట్యూడ్‌తో మెప్పించారు. మరోవైపు శ్రీనాథ్ సరికొత్తగా కనిపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది.  ఈ చిత్రంలో నగర యువకుడిగా కనిపించనున్నాడు. రెగ్యులర్‌గా 9 to 6 జాబ్ మాదిరి కాకుండా ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఉన్న కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. మరి ఈ సినిమా దర్శకుడితో పాటు ఇందులో నటించిన విశ్వక్ సేన్, శ్రీనాథ్‌, అభినవ్ గోమఠంలకు మంచి పేరు తీసుకురావడం గ్యారంటీ అని చెబుతున్నారు. విశ్వక్ సేన్ విషయానికొస్తే.. ఫంకీ, కల్ట్ మూవీలతో పలకరించాడు. ఈ సినిమాలు ఏవి ఆశించిన విజయాలు నమోదు చేయలేదు.

శ్రీనాథ్ మాగంటి విషయానికొస్తే.. హిట్’ ఫ్రాంచైజీలో ఈయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అటు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ లో సూరజ్ క్యారెక్టర్ లో ఇరగదీసాడు. ఇతని నటన ప్రాభవం తెలుగు చిత్ర సీమకే పరిమితం కాలేదు. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ‘యానిమల్’ మూవీలో హిందీ చిత్ర పరిశ్రమలో సత్తా చాటాడు. రష్మిక బ్రదర్ క్యారెక్టర్‌లో మెప్పించాడు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie