Anirudh Vs Sai Abhyankkar: అనిరుధ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు సాయి అభ్యంకర్. ఇన్నాళ్లూ దక్షిణ భారత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అనిరుధ్ పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఆయనకు ధీటుగా సాయి అభ్యంకర్ వస్తున్నారు.. పదేళ్ల కింద అనిరుధ్ దూకుడు ఎలా ఉండేదో.. ఇప్పుడు అలాంటి దూకుడే చూపిస్తున్నారు సాయి అభ్యంకర్.
ఒకపుడు సినీ సంగీతాన్ని ఏలారు..
అవును ఒకపుడు దక్షిణాది సినీ సంగీతాన్ని కేవి మహదేవన్ మకుటం లేని మహారాజుగా ఏలారు. ఆ తర్వాత ఎం.ఎస్.విశ్వనాథన్ కూడా దక్షిణ భారత సినీ సంగీతాన్ని ఏలారు. ఆ తర్వాత ఇళయరాజా ఓ రెండు దశాబ్దాల పాటు సినీ సంగీతానికి చక్రవర్తిగా తన పాటలతో అలరించారు. ఆ తర్వతా ఏఆర్ రెహమాన్‌తో సంగీతం కొత్త పుంతలు తొక్కింది. ఇలా ఒక్కో తరంలో ఒక్కో సంగీత దర్శకుడు ప్రేక్షకులను అలరించడం అనేది ఎప్పటి నుంచో ఉంది.
సాయి అభ్యంకర్ విషయానికొస్తే.. తెలుగులో అట్లీ, అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు.. తమిళంలో సూర్య ‘కరుప్పు’తో స్టార్ అయ్యాడు సాయి అభ్యంకర్. నెక్ట్స్ సూర్య సినిమాతో పాటు ధనుష్ సినిమాకు ఛాన్స్ అందుకున్నాడు. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ అతని చేతిలో ఉన్నాయి.
మరోవైపు అనిరుధ్ కూడా తక్కువేం కాదు.. వరుస అవకాశాలు అందుకుంటున్నారు.. అనిరుధ్ చేతిలోనూ భారీ ఆఫర్స్ ఉన్నాయి..ఇప్పటికిప్పుడు అనిరుధ్‌కు సాయి పోటీ అనలేం కానీ తక్కువ అంచనా మాత్రం వేయలేము. అనిరుథ్ జైలర్ 2తో పాటు తెలుగులో బాలయ్య, కొరటాల శివ సినిమాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
సాయి వర్సెస్ అనిరుథ్..
ఏది ఏమైనా తమిళ సినీ దర్శకులకు హీరోలకు అనిరుథ్ కాకుంటే.. సాయి అభ్యంకర్ ఉన్నాడనే ధీమా ఉంది. వీరిద్దరితో పాటు జీవి ప్రకాష్ సైలెంట్‌గా వచ్చిన అవార్డు విన్నింగ్ చిత్రాలతో దూకుడు చూపిస్తున్నాడు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు పోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. పాత, కొత్త కలయికతో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సంగీత దర్శకులు తమ ఉనికిని చాటుకుంటున్నారు.