SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

హీరోయిన్స్‌కు తలనొప్పిలా మారిన బాడీ షేమింగ్.. బోల్డ్‌గా రిప్లై ఇస్తున్న భామలు..

Social Media Body Shaming: సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై బాడీ షేమింగ్, పర్సనల్ ఎటాక్స్ రోజురోజుకూ శృతిమించి రాగాన పడుతున్నాయి. ట్రోలర్స్ చేసే నెగెటివ్ కామెంట్స్ చూసి సైలెంట్‌గా భరించే రోజులు పోయాయని కథానాయికగా వారి కౌంటర్‌కు ఎన్‌కౌంటర్ చేస్తున్నారు. అంతేకాదు ఓపెన్‌గానే ఘాటు రిప్లై ఇస్తున్నారు. తమ పర్సనల్ లైఫ్, ఫిజిక్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ తాట తీస్తున్నారు. మరి అలా బోల్డ్‌గా ఓపెన్ అయిపోతున్నరు ఈ భామలు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 12, 2026, 06:56 AM IST | Updated: Oct 12, 2026, 06:57 AM IST
Image Credit: Heroins Body Shaming (File Pics/Source)
Join

Heroins Strong Reply: ఓ పిల్లాడు  పుట్టాక తన బాడీ షేప్‌పై వచ్చిన ట్రోల్స్‌కు లండన్ ఈవెంట్‌లో కత్రినా కైఫ్ గట్టిగానే ఇచ్చి పడేసింది ఆన్‌లైన్ ట్రోల్స్‌కు భయపడితే లైఫ్‌లో  ముందుకు సాగలేమని చెప్పుకొచ్చింది. ఎవరేమన్నా మన కాన్ఫిడెన్స్ కోల్పోకూడదని ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్‌తో పాటు కౌంట్ ఇచ్చింది కత్రినా. అటు కియారా అద్వానీ సైతం తల్లైనపుడు   తన బాడీ షేమింగ్ పై  వచ్చిన నెగెటివ్ కామెంట్స్‌ను బోల్డ్‌గా తిప్పికొట్టి కొంత మంది కావాలని చేస్తోన్న దుష్ప్రచారానికి బోల్డ్ ఆన్సర్ ఇచ్చి వాళ్లు నోళ్లు మూయించింది.

శృతి హాసన్.. 
ఏ విషయమైనా సూటిగా మాట్లాడే శృతి హాసన్.. తాజాగా మరో సెన్సేషనల్ ఇష్యూపై ఓపెన్ అయ్యారు. అడల్ట్ టాయ్స్ వాడకమనేది పూర్తిగా మహిళల సెల్ఫ్ కేర్‌కు సంబంధించిన విషయమన్నారు.  దీనికోసం ఎవరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదని చాలా ఘాటుగానే ఓపెన్ అయింది. తన పర్సనల్ లైఫ్, హెల్త్ ఇష్యూస్‌పై ఎప్పుడూ దాచుకోని శృతి.. మహిళల పర్సనల్ ఫ్రీడమ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మృణాల్ ఠాకూర్..

గతంలో తన బాడీ షేప్ చూసి కొన్ని పాత్రలకు పనికిరావని ఓ డైరెక్టర్ కామెంట్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ మృణాళ్ ఠాకూర్ బోల్డ్‌గా రియాక్ట్ అవ్వడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ నెగెటివిటీ దాటుకుని వచ్చిన ఈ భామ.. మహిళలు తమ బాడీ కొలతలను గర్వంగా సెలబ్రేట్ చేసుకోవాలని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇవ్వడాన్ని అందరు ముక్కున వేలేసుకునేలా చేసింది. వీళ్లే కాదు చాలా మంది హీరోయిన్లు ఏ విషయాన్ని దాచుకోకుండా ఓపెన్ అవుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES