SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కాలేజీ రోజులను గుర్తు చేసే ‘హైకూ’.. సినిమా పై కోన వెంకట్ మాస్ రివ్యూ..

Haiku: ఏగ‌న్‌, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ నాయికా, నాయకులుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హైకూ’. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై తెరెక్కుతోంది. ఈ చిత్రం పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 17, 2026, 07:44 PM IST | Updated: Oct 18, 2026, 02:47 PM IST
Image Credit: Haiku Movie (X/Source)
Join

Haiku Press Meet: ‘హైకూ’ టైటిల్‌తోనే ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.  ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాయి. అక్టోబ‌ర్ 23న మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ప్రముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్,  డైరెక్టర్ రామ్ జగదీశ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నా మనుసుకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా కథ వినగానే బాగా నచ్చి వెంటనే ఓకే చేసినట్టు తెలిపారు. లవ్ లో ఉన్నా, రిలేషన్ షిప్ లో ఉన్నా, మ్యారీడ్ కపుల్ అందరికీ ఈ సినిమా తప్పుకుండా నచ్చుతుందన్నారు.  లవ్ ఉన్న కాంప్లికేషన్స్ మొత్తం ఈ సినిమాలో చూస్తారన్నారు. ఏగన్ డౌన్ తో ఎర్త్. ఆయనతో కలిసి పని చేయడం బాగుంది.  

హీరో ఏగన్ మాట్లాడుతూ.. ‘‘నేను ఇండస్ట్రీకి కొత్త. హైకూ సినిమా నా మనస్తత్వానికి నచ్చిన పాత్ర.  బాగా కష్టపడి సినిమా చేశాము. ఈ సినిమాపై నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సిద్దు కుమార్ బెస్ట్  ఇచ్చారు.  డైరెక్టర్ యువరాజ్ చిన్నస్వామి నాకు పదేళ్లుగా తెలుసు. ఇప్పుడే మేమిద్దరం కలిసి సినిమా చేశాము. 200 పర్సెంట్ హైదరాబాద్ లో మళ్ళీ హైకూ సక్సెస్ మీట్ లో కలుద్దామని కాన్ఫిడెన్స్‌గా చెప్పారు.

డైరెక్టర్ రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. ‘‘హైకూ తమిళ సినిమా ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. హైకూ కి నా పర్సనల్ స్పెషల్ ఇంట్రెస్ట్ జాబిలీ (శ్రీదేవి). ఆమెకు ఇది తమిళ్ డెబ్యూ. ఆవిడ కళ్ళతో ఏ భాష అయినా మాట్లాడగలదన్నారు. ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడింది. సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు.
             
కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘‘హైకూ అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ చూడగానే కూల్‌గా, ఆహ్లాదంగా అనిపించింది. ముందే ఓటీటీకి అమ్మేసి అప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం నిజంగా గ్రేట్ అన్నారు. నెట్ ఫ్లిక్స్ వారికీ స్టోరీ చెప్పి ఈ హైకూ తీశారంటే వాళ్ళని ఈ స్క్రిప్ట్ ఎంత మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కథ కచ్చితంగా అందరినీ ఎగ్జైట్ చేయడం పక్కా అన్నారు. ఇది ఒక సిన్సియర్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో కాలేజ్ లైఫ్ లోని సాదకబాదకాలను  చూపించారు. మనల్ని మళ్ళీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. స్పెషల్ గా ఈ సినిమాను శ్రీదేవి కోసం చూడాలన్నారు. ఏగన్ వెల్ కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అంటూ ముగించారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES