Eshwar sai wife sharanya suicide attempt Video: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మాధురీ రాథోడ్ పెట్టిన పలు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా ఈశ్వర్ సాయి ఇంకా అజ్ఞాతం నుంచి బైటకు రాలేదు. మరోవైపు ఈశ్వర్ సాయి భార్య శరణ్య తాను ఇంకా బతకనని చెబుతూ ఎమోషనల్ గా మాట్లాడిన ఒక వీడియో వైరల్గా మారింది. దీనిలో శరణ్య కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడింది.
నేను ఈ పోరాటంలో మోసపోయాను
ఈశ్వర్ లేకపోతే నేను బతకలేను
బలవన్మరణానికి ప్రయత్నించిన ఈశ్వర్ సాయి భార్య శరణ్య
నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి
నా జీవితాన్ని ఆగమాగం చేశారు.. నాకు ఇదొక్కటే మార్గం కనిపిస్తోంది
ఈ ద్రోహాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఆడియో విడుదల… https://t.co/LYMjCGNmQL pic.twitter.com/AGersQ48SG— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026
ఈశ్వర్ సాయి బ్రదర్ వాళ్లు తనని ఏమైన చేశారో తెలీదని లేదా మాధురీ రాథోడ్ వద్దకే వెళ్లాడో తెలీదని ఎమోషనల్ అయ్యింది. నా జీవితం అంతా అయిపోయిందిని.. తనులేకపోతే చచ్చిపోతానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఎవరు ఏంచేశారో.. నన్ను ఎన్ని మాటలు అన్నాడన్నారు. తనకు ఎదురైన ద్రోహన్ని మర్చిపోలేనన్నారు. పొరాటం చేయడం నా వల్ల కాదని, నన్ను సపోర్ట్ చేసిన వారికి థైంక్స్ చెప్పారు. దయచేసి నా బిడ్డను జాగ్రత్తగా చూసుకొవాలని మాట్లాడింది.
తమ ఏడెళ్ల కాపురంను సాయి ఇంత ఈజీగా ఎలా మర్చిపోయాడో కూడా తెలియడంలేదని కన్నీళ్లు పెట్టుకుంది. నా జీవితం, నా బిడ్డకు జీవితం ఏదికన్పించడంలేదన్నారు. పెళ్లైన అబ్బాయితో ఆమె ఎఫైర్ పెట్టుకొవడం ఏంటని, ఇద్దరి ఎఫైర్ వల్ల, ఒకరి కుటుంబమయ్యిందన్నారు. నా భర్త, కుటుంబం అనుకుంటే తప్ప ఇది కాదని.. అన్ని అబద్దాలేనంటూ మాట్లాడారు.
నా జీవితంను పూర్తిగా ఆగఆగమాగం చేశారన్నారు. సొసైటీ మారాలి, జనాలు న్యాయంవైపు ఉండాలని కోరుకుంటూ.. మీ అందరు నా బిడ్డను చూసుకొవాలని చెబుతూ శరణ్య తనకు ఇంకా చావుతప్ప మరో మార్గం కన్పించడంలేదని కన్నీళ్లు పెట్టుకుంది.
నాన్న.. సాయిని ఎక్కువగా నమ్మావు.. సారీ.. నా బాబు జాగ్రత్త.. ఇది మాత్రమే.. నా కోసం చేయండి..ప్లీజ్.. అంటూ శరణ్య ఆత్మాహత్యయత్నంకు పాల్పడింది. ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.