Fahadh Faasil: నేను వేసుకున్న బంగారం మొత్తం నా భార్యవే.. ఫహాద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Fahadh Faasil: ‘ఆవేశం’ సినిమాలో రంగా అన్నగా ఫహాద్ ఫాజిల్ ధరించిన భారీ బంగారు ఆభరణాల వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ గోల్డ్ మొత్తం తన భార్య నజ్రియా నజీమ్‌దేనని ఫహాద్ వెల్లడించిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Fahadh Faasil: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫహాద్ నటించిన ‘ఆవేశం’ సినిమాలో రంగా అన్న పాత్ర ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయన వేసుకున్న భారీ బంగారు ఆభరణాలు, డిఫరెంట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ బంగారు ఆభరణాల వెనుక ఉన్న అసలు కథను ఫహాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. రంగా పాత్ర కోసం కాస్ట్యూమ్ ట్రయల్స్ చేస్తున్న సమయంలో తెలుపు రంగు దుస్తులతో పాటు భారీ గోల్డ్ జువెలరీని కూడా ట్రై చేశారట.
ఆ సమయంలో తన లుక్‌కు ఉపయోగించిన బంగారు ఆభరణాలు తనవి కాదని ఫహాద్ సరదాగా వెల్లడించారు. “ఆ గోల్డ్ అంతా నా భార్యదే” అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన భార్య, నటి నజ్రియా నజీమ్‌కు ఆ లుక్ చాలా నచ్చిందని కూడా ఫహాద్ సరదాగా చెప్పినట్లు సమాచారం. ఫహాద్, నజ్రియాలు భార్యాభర్తలు మాత్రమే కాకుండా సినిమాలకు సంబంధించిన విషయాల్లో కూడా కలిసి పనిచేస్తుంటారు. ‘ఆవేశం’ సినిమాకు నజ్రియా కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఇక నిజ జీవితంలో కూడా తమ ఇద్దరి మధ్య ఉన్న సరదా బంధాన్ని ఫహాద్ మరోసారి బయటపెట్టారు. “నజ్రియా రంగా.. నేను అంబాన్” అంటూ ఆయన చేసిన కామెంట్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఫహాద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’లో రంగా పాత్రకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆయన మాట్లాడే విధానం, డ్రెస్సింగ్, గోల్డ్ జువెలరీ, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు రంగా పాత్రకు సంబంధించిన ఈ చిన్న ఆసక్తికరమైన విషయం బయటకు రావడంతో ఫహాద్, నజ్రియా అభిమానులు సోషల్ మీడియాలో దీనిని షేర్ చేస్తున్నారు. సినిమాలో రంగా లుక్‌కు మెరిసిన బంగారం మొత్తం తన భార్యదే అని ఫహాద్ చెప్పడం ఇప్పుడు వైరల్ టాపిక్‌గా మారింది.
Also Read: టాలీవుడ్‌లో ట్రేడ్ సర్కిల్స్‌లో రామాయణ, జైలర్ 2 సినిమాల బిజినెస్ డీల్స్..
Also Read: అనిరుథ్‌ను భయపెడుతున్న సాయి అభ్యంకర్..